Chanakya Niti: ఒకొక్కసారి వైఫల్యం కూడా విజయానికి బాటలు వేస్తుంది అంటున్న చాణక్య..

ఒక వ్యక్తి తన లక్ష్యం, కష్టపడి పనిచేయడం,  వైఫల్యం నుండి నేర్చుకోవడం తో విజయ ఫలితం నిర్దేశింపబడుతుంది. చాలా మంది తమ వైఫల్యాల నుంచి సక్సెస్ కు బాటలు వేసుకోవచ్చు అని చాణక్యుడు చెప్పాడు. ఇవి విజయానికి దారి బాటలు వేస్తాయి. 

Chanakya Niti: ఒకొక్కసారి వైఫల్యం కూడా విజయానికి బాటలు వేస్తుంది అంటున్న చాణక్య..
Chanakya Niti
Follow us

|

Updated on: Dec 23, 2022 | 9:38 AM

ఆచార్య చాణక్యుడు వ్యూహకర్త, గొప్ప ఆర్థికవేత్త. చాణక్యుడికి సమాజం పట్ల లోతైన అవగాహన ఉంది. తన జీవితంలో కలిగిన అనుభవాలను అనేక పుస్తకాలుగా రచించారు. వాటిల్లో నీతి శాస్త్రం, అర్ధ శాస్త్రం వంటివి ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్నాయి. చాణుక్యుడు నీతి శాస్త్రంలో పేర్కొన్న విధానాలు నేటి కాలంలో కూడా అనుసరనీయం. అపజయం విజయానికి మొదటి మెట్టు. ఆచార్య చాణక్య ప్రకారం.. విజయం సాధించడానికి ప్రత్యేక సూత్రం అంటూ ఏమీ లేదు. ఇది ఒక వ్యక్తి తన లక్ష్యం, కష్టపడి పనిచేయడం,  వైఫల్యం నుండి నేర్చుకోవడం తో విజయ ఫలితం నిర్దేశింపబడుతుంది. చాలా మంది తమ వైఫల్యాల నుంచి సక్సెస్ కు బాటలు వేసుకోవచ్చు అని చాణక్యుడు చెప్పాడు. ఇవి విజయానికి దారి బాటలు వేస్తాయి.

వైఫల్యం నుండి ఈ విషయాలు నేర్చుకోవచ్చు

  1. అపజయానికి భయపడి నిర్ణయాలను మార్చుకునే వ్యక్తి ఎప్పటికీ విజయం సాధించలేడని చాణక్యుడు చెప్పాడు. తన ప్రయత్నాలు వైఫల్యం చెందినా విజయం అందేవరకూ కొనసాగాలని ఆయన అభిప్రాయపడ్డారు.
  2. నిరాశ, అపజయాల మీదుగానే విజయపథం సాగుతుందనేది చేదు నిజం. మీరు ఏదైనా పనిలో విఫలమైతే, నిరుత్సాహపడకండి .. విజయం అందేవరకూ ప్రయత్నిస్తూ ఉండండి.
  3. ఇవి కూడా చదవండి
  4. ఎక్కడో ఒక చోట కష్టపడకపోవడమే అపజయానికి ప్రధాన కారణం కాబట్టి విజయం సాధించే వరకు ఎన్ని కష్టాలు ఎదురైనా ఆగకూడదని చాణక్యుడు తన విధానం అని పేర్కొన్నాడు.
  5. ఆచార్య చాణక్య..  విమర్శలు మనసులో ప్రతికూల భావాలను కలిగిస్తాయి. విమర్శలను ఒక చెవిలోంచి వింటూ మరో చెవిలోంచి బయటకి పంపించేయడం మంచిదని చాణక్యుడు చెప్పాడు.
  6. మిమ్మల్ని విమర్శించిన వ్యక్తులతో సంబంధం లేకుండా మీ లక్ష్యం వైపు విజయం సాధించే వరకూ ఉండండి పయనిస్తూ ఉండండి అంటున్నాడు చాణక్యుడు.
  7. ఎంత కష్టపడినా విజయం దక్కలేదని.. విచారణ పడే బదులు.. అసలు లోపం ఎక్కడ ఉందో అంటూ ఆత్మపరిశీలన చేసుకోవాలని చాణక్య నీతి చెబుతోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)