Vastu Tips for New Year: ఈ వాస్తు టిప్స్ పాటించింది చూడండి.. కొత్త ఏడాదిలో ఆర్థికాభివృద్ధి మీ సొంతం..

కొత్త సంవత్సరం మరింత మెరుగ్గా ఉండేందుకు వాస్తుకు సంబంధించిన కొన్ని చర్యలు తీసుకోవాలి. ఈ వాస్తు నియమాలతో..  మీరు ఏడాది పొడవునా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. అంతేకాదు మీ ఇంట్లో సుఖ సంపదలు నెలకొంటాయి

Vastu Tips for New Year: ఈ వాస్తు టిప్స్ పాటించింది చూడండి.. కొత్త ఏడాదిలో ఆర్థికాభివృద్ధి మీ సొంతం..
Happy New Year Vastu Tips
Follow us
Surya Kala

|

Updated on: Dec 22, 2022 | 6:02 PM

కొత్త సంవత్సరంలోకి మరికొన్ని రోజుల్లో అడుగు పెట్టనున్నాం.. ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరం మొత్తం ఆనందంతో గడపాలని.. ప్రతి రోజు శుభప్రదంగా సాగాలని కోరుకుంటాడు. అంతే కాకుండా ఇంట్లో సుఖ సంతోషాలు, సౌభాగ్యం, శాంతి నెలకొనడంతోపాటు కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం కూడా ఫిట్‌గా ఉండాలని భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం..  కొత్త సంవత్సరం మరింత మెరుగ్గా ఉండేందుకు వాస్తుకు సంబంధించిన కొన్ని చర్యలు తీసుకోవాలి. ఈ వాస్తు నియమాలతో..  మీరు ఏడాది పొడవునా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. అంతేకాదు మీ ఇంట్లో సుఖ సంపదలు నెలకొంటాయి. కనుక రానున్న సంవత్సరం 2023 సంతోషంగా ఉండడం కోసం  కొన్ని వాస్తు చిట్కాలను తెలుసుకుందాం.

  1. ఇంటి ప్రధాన ద్వారాన్ని ఇలా ఉంచండి:వాస్తు ప్రకారం..  ఇంటి ప్రధాన ద్వారం ఆ ఇంటి కుటుంబ సభ్యుల జీవితంలో సుఖ సంతోషాలతో ముడిపడి ఉంటుంది. మీరు కొత్త ఇంటిని నిర్మిస్తున్నట్లయితే..  ప్రధాన ద్వారం ముందు చెట్టు, విద్యుత్ స్తంభం లేదా చెరువు ఉండకూడదని గుర్తుంచుకోండి. ఇంటి మెయిన్ డోర్ సైజులో కొంచెం పెద్దదిగా ఉండేలా చూసుకోండి. అంతే కాకుండా ప్రధాన ద్వారం వద్ద ఎప్పుడూ చెత్త వేయకూడదు. ఇలా మెయిన్ డోర్ దగ్గర చెత్త ఉండడం వలన లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందని.. .. అది లక్ష్మీదేవి నివాసం అని నమ్మకం.
  2. నెమలి ఈకలు:ఇంట్లో నెమలి ఈకను ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు. నెమలి ఈక శ్రీకృష్ణునికి సంబంధించినది కాబట్టి..  దానిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల డబ్బుకు లోటు ఉండదని.. ఇంట్లో సుఖశాంతులు లభిస్తాయని నమ్ముతారు. జీవితంలో వచ్చే సమస్యలు కూడా దూరమవుతాయి.
  3. లాఫింగ్ బుద్ధ: వాస్తు ప్రకారం లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. న్యూ ఇయర్ సందర్భంగా, ఇంట్లో లాఫింగ్ బుద్ధను ఖచ్చితంగా తీసుకురండి.. ఎందుకంటే లాఫింగ్ బుద్ధ ఆ ఇంటి సభ్యులకు ఆనందాన్ని కలిగిస్తుందని,  కుటుంబ సభ్యులందరిలో ప్రేమను కూడా పెంచుతుందని నమ్ముతారు. ఇంట్లోని డ్రాయింగ్‌లో లాఫింగ్ బుద్ధను ఉంచాలి.
  4. అక్వేరియం ఉంచడం శుభప్రదం:వాస్తు ప్రకారం, ఇంట్లో అక్వేరియం ఉంచడం వల్ల శుభం కలుగుతుంది. అంతేకాదు ఇది మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చెడు దృష్టి నుంచి రక్షిస్తుంది. మీ ఇంట్లో అక్వేరియం లేకపోతే.. కొత్త సంవత్సరం రోజున  తెచ్చి ఇంటికి ఉత్తరం వైపున ఏర్పటు చేసుకోండి. ఈ దిక్కు సంపదలకు దేవుడైన కుబేరుడు అధిపతి అని నమ్ముతారు.
  5. తాబేలు ఆనందం-శాంతిని కలిగిస్తుంది: వాస్తు ప్రకారం, తాబేలు ఆనందం, శాంతికి చిహ్నంగా పరిగణించబడుతుంది. మీ ఇంట్లో ప్రతిరోజూ గొడవలు జరుగుతుంటే, కొత్త సంవత్సరంలో తాబేళ్లను కొనండి. ఇది ఇంట్లో అసమ్మతిని తగ్గిస్తుంది. ఆనందం, శాంతి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుందని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

ఇవి కూడా చదవండి