New year 2023: కొత్త ఏడాదిలో 13 తెలుగు నెలలు.. 19 ఏళ్ల తర్వాత అధిక శ్రావణం.. చేయకూడని పనులు ఏమిటో తెలుసా

2023 సంవత్సరంలో 13వ నెలను అదనపు నెల లేదా 'అధిక మాస' అంటారు. అధిక  మాసం హిందూ క్యాలెండర్‌లో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మూడేళ్లకు ఒకసారి కొత్త నెల చేరి.. 13 మాసాలు ఉంటాయి. ఈ లీపు నెలను ఎలా లెక్కిస్తారంటే.. 

New year 2023: కొత్త ఏడాదిలో 13 తెలుగు నెలలు.. 19 ఏళ్ల తర్వాత అధిక శ్రావణం.. చేయకూడని పనులు ఏమిటో తెలుసా
Extra Sravana Masam
Follow us
Surya Kala

|

Updated on: Dec 22, 2022 | 8:09 PM

మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాది 2023లో అడుగు పెట్టనున్నాం.. సర్వసాధారణం ఏడాదికి ఎన్ని నెలలు అంటే 12 నెలలు అని చెబుతాం.. కానీ ఇది ఇంగ్లిష్ క్యాలెండర్ ప్రకారం మాత్రమే.. కానీ హిందూ పంచాంగం ప్రకారం.. ప్రతి మూడు ఏళ్లకు ఒకసారి 13 నెలలు వస్తాయి. ఈ  నేపథ్యంలో 2023 లో 13 నెలలు ఉండనున్నాయి. అంటే 2023 లో హిందూ క్యాలెండర్ ప్రకారం.. 12 నెలలకు బదులుగా.. అధిక మాసంలో కలిపి పదమూడు నెలలు ఉండనున్నాయి. అంటే శ్రావణ మాసం 2023లో రెండు నెలలు జరుపుకోనున్నారు. . జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం 19 ఏళ్లకు ఒకసారి ఇలా జంట శ్రావణ మాసం వస్తుంది. దీనినే అధిక మాసం అని అంటారు.  ఈ నేపథ్యంలో ఇంగ్లిష్ కేలెండర్ ప్రకారం జులై 18 నుంచి ఆగస్టు 16 వరకు అధిక శ్రావణమాసం ఉంటుంది.

అధిక మాసం అంటే ఏమిటి?

2023 సంవత్సరంలో 13వ నెలను అదనపు నెల లేదా ‘అధిక మాస’ అంటారు. అధిక  మాసం హిందూ క్యాలెండర్‌లో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మూడేళ్లకు ఒకసారి కొత్త నెల చేరి.. 13 మాసాలు ఉంటాయి. ఈ లీపు నెలను ఎలా లెక్కిస్తారంటే..

ఇవి కూడా చదవండి

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి మూడు సంవత్సరాల తర్వాత అదనపు నెల జోడించబడుతుంది. దీనిని అధికమాసం లేదా శూన్య మాసం అని అంటారు. ఇలా రావడానికి కారణం క్యాలెండర్ లెక్కింపులో ఉన్న తేడాలే. సౌరమానం ప్రకారం కాలాన్ని లెక్కిస్తే ఏడాదికి 365 రోజుల 6 గంటలు ఉంటాయి. అదే చంద్రమానం ప్రకారమైతే ఏడాదికి 354 రోజులే ఉంటాయి. వీరిద్దరి మధ్య దాదాపు 11 రోజుల గ్యాప్ ఉంది. ఏడాది లెక్కింపులో ఉండే తేడాలను సరిచేయడానికి  ప్రతి మూడు సంవత్సరాలకు ఒక నెల అదనంగా జోడించి ఇలా అధికమాసం రూపంలో సరి చేస్తుంటారు.  దీనినే లీపు మాసం అంటారు.

2023లో అధిక శ్రావణ మాసం:  కొత్త సంవత్సరంలో శ్రావణ మాసం జూలై  18, 2023న ప్రారంభమై ఆగస్టు 16, 2023 వరకు రెండు నెలలు పాటు కొనసాగుతుంది. ఈ కాలం విష్ణుమూర్తి, శివయ్య కు నెలవుగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో శివుడిని ఆరాధించే వారికి ఎక్కువ సమయం లభిస్తుంది.

జులై 18 నుంచి ఆగస్ట్ 16 వరకూ చేయకూడని పనులు 

1.  వివాహాది శుభకార్యాలు చేయవద్దు

2. ఆగస్టు నెలలో కొత్త దుకాణాలు, కొత్త కార్యాలయాలను తెరవవద్దు.

3. కొత్త ప్రాజెక్ట్‌లు, కొత్త ఉద్యోగాల్లో చేరడం లేదా భారీ పెట్టుబడులను పెట్టడం మానుకోండి.

4. అధిక మాసంలో కొత్త గృహాల నిర్మాణం, ఆస్తుల కొనుగోళ్లు శుభప్రదంగా పరిగణించబడవు.

5. ఉపనయనం వంటి శుభ కార్యాలు చేయవద్దు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)