Chanakya Niti: సక్సెస్ పొందాలంటే ఈ విషయాలు ముఖ్య పాత్ర పోషిస్తాయంటున్న చాణక్య
ఆచార్య చాణక్యుడి మాటలను అనుసరించే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ కలత చెందడు. అతను కష్ట సమయాల్లో ధైర్యాన్ని వదులుకోడు. తనకు ఏర్పడిన కష్టాలనుంచి బయటపడటానికి ఒక మార్గాన్ని కనుగొంటాడు.
ఆచార్య చాణక్యుడు మంచి దౌత్యవేత్త మాత్రమే కాదు.. వ్యూహకర్త , ఆర్థికవేత్త. ఆయనకు రాజకీయాలపై కూడా చాలా అవగాహన ఉంది. ఆయన విధానాలను నేటికీ అనుసరిస్తున్నారు. చాణుక్యడు చెప్పిన నీతి శాస్త్రంలోని విషయాలను తమ జీవితాల్లో అన్వయించుకుంటారు. ఆచార్య చాణక్యుడి మాటలను అనుసరించే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ కలత చెందడు. అతను కష్ట సమయాల్లో ధైర్యాన్ని వదులుకోడు. తనకు ఏర్పడిన కష్టాలనుంచి బయటపడటానికి ఒక మార్గాన్ని కనుగొంటాడు. ఆచార్య చాణక్యుడు చెప్పిన జీవిత రహస్యాలను అనుసరించేవారు జీవితంలో సక్సెస్ అందుకుంటారు. చాణక్య విధానంలో పేర్కొన్న విజయ సూత్రాలు ఏమిటో తెలుసుకుందాం.
ఆచార్య చాణక్యుడు చెప్పిన విజయ సూత్రాలు
- ఆచార్య చాణక్యుడు ప్రకారం.. ఏ వ్యక్తి అయినా తన ఆత్మగౌరవం విషయంలో రాజీపడకూడదు. ప్రతి వ్యక్తి తన బలహీనత, బలం రెండింటినీ బాగా తెలుసుకోవాలి.
- చాణక్య విధానం ప్రకారం.. మనిషి తన జీవనోపాధి కోసం డబ్బు సంపాదించాలి కానీ తన ఆత్మగౌరవం విషయంలో ఎప్పుడూ రాజీపడకూడదు.
- జీవితంలో విజయం అనేది కేవలం ఒకరు కష్టపడితేనే రాదు.. స్నేహితులు కూడా అందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. కాబట్టి జీవితంలో నిజమైన స్నేహితులను గుర్తించండి.
- ఎల్లప్పుడూ కాలాన్ని గౌరవించాలని చాణక్య విధానంలో చెప్పబడింది. కాలాన్ని, శ్రమని గౌరవించని వ్యక్తిని ఎవరూ గౌరవించరు.
- చాణక్య విధానం ప్రకారం.. ఆచార్య చాణక్యుడు సమయానికి అనుగుణంగా అన్ని పనులు పూర్తి చేయాలని.. తనకు అలవాటు అయిన స్థలంలో నివాసం ఉండాలని.. తగినంత ఉపాధి మార్గాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
- పురోభివృద్ధి పొందాలంటే డబ్బు సంపాదన అవసరమని ఆచార్య చాణక్యుడు చెప్పారు. అయితే డబ్బులను ఎప్పుడూ నిజాయితీగా సంపాదించాలి.
- చాణక్యుడు ప్రకారం.. డబ్బు సంపాదనతో పాటు, డబ్బు ఆదా చేయడంపై కూడా పూర్తి శ్రద్ధ పెట్టాలి. ఈ పొదుపు చేయడం వలన కష్టకాలంలో ఆ వ్యక్తికి బలం అవుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)