Vastu Tips: ఇంట్లో ఈ వాస్తు దోషం ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు.. ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోవాలట..
ఇంట్లో సాలెపురుగులు ఉంటే పేదరికానికి చిహ్నంగా భావిస్తారు. ఇది మీ జీవితంలో వచ్చే విజయం, ఆనందాన్ని అడ్డుకుంటుంది. అటువంటి పరిస్థితిలో.. వాస్తు కొన్ని నియమాలను అనుసరించడం వలన మీ జీవితంలో వచ్చే సమస్యలను నిలువరించవచ్చు.
ఇంటి వాస్తు జీవితంలో సంతోషం , శ్రేయస్సుతో ముడిపడి ఉంటుందని హిందూ మతంలో నమ్మకం. సరైన వాస్తు పాటిస్తే.. ఆ ఇంటి యజమానికి సంపదతో పాటు ఆనందం, శాంతిని ఇస్తుంది. అయితే తప్పు వాస్తు ఉంటే సంతోషకరమైన జీవితంలో చాలా సమస్యలు ఏర్పడతాయి. మీ ఇంట్లో సాలెపురుగు ఉంటే.. అది మీ, మీ కుటుంబ పురోగతిని ప్రభావితం చేసే ప్రధాన వాస్తు దోషంగా పరిగణించబడుతుంది. సాధారణంగా ఇంటిని శుభ్రపరిచేటప్పుడు కొన్ని మూలలు లేదా భాగాలు శుభ్రం చేయ కుండా వదిలివేస్తారు. ఇంట్లో సాలె పురుగు గూడుని ఎక్కువగా అటువంటి ప్రదేశంలో కట్టుకుంటాయి. ఇలాంటి ప్లేస్ లో ఉన్న ఈ గుళ్లు సర్వసాధారణంగా కంటికి కనిపించవు. కొన్నిసార్లు మనం వీటిని చూసినా పెద్దగా పట్టించుకోము. వాస్తు ప్రకారం ఇది అశుభం. ఇంట్లో సాలెపురుగులు ఉంటే పేదరికానికి చిహ్నంగా భావిస్తారు. ఇది మీ జీవితంలో వచ్చే విజయం, ఆనందాన్ని అడ్డుకుంటుంది. అంతే కాకుండా ఇంటి అందంపై ప్రభావం చూపిస్తాయి. అటువంటి పరిస్థితిలో.. వాస్తు కొన్ని నియమాలను అనుసరించడం వలన మీ జీవితంలో వచ్చే సమస్యలను నిలువరించవచ్చు. ఆ వాస్తు నియమాలు, దాని ప్రభావాలు ఏమిటో తెలుసుకుందాం
- వాస్తు ప్రకారం.. ఇంట్లో సాలెపురుగులు ఉండటం పేదరికానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. దీంతో ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయని నమ్ముతారు. దీనితో పాటు కుటుంబ సభ్యులకు మానసిక సమస్యలు కూడా ఏర్పడవచ్చు.
- సాలె పురుగు గూడులు ఉన్న ఇంట్లో ప్రతికూల శక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాస్తు ప్రకారం.. ఇది ఇంటి ఆహ్లాదకరమైన వాతావరణం పై కూడా తీవ్ర ప్రభావితం చేస్తుంది. ఇంట్లో తగాదాలు, గొడవలు పెరిగి వైవాహిక జీవితంలోనూ సమస్యలు రావడం మొదలవుతాయి.
- సాలెపురుగులున్న ఇంట్లో ఏ పూజ చేసినా శుభ ఫలితాలు ఇవ్వవని విశ్వాసం. ఏదైనా మతపరమైన పని చేసే ముందు.. ఇంటిని సరిగ్గా శుభ్రం చేయాలి. ముఖ్యంగా ఇంట్లో ఎక్కడా సాలెపురుగులు లేకుండా చూసుకోవాలి.
- వాస్తు ప్రకారం.. ఇంట్లో సాలె పురుగు గూడులు కారణంగా.. ఇంటి పెద్దలు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని నమ్మకం. దీని కారణంగా.. ఇంటి పెద్దతో పాటు.. ఇంట్లోని వారి అభివృద్ధి ఆగిపోతుంది. అంతేకాదు ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుంది.
- పరిశుభ్రత లేని ఇంట్లో లక్ష్మి ఎప్పుడూ నివసించదు. మీరు ఎన్ని పూజలు చేసినా, మీ ఇల్లు శుభ్రంగా లేకున్నా.. ఇంట్లో సాలెపురుగులు ఉన్న ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)