Prediction 2023: కొత్త సంవత్సరంలో 9 గ్రహాల కదలిక ఎలా ఉంటుంది? ఏ రాశులవారు అదృష్టవంతులు అవుతారంటే

శని అన్ని గ్రహాలలో నెమ్మదిగా కదిలే గ్రహం. దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఏదైనా ఒక రాశిలో శనీశ్వరుడు ఉంటుంది. దేవగురు బృహస్పతి రాశిని మార్చుకోవడానికి ఒక సంవత్సరం పడుతుంది. రాహు-కేతువులు వ్యతిరేక దిశలో కదులుతారు. 18 నెలల్లో రాహు,కేతువులు తమ రాశిని మార్చుకుంటారు.

Prediction 2023: కొత్త సంవత్సరంలో 9 గ్రహాల కదలిక ఎలా ఉంటుంది? ఏ రాశులవారు అదృష్టవంతులు అవుతారంటే
Horoscope Today
Follow us
Surya Kala

|

Updated on: Dec 20, 2022 | 2:45 PM

వేద జ్యోతిషశాస్త్రంలో.. ప్రతి సంఘటన వెనుక గ్రహాలు, నక్షత్రరాశుల కదలిక మరియు దిశకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గ్రహాల సంచారం ప్రజల జీవితాలపై శుభ, అశుభ ప్రభావాలను కలిగి ఉంటుంది. 2023 సంవత్సరంలో.. అనేక పెద్ద గ్రహాలు తమ కదలికలను మార్చుకోనున్నాయి. ఈ ప్రభావం మనుషులపైన మాత్రమే కాదు.. దేశం, ప్రపంచంపై ప్రభావం చూపుతుంది. జ్యోతిషశాస్త్రంలో మొత్తం 9 గ్రహాలు ఉన్నాయి..  అన్ని గ్రహాలు ఒక క్రమ విరామంలో తమ రాశిని మార్చుకుంటాయి. సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు దాదాపు ప్రతి నెలా రాశిచక్రాన్ని మార్చుకునే గ్రహాలు కాగా.. చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు తన రాశిని మార్చుకుంటాడు.

మరోవైపు..  శని అన్ని గ్రహాలలో నెమ్మదిగా కదిలే గ్రహం. దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఏదైనా ఒక రాశిలో శనీశ్వరుడు ఉంటుంది. దేవగురు బృహస్పతి రాశిని మార్చుకోవడానికి ఒక సంవత్సరం పడుతుంది. రాహు-కేతువులు వ్యతిరేక దిశలో కదులుతారు. 18 నెలల్లో రాహు,కేతువులు తమ రాశిని మార్చుకుంటారు. జ్యోతిష్య శాస్త్రంలో.. గ్రహాల రాశిచక్ర గుర్తుల్లో మార్పుతో పాటు, గ్రహాలకు ప్రత్యక్ష, తిరోగమనం, తరుగుదల, పెరుగుదల కూడా ఉన్నాయి. వీటి ప్రభావం దేశం, ప్రపంచంతో పాటు అన్నిం టిపై పడుతుంది.  2023 సంవత్సరంలో.. శని, గురు , రాహు-కేతువుల రాశి మార్పు దేశంలో..  ప్రపంచంలో విస్తృత ప్రభావాన్ని చూపుతుంది.

2023 సంవత్సరంలో గ్రహాల సంచారం గురు సంచారం: 2023 మొత్తం 9 గ్రహాలలో.. అత్యంత శుభ ఫలితాలను ఇచ్చే గ్రహం దేవగురువు బృహస్పతి. నవంబర్ 24, 2022న, బృహస్పతి తన సొంత రాశి అయిన మీనంలో తిరోగమనంలో ఉన్నాడు. ఏప్రిల్ 22, 2023 తర్వాత..  బృహస్పతి తన సొంత రాశి అయిన మీనం నుండి  మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు.

ఇవి కూడా చదవండి

శని 2023 సంచారము:  30 సంవత్సరాల తర్వాత శని 17 జనవరి 2023న తన స్వంత రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. శని చాలా నెమ్మదిగా కదిలే గ్రహం. ఫిబ్రవరి 3న కుంభరాశిలోకి ప్రవేశించిన తర్వాత శని అస్తమించనున్నాడు.

రాహువు 2023 సంచారము: రాహువు ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారడానికి 18 నెలల సమయం పడుతుంది. రాహువు ప్రస్తుతం మేషరాశిలో ఉన్నాడు. అక్టోబర్ 30, 2023 న రాహువు వెనుకకు వెళ్లి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు.

కేతువు 2023 సంచారం: అక్టోబర్ 30, 2023న రాహువుతో పాటు కేతువు తన రాశిని మార్చుకోనున్నాడు. కేతువు తులారాశి నుండి కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు.

శుక్రుడు 2023 సంచారం: శుక్రుడు 5 డిసెంబర్ 2022 నుండి ధనుస్సు రాశిలో ఉన్నాడు ఆపై డిసెంబర్ 29న మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. 2023 సంవత్సరంలో.. శుక్రుడు దాదాపు ప్రతి నెలా తన రాశిని మార్చుకుంటాడు.

కుజుడు 2023 సంచారం: కుజుడు 2023 సంవత్సరంలో.. మొదటి రాశి మార్పు మార్చి 13, 2023న జరుగుతుంది. కుజుడు వృషభరాశి నుండి మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు.

బుధుడు 2023 సంచారం: బుధుడు డిసెంబరు 31, 2022న తిరోగమనం చెంది ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆపై 2023లో ప్రతి నెలా తన రాశిని మార్చుకోనున్నాడు.

సూర్యుడు రాశి మార్పు: 2023 డిసెంబర్ 16, 2022న సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాడు. దీని తరువాత, జనవరి 16, 2023 న, సూర్యుడు ధనుస్సు నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు.

2023 సంవత్సరంలో గ్రహాలు, రాశుల కలయిక కారణంగా 2023 సంవత్సరంలో ఈ ఐదు రాశుల వారికి  అదృష్టం కలిసి వస్తుంది. వృషభం, మిథునం, తులారాశి, ధనుస్సు , మీన రాశుల వారికి కొత్త ఏడాది చాలా అదృష్టంగా ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)