AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Marriage Dates in 2023: కొత్త ఏడాదిలో పెళ్లి భాజా భజంత్రీలకు శుభ ముహర్తలు ఏ తేదీల్లో ఉన్నాయో తెలుసా..

వివాహాలు నిశ్చయించించడం కోసం వివాహానికి అనుకూలమైన తేదీల కోసం జ్యోతిష్యులను సంప్రదిస్తారు. ఈ నేపథ్యంలో 2023లో వివాహానికి చాలా శుభ ముహూర్తాలు ఉన్నాయి.

Marriage Dates in 2023: కొత్త ఏడాదిలో పెళ్లి భాజా భజంత్రీలకు శుభ ముహర్తలు ఏ తేదీల్లో ఉన్నాయో తెలుసా..
Marriage
Surya Kala
|

Updated on: Dec 22, 2022 | 8:37 PM

Share

హిందూ ధర్మంలో పురాతన నమ్మకాల ఆధారంగా అనేక ఆచారాలను పాటిస్తారు. అయితే వీటిలో 16 ఆచారాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఒక వ్యక్తి పుట్టినప్పటి నుండి మరణించే వరకు ఇవి పాటిస్తారు. ఈ ఆచారాల్లో ఒకటి వివాహ వేడుక. హిందూ మతంలో వివాహ వేడుక చాలా పవిత్రమైన బంధంగా పరిగణించబడుతుంది. వివాహానికి అనుకూలమైన సమయం కూడా అనేక విషయాలను పరిగణలోకి తీసుకుంటారు. శుభ ముహూర్తాలు లేకుండా పెళ్లి చేసుకోవడం నిషిద్ధం. హిందూ మతంలో.. ముహూర్తం, శుభసమయం  చూడకుండా ఎటువంటి మతపరమైన ఆచారాలు నిర్వహించబడవు. వధూవరుల జాతకాన్ని సరిపోల్చి.. తద్వారా వివాహ వేడుకకు శుభ ముహార్తాన్ని లెక్కిస్తారు.

రానున్న కొత్త ఏడాదిలో హిందూ క్యాలెండర్ ప్రకారం.. వివాహానికి చాలా పవిత్రమైన సమయాలు ఉన్నాయి. వివాహాలు నిశ్చయించించడం కోసం వివాహానికి అనుకూలమైన తేదీల కోసం జ్యోతిష్యులను సంప్రదిస్తారు. ఈ నేపథ్యంలో 2023లో వివాహానికి చాలా శుభ ముహూర్తాలు ఉన్నాయి. 2023లో వివాహానికి శుభ ముహూర్తాలు ఎప్పుడో తెలుసుకుందాం.

జనవరి 2023లో వివాహానికి అనుకూల సమయం 15, 18, 25, 26, 27, 30 తేదీలు

ఇవి కూడా చదవండి

ఫిబ్రవరి 2023లో వివాహానికి అనుకూల సమయం 06, 07, 09, 10, 12, 13, 14, 16, 22, 23, 27 , 28 ఫిబ్రవరి

మార్చి 2023లో వివాహానికి అనుకూల సమయం మార్చి 06, 09, 11 , 13వ తేదీలు

ఏప్రిల్ 2023లో వివాహానికి అనుకూల సమయం ఈ నెలలో పెళ్ళికి శుభ ముహర్తలు లేవు

మే 2023లో వివాహానికి అనుకూల సమయం 03, 06, 08, 09, 10, 11, 15, 16, 20, 21, 22, 29 సహా 30వ తేదీ

జూన్ 2023లో వివాహానికి అనుకూల సమయం 01, 03, 05, 06, 07, 11, 12, 23 , 26 జూన్

జూలై నుంచి అక్టోబర్‌లలో వివాహానికి అనుకూలమైన సమయం హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి సంవత్సరం వివాహది శుభకార్యాలు  ఆషాడ మాసంలోని తొలి ఏకాదశి నుండి దేవుతాని ఏకాదశి వరకు నిర్వహించరు. ఈ నాలుగు నెలల వరకు చాతుర్మాస దీక్షను చేపడతారు. చాతుర్మాసం ప్రారంభంతో వివాహం, క్షవరం , గృహ ప్రవేశం మొదలైన పనులు చేయడం నిషేధం. అటువంటి పరిస్థితిలో.. జూలై నుండి అక్టోబర్ వరకు వివాహానికి శుభ ముహర్తలు లేవు. .

నవంబర్ 2023లో వివాహానికి అనుకూల సమయం 23, 27, 28 , 29 నవంబర్

డిసెంబర్ 2023లో వివాహానికి అనుకూల సమయం 06, 07, 09,15 డిసెంబర్

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)