Rajinikanth: తిరుమలేశుడి సన్నిధిలో సూపర్ స్టార్.. సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా పూజలు..
సూపర్ స్టార్ రజనీకాంత్.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో తరించారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో సుప్రభాత...
సూపర్ స్టార్ రజనీకాంత్.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో తరించారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం.. ఆలయ అర్చకులు రజనీకాంత్ కు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించారు. రజనీకాంత్ ఇవాళ కడప అమీన్‌పీర్ దర్గాను దర్శించుకోనున్నారు. ఆయనతో పాటు ఏఆర్ రెహమాన్ కూడా వెళ్లనున్నారు. కాగా.. శ్రీవారి దర్శనం కోసం రజినీకాంత్ బుధవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. టీఎస్‌ఆర్ అతిథి గృహం వద్ద ఆయనకు టీటీడీ రిసెప్షన్ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఓఎస్డీ రామకృష్ణ స్వాగతం పలికారు.
మరోవైపు.. తిరుమలలో భక్తుల సంఖ్య సాధారణంగా ఉంది. సర్వదర్శనానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులకు ఏడు గంటల్లోపే దర్శనం లభించింది. ఈ మేరకు టీటీడీ అధికారులు వివరాలు వెల్లడించారు. మంగళవారం శ్రీవారిని 63,214 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.5.50కోట్లు కానుకలు వచ్చాయి. మరోవైపు.. ధనుర్మాసం కారణంగా ఈ నెల 17 నుంచి స్వామి వారికి నిర్వహించే సుప్రభాతసేవ స్థానంలో తిరుప్పావై కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.