AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakshmi Devi Puja: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంట్లో చేయాల్సిన, చేయకూడని పనులు ఏమిటంటే..

హిందూ మతంలో.. లక్ష్మి దేవిని సంపదకు అధిదేవతగా భావిస్తారు. లక్ష్మీ దేవి అనుగ్రహం ఉన్న వారికి ఆర్థిక సమస్యలు ఉండవు. కానీ లక్ష్మీదేవి ఆగ్రహిస్తే.. ఎటువంటి వారికైనా ఆర్ధిక కష్టాలు తప్పవు. అటువంటి పరిస్థితిలో లక్ష్మిదేవి అనుగ్రహం పొందడానికి ఖచ్చితంగా ఈ చర్యలు చేయండి.

Lakshmi Devi Puja: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంట్లో చేయాల్సిన, చేయకూడని పనులు ఏమిటంటే..
Lakshmi Devi Puja
Surya Kala
|

Updated on: Dec 15, 2022 | 8:51 AM

Share

జీవితంలో అన్ని ఆనందాలు, అవసరాలను తీర్చుకోవడానికి  ప్రతి వ్యక్తికి డబ్బు అవసరం. పురాణ గ్రంధాల ప్రకారం  లక్ష్మీ దేవి సంపద, అదృష్ట దేవతగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఒక వ్యక్తి అన్ని బాధలు తొలగిపోతాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఒక వ్యక్తి చేపట్టిన పనిని అంకితభావం, భక్తితో పని చేస్తాడు. లక్ష్మీ దేవిని కూడా పూజిస్తాడు అయినప్పటికీ అతని శ్రమకు తగిన ఫలితం దక్కదు. డబ్బు లభించదు. లబ్ధి పొందినా వారికి డబ్బు నిలవదు. అటువంటి పరిస్థితలో లక్ష్మీదేవి కొన్ని కారణాల వల్ల కోపానికి గురైందని.. దీని కారణంగా వ్యక్తి ఈ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని నమ్ముతారు. కనుక అటువంటి పరిస్థితిలో.లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తీసుకోవాల్సిన నివారణ చర్యల గురించి తెలుసుకుందాం..

లక్ష్మీదేవి ఎక్కడ నివాసం ఉండదంటే.. 

  1. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో నిద్రించే వ్యక్తుల ఇంట్లో సంపద అధిదేవత లక్ష్మీదేవి ఎప్పుడూ నివసించదని నమ్ముతారు.
  2. సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఎప్పుడూ ఊడ్చకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి కోపానికి గురవుతుందట. అయితే ఒకవేళ  సాయంత్రం ఊడ్చిన తర్వాత.. చెత్తను డస్ట్‌బిన్‌లో ఉంచి మరుసటి రోజు ఉదయం బయటకు విసిరేయండి.
  3. రాత్రంతా అంట్లను నిల్వ ఉంచుకునే ఇంట్లో లక్ష్మి ఎప్పుడూ నివసించదు. అంతేకాదు వంట పూర్తి అయిన తర్వాత స్టవ్ శుభ్రం చేసుకోవాలి.
  4. స్త్రీలను అగౌరవపరిచే ఇళ్ళలో ఐశ్వర్యదేవత ఆగ్రహించి ఆ ఇంటిని వదిలి వెళ్లిపోతుందని నమ్మకం.
  5. ధన, ధాన్యాల కోసం ఇంటి ఉత్తర దిశలో చెత్త లేదా పనికిరాని వస్తువులను పెట్టవద్దు. అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి..  ఎల్లప్పుడూ ఉత్తర దిశను, ఈశాన్య మూలను శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించండి.

లక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుందంటే.. 

  1. ఎవరి ఇంట్లో ప్రతిరోజూ శ్రీయంత్రాన్ని పూజిస్తారో, అక్కడ లక్ష్మీ దేవి నివసిస్తుంది.
  2. తులసి, అరటి, ఉసిరి చెట్ల దగ్గర ప్రతిరోజూ స్వచ్ఛమైన నెయ్యి దీపం వెలిగించిన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కురిపిస్తుంది. ఇలా చేయడం వల్ల ఆ ఇంటి యజమానికి ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు.
  3. ఇంటి పరిశుభ్రత కూడా చాలా ముఖ్యం. ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)