Astro Tips: జాతకంలో గ్రహ దోషం ఉందా.. పెళ్లి ఆలస్యం అవుతుందా.. పరిష్కారాలు ఏమిటో తెలుసుకుందాం..

మీకు కూడా పెళ్లి జరగడం లో ఆలస్యం అవుతున్నా.. లేదా మీ కుటుంబంలో ఎవరికైనా వివాహం జరగడంలో జాప్యం జరుగుతున్నా.. జ్యోతిష్యం ప్రకారం.. మీ జాతకంలో గ్రహ దోషాలు ఉండే అవకాశం ఉంది.

Astro Tips: జాతకంలో గ్రహ దోషం ఉందా.. పెళ్లి ఆలస్యం అవుతుందా.. పరిష్కారాలు ఏమిటో తెలుసుకుందాం..
Astro Tips For Early Marriage
Follow us
Surya Kala

|

Updated on: Dec 22, 2022 | 4:11 PM

యువతి యువకుల జీవితంలో పెళ్లి అనేది అతి ముఖ్యమైన వేడుక. దీంతో ప్రతి అబ్బాయి, అమ్మాయి తన మనసుకు నచ్చిన వ్యక్తి తన జీవిత భాగస్వామి కావాలని కోరుకుంటారు. అయితే కొందరికి ఈ కోరిక త్వరగా తీరుతుంది..  మరి కొందరికి డబ్బు, చదువు, మంచి ఉద్యోగం ఇలా అన్నీ ఉన్నా వివాహం ఆలస్యం అవుతుంది. తమ మనసుకు నచ్చిన వధువు లేదా వరుడిని సరైన సమయంలో కలవడం.. పెళ్లి చేసుకోవడం కూడా ఓ అదృష్టం అని నమ్ముతారు. కొందరికి వివాహం జరగడానికి చాలా సమయం పడుతుంది లేదా వివాహంలో అడ్డంకులు రావడం తరచుగా జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో.. తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. మీకు కూడా పెళ్లి జరగడం లో ఆలస్యం అవుతున్నా.. లేదా మీ కుటుంబంలో ఎవరికైనా వివాహం జరగడంలో జాప్యం జరుగుతున్నా.. జ్యోతిష్యం ప్రకారం.. మీ జాతకంలో గ్రహ దోషాలు ఉండే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో.. జ్యోతిషశాస్త్ర నివారణలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని పలు సందర్భంలో నిరూపించబడ్డాయి. ఈ నేపథ్యంలో ఈరోజు పెళ్ళికి ఆలస్యం అవడానికి కారణం..  పరిష్కారాలు ఏమిటో తెలుసుకుందాం.

సూర్యుడు అడ్డంకిగా మారినప్పుడు మీ జాతకంలో రవి పెళ్ళి జరగడానికి అడ్డంకిగా మారుతున్నట్లయితే.. తెల్లవారు జామునే నిద్రలేచి.. అభ్యంగస్నానం చేసి.. శుభ్రమైన నీటిని ఒక కుండలో తీసుకొని సూర్య భగవానుడికి సమర్పించండి. నీరు సమర్పించే ముందు.. ఆ  పాత్రలో కుంకుమ, బియ్యం, పంచదార, చందనం పొడి వేయండి.. ఇలా చేయడం వల్ల సూర్య భగవానుడు అనుగ్రహంతో త్వరగా వివాహం జరుగుతుందని నమ్మకం.

జాతకంలో బుధ దోషం ఉంటే మీ జాతకంలో బుధ గ్రహ దోషం ఉన్నట్లయితే.. వివాహంలో అవాంఛనీయ సమస్యలు వస్తాయి. ఈ అడ్డంకిని నివారించడానికి, బుధవారం దుర్గా చాలీసా పారాయణం చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. ఒకవేళ ఏదైనా కారణం వల్ల దుర్గా చాలీసా పఠనం చేయలేకపోతే, ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని జపించండి. దీంతో వివాహంలో అడ్డకుంలు తొలగుతాయని విశ్వాసం.

ఇవి కూడా చదవండి

చంద్రునికి సంబంధించిన నివారణలు జాతకంలో చంద్ర దోషం ఉన్న వారి వివాహానికి ఆటంకాలు ఏర్పడవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు ప్రతి సోమవారం శివలింగానికి పచ్చి పాలను సమర్పించాలి. పాలు సమర్పించేటప్పుడు ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని జపించండి.

జాతకంలో శని దోషం ఉన్నప్పుడు మీ జాతకంలో శనిదోషం ఉందని.. ఈ కారణంగా మీ వివాహం ఏదో ఒక కారణంతో వాయిదా పడుతుంటే.. ప్రతి శనివారం రావి చెట్టుకు నీరు సమర్పించండి. అంతే కాకుండా చెట్టు కింద నాలుగు ముఖాల దీపాలను వెలిగించండి. శని దోషం తొలగిపోవడానికి శివుడిని పూజించడం వల్ల కూడా మేలు జరుగుతుందని నమ్మకం.

అంగారక గ్రహానికి సంబంధించిన పరిహారాలు మీ వివాహంలో కుజ దోషం ఉన్నట్లయితే.. హనుమంతుడి ఆలయానికి వెళ్లి రెండు బూందీ లడ్డూలు, తమలపాకులు, లవంగాలు, యాలకులు మొదలైన వాటిని 21 మంగళవారం వరకు సమర్పించండి. అంతేకాదు ‘ఓం భౌం భౌమాయ నమః’ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి . దీనితో పాటు.. అన్నంలో  బెల్లం కలిపి ఆవుకు తినిపించడం వల్ల కూడా కుజ దోషం తొలగుతుందని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)