Vipareeta Raja Yoga 2023: కొత్త ఏడాది 2023లో ఏర్పడనున్న విపరీత రాజయోగం.. ఈ 3 రాశులవారు అదృష్టవంతులు.. అందులోమీరున్నారా..

జ్యోతిషశాస్త్రంలో.. ఈ  విపరీత రాజయోగం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రాజయోగం ఏర్పడటం వల్ల, అనేక రాశుల వారి జీవితంలో సంతోషం, సంపద, శ్రేయస్సు, గౌరవం వంటివి అందుకుంటారు. ఆర్ధిక పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి.

Vipareeta Raja Yoga 2023: కొత్త ఏడాది 2023లో ఏర్పడనున్న విపరీత రాజయోగం.. ఈ 3 రాశులవారు అదృష్టవంతులు.. అందులోమీరున్నారా..
Vipareeta Raja Yoga In 2023
Follow us

|

Updated on: Dec 15, 2022 | 10:28 AM

ప్రతిసారీలాగే.. ఈసారి కూడా ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరం రాక కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ప్రతి ఒక్కరూ తమకు రానున్న కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.. ఈసారి 2023వ సంవత్సరం ప్రారంభం కానున్న తరుణంలో అనేక గ్రహాల వల్ల శుభం కలుగుతుంది. ఈసారి 2023 సంవత్సరంలో చాలా గ్రహాలు తమ రాశి గమనాన్ని  మార్చుకోనున్నాయి. ఈ గ్రహాల సంచారంలో భాగంగా జనవరి 17, 2023 న శనీశ్వరుడు మొదట కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది. అంతేకాదు .. సూర్యుడు, బుధుడు, శుక్ర గ్రహాల సంచారం కూడా జనవరి మాసంలో జరగనుంది.

గ్రహాల రాశుల మార్పుతో కొత్త సంవత్సరంలో చాలా శుభప్రదమైన విపరీత రాజయోగం కూడా ఏర్పడనుంది. జ్యోతిషశాస్త్రంలో.. ఈ  విపరీత రాజయోగం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రాజయోగం ఏర్పడటం వల్ల, అనేక రాశుల వారి జీవితంలో సంతోషం, సంపద, శ్రేయస్సు, గౌరవం వంటివి అందుకుంటారు. ఆర్ధిక పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. 2023 సంవత్సరంలో ఏర్పడిన విపరీత రాజ్యయోగం నుండి ఎవరు ఎక్కువ ప్రయోజనం పొందుతారో తెలుసుకునే ముందు..  జ్యోతిషశాస్త్రంలో విపరీత రాజ్యయోగం  ప్రాముఖ్యతను అర్థం చేసుకుందాం.

జ్యోతిష్యంలో విపరీత రాజయోగం ఒక వ్యక్తి జన్మించినప్పుడు.. ఆ సమయంలో అంతరిక్షంలో ఉన్న గ్రహాల స్థితిని లెక్కించిన తర్వాత.. జాతకంలో అనేక రకాల యోగాలు నిర్ణయించబడతాయి. అన్ని రకాల యోగాల్లో రాజయోగం అత్యంత ప్రత్యేకమైనది. పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తి  జాతకంలో ఏర్పడిన రాజయోగం అతని జీవితంలో ఆనందం, శ్రేయస్సు, సంపద, కీర్తిని కలిగిస్తుంది. వేద జ్యోతిషశాస్త్రంలో మొత్తం 30 కంటే ఎక్కువ యోగాలు ఉన్నాయి. ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన ఈ యోగాలలో విపరీత రాజయోగం కూడా ఏర్పడుతుంది.

ఇవి కూడా చదవండి

విపరీత రాజయోగం ఎలా ఏర్పడుతుందంటే  జ్యోతిష్య గణనలో విపరీత రాజయోగం ప్రాముఖ్యత ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. విపరీత రాజయోగం.. పేరుకి తగినట్లు చాలా ఎక్కువ అంటే ఎక్కువ. ఉత్తర కాలామృతం ప్రకారం 6, 8 , 12వ గృహాల అధిపతులు కలిస్తే విపరీత రాజయోగం ఏర్పడుతుంద. ఈ 6, 8 , 12వ భావాధిపతులు అందరు కలసి గాని, విడివిడిగాగాను 6, 8 , 12వ రాశులలో ఎక్కడ ఉన్న విపరీత రాజయోగం పడుతుంది. వీరి కలయిక  శుభమే.

విపరీత రాజయోగ ఫలాలు జ్యోతిషశాస్త్రంలో విపరీత రాజయోగం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. స్థానిక జాతకంలో రాజయోగం విపరీత రాజయోగం  ప్రభావం కారణంగా.. అతను తన జీవితంలో విజయాన్ని పొందుతాడు. ఎవరైతే కష్టపడి, క్రమశిక్షణతో పనిచేస్తారో వారికీ విజయం సొంతమవుతుంది. ఎవరి జాతకంలో  విపరీత రాజయోగం ఉంటుందో అతను 6-8-12 భావాధిపతుల దశ, అంతర్ధశలలో ఉద్యోగంలో ఉన్నతి, గొప్ప పేరు ప్రతిష్ఠలు, ప్రభుత్వంలో మంచి పలుకుబడి, సౌఖ్యాలు పొందుతాడు

2023 సంవత్సరంలో ఏర్పడిన విపరీత రాజయోగం ప్రయోజనం ఎవరికి లభిస్తుందంటే?

వృషభం: జ్యోతిష్య శాస్త్రంలో వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు స్థానికులకు భౌతిక సుఖాలను, విలాసాలను అందించే గ్రహంగా పరిగణించబడుతుంది. జనవరి 17, 2023న శనిగ్రహం కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు విపరీత రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం వృషభ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారు 2023 సంవత్సరంలో అన్ని రకాల విజయాలను పొందుతారు. ఆర్థికంగా సంవత్సరం బాగుంటుంది. ధన లాభం పొందుతారు. గౌరవం లభిస్తుంది.

తుల రాశి: తులారాశి వారికి 2023 సంవత్సరం ప్రారంభంలో ఏర్పడిన విపరీత రాజయోగంశుభ ఫలితాలను ఇస్తుంది. మీ రాశికి ఎదురుగా ఐదవ ఇంట్లో రాజయోగం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో. ఈ రాశివారు వృత్తి , వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు. మంచి స్టేజ్ కు చేరుకుంటారు. 2023 సంవత్సరంలో ఈ రాశివారికి భౌతిక సుఖాలకు కొరత ఉండదు.

ధనుస్సు రాశి: 2023 సంవత్సరంలో.. ధనుస్సు రాశి వారికి అత్యంత ప్రయోజనాలు లభిస్తాయి ఎందుకంటే ఈ సంవత్సరం.. శని అర్ధ శతకం కాలం ముగుస్తుంది. ధనుస్సు రాశి వారికి విపరీత రాజయోగం లాభిస్తుంది. ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు. అంతేకాదు.. ధన లాభాల కోసం అనేక అద్భుతమైన అవకాశాలను పొందుతారు. ఈ రాశి వారు  కుటుంబంతో మంచి జీవితాన్ని గడుపుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Latest Articles
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
చేతికి కట్టుతోనే కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్.. ఫ్యాన్స్ ఫిదా
చేతికి కట్టుతోనే కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్.. ఫ్యాన్స్ ఫిదా
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
మారిన టీమిండియా షెడ్యూల్.. ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్..
మారిన టీమిండియా షెడ్యూల్.. ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్..
ఐశ్వర్య నువ్వు సూపర్.. చేతికి గాయమైన లెక్క చేయకుండా..
ఐశ్వర్య నువ్వు సూపర్.. చేతికి గాయమైన లెక్క చేయకుండా..
సమ్మర్‌లో వైజాగ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? మీకోసమే..
సమ్మర్‌లో వైజాగ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? మీకోసమే..
ముంబైతో పోరుకు లక్నో రెడీ.. రోహిత్‌పైనే చూపులన్నీ..
ముంబైతో పోరుకు లక్నో రెడీ.. రోహిత్‌పైనే చూపులన్నీ..
తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ 2024 ప్రవేశాలు
తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ 2024 ప్రవేశాలు