Surya Gochar: రేపటి నుంచి ధనుస్సు రాశిలో సూర్యుని సంచారం.. ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో, ఎవరికి హాని కలుగుతుందో తెలుసుకోండి

ఈ ఏడాది 16 డిసెంబర్ 2022న, సూర్యుడు బృహస్పతికి చెందిన ధనుస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు.  సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన వెంటనే ధన సంక్రాంతి ప్రారంభమవుతుంది.

Surya Gochar: రేపటి నుంచి ధనుస్సు రాశిలో సూర్యుని సంచారం.. ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో, ఎవరికి హాని కలుగుతుందో తెలుసుకోండి
Sun Transit In Dhanu Rashi
Follow us
Surya Kala

|

Updated on: Dec 15, 2022 | 11:13 AM

జీవిత ప్రయాణంలో సూర్యునికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జ్యోతిషశాస్త్రంలో.. సూర్యుడు మొదటి గ్రాహం. ఆత్మ కారణ గ్రహంగా పరిగణించబడుతున్నాడు. సూర్యునికి అన్ని గ్రహాలకు రాజు. సూర్యుడిని జ్యోతిష శాస్త్రంలో అధికంగా రవి అని వ్యవహరిస్తారు. ఎవరి జాతకంలో సూర్యుడు బలమైన స్థానంలోఉంటాడో.. అటువంటి వ్యక్తులలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ సామర్థ్యం, దృఢ సంకల్పం వంటి లక్షణాలు కలిగి ఉంటారు. జాతకంలో సూర్యుడు బలంగా ఉన్నప్పుడు.. ఆ వ్యక్తి రాజకీయ రంగంలో గొప్ప నాయకుడుగా రాణిస్తాడు.  నిర్వాహకుడు, పండితుడు అవుతాడు. సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మార్చుకుంటాడు.

అటువంటి పరిస్థితిలో.. ఈ ఏడాది 16 డిసెంబర్ 2022న, సూర్యుడు బృహస్పతికి చెందిన ధనుస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు.  సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన వెంటనే ధన సంక్రాంతి ప్రారంభమవుతుంది. సూర్యుని రాశిలో వచ్చే మార్పులు మొత్తం 12 రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం చూపుతాయి. అటువంటి పరిస్థితిలో.. సూర్యుని సంచారము వలన ఏ రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో.. ఎవరికి హాని కలుగుతుందో తెలుసుకుందాం…

ఏ రాశుల వారు లాభపడతారంటే.. 

ఇవి కూడా చదవండి

మేష రాశి: డిసెంబర్ 16న సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడం వలన మేష రాశి వారికి అనేక రకాల శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో ఈ రాశివారు మంచి పనితీరు కారణంగా.. ప్రమోషన్ , ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉంది. మేషరాశి వ్యక్తుల వైవాహిక జీవితం,  ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉంటుంది.

కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి సూర్యుని సంచారము శుభప్రదంగా ఉంటుంది. సూర్యుడు రాశి మారిన తర్వాత పనుల్లో ఏర్పడుతున్న అడ్డంకులు తొలగిపోతాయి. ఈ రాశివారికి గౌరవం లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. చట్టపరమైన వివాదంలో ఉన్న సమస్య తీరే విధంగా కోర్టు నిర్ణయం ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. కొన్ని శుభవార్తలు వింటారు. ధనలాభం పొందుతారు.

సింహ రాశి : సింహ రాశి వారికి సంవత్సరం చివరి మాసంలో ధనుస్సు రాశిలో సూర్యుని సంచారం మేలు చేస్తుంది. గత కొంతకాలంగా జరగని పనులు ఇప్పుడు సజావుగా జరగనున్నాయి. ధనలాభానికి మంచి అవకాశాలు ఉంటాయి. సంతానం వలన సంతోషాన్ని పొందుతారు. జీవితంలో పురోగతి ఉంటుంది.

కన్య రాశి: ధనుస్సు రాశిలో సూర్యుని సంచారం కన్యరాశి వారికి ఫలప్రదం.. శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు, వ్యాపార పురోగతికి అవకాశాలు ఉన్నాయి. జీవితంలో సానుకూల ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది.

ఏ రాశుల వారికి హాని కలుగుతుందంటే..

వృషభ రాశి : డిసెంబర్ 16న సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం వల్ల వృషభరాశి వారికి ఎనిమిదో ఇంట్లో ఉంటుంది. జ్యోతిషశాస్త్రంలో, జాతకంలో ఎనిమిదవ ఇల్లు శుభప్రదంగా పరిగణించబడదు. పనుల్లో కొన్ని వైఫల్యాలు ఏర్పడవచ్చు. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. గౌరవం తగ్గవచ్చు.

మిథునరాశి : మిథునరాశి వారికి సూర్యుడు ధనుస్సు రాశిలో రావడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో కొంత ఒడిదుడుకులు ఏర్పడవచ్చు.

మకర రాశి : ధనుస్సు రాశిలో సూర్యుని సంచారం మకర రాశి వారికి శుభప్రదం కాదు. ఉద్యోగం, వ్యాపారంలో కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. సూర్యుని సంచార సమయంలో ఆరోగ్యం క్షీణించవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)