Horoscope 2023: ధనుస్సు రాశి వారికి 2023 ఏడాది ఒక వరం.. ఏలిన నాటి శని నుంచి విముక్తి.. కొత్త ఏడాది ఎలా ఉందనున్నదంటే..

ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి గత ఏడున్నర సంవత్సరాలుగా కొనసాగుతున్న ఏలిన నాటి శని నుంచి విముక్తి లభించనుంది. 2023వ సంవత్సరంలో శని ధనుస్సు రాశి వారికి మూడవ రాశిలో సంచరిస్తూ శుభ ఫలితాలను అందించనున్నాడు.

Horoscope 2023: ధనుస్సు రాశి వారికి 2023 ఏడాది ఒక వరం.. ఏలిన నాటి శని నుంచి విముక్తి.. కొత్త ఏడాది ఎలా ఉందనున్నదంటే..
Dhanu Rashi Horoscope 2023
Follow us
Surya Kala

|

Updated on: Dec 15, 2022 | 2:42 PM

మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నాం. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమకు రానున్న ఏడాదిలో ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు. తమ రాశిఫలాలను తెలుసుకోవాలని ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు ధనుస్సు రాశివారికి 2023 సంవత్సరం ఎలా ఉండనున్నదో తెలుసుకుందాం.. వాస్తవానికి 2023 సంవత్సరం ధనుస్సు రాశి వారికి ఒక వరంలా మారనుంది. ఎందుకంటే ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి గత ఏడున్నర సంవత్సరాలుగా కొనసాగుతున్న ఏలిన నాటి శని నుంచి విముక్తి లభించనుంది. 2023వ సంవత్సరంలో శని ధనుస్సు రాశి వారికి మూడవ రాశిలో సంచరిస్తూ శుభ ఫలితాలను అందించనున్నాడు. ఏలిన నాటి శని కాలం.. ఏడున్నర సంవత్సరాలు ముగియడం వలన ధనుస్సు రాశి వారికి అదృష్టం కలగడమే కాకుండా దైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

శనీశ్వరుడు మాత్రమే కాదు.. ఈ సంవత్సరం ఈ రాశి వారికీ బృహస్పతిని పాలించే గ్రహం మేషరాశిలో సంచరించనుంది. దీంతో ఈ రాశివారికి రాజయోగం ఏర్పడి.. ఆనందాన్ని కలిగిస్తుంది. ఏప్రిల్ 22 తర్వాత బృహస్పతి ఐదవ ఇంట్లోకి రాహువుతో కలిసిపోతుంది. దీని వలన గురు-చండాల దోషం ఏర్పడుతుంది. దీని కారణంగా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. ఈ సంవత్సరం చివర్లో అంటే అక్టోబర్ 30న రాహు-కేతువుల రాశి మార్పు ప్రభావం ధనుస్సు రాశి వారిపై కూడా ఉంటుంది. రాహువు ఈ రాశి చక్రంలోని నాల్గవ ఇంట్లో ఉండడంతో కష్టాలు కొంచెం పెరుగుతాయి.

పని చేస్తున్న ప్రదేశంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. అయితే రాజకీయ రంగంలో చురుకుగా ఉండే వారికి రాహువు శుభ ఫలితాలను ఇస్తాడు. ముఖ్యమైన స్థానం,ప్రతిష్ట పొందుతారు. అంతే కాకుండా కాలానుగుణంగా రాశి మార్పు, ఇతర గ్రహాల గమనం కూడా ధనుస్సు రాశి వారిపై ప్రభావం చూపుతాయి.

ఇవి కూడా చదవండి

ధనుస్సు రాశి ఫలాలు 2023 లో కెరీర్ ధనుస్సు రాశి వారికి ఏలిన నాటి శని తొలగిపోవడం వల్ల వారి వృత్తిలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఏడాది పొడవునా ఈ రాశివారి  కోరికలన్నీ నెరవేరుతాయి. రంగంలో మంచి విజయాలు అందుకుంటారు. ధనుస్సు రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాలలో బంగారం వంటి  అవకాశాలు లభిస్తాయి. దానివల్ల వీరి కెరీర్ బాగుంటుంది. 2023 సంవత్సరం ఈ రాశివారికి అదృష్ట సంవత్సరం. వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ ఏడాది మధ్యలో కొన్ని పెద్ద పనులు పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వీరి పూర్వీకుల ఆస్తి నుండి ధన లాభాన్ని పొందే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి ఫలం 2023లో ఆర్థిక స్థితి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీరు ఈ సంవత్సరం చాలా మంచి ఉద్యోగ ఆఫర్లను పొందుతారు, దీని కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఏదైనా వ్యాపారంతో అనుబంధం ఉన్న వారికి, ఈ సంవత్సరం వ్యాపారంలో విస్తరణ సంవత్సరంగా నిరూపించబడుతుంది. 2023 సంవత్సరంలో వీరు కోరుకున్న ప్రయోజనాలు,  గౌరవాన్ని పొందుతారు. ఈ సంవత్సరం విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఏర్పడతాయి. అక్కడ మంచి అవకాశాలు లభిస్తాయి.

ధనుస్సు రాశిఫలం 2023లో కుటుంబ జీవితం 2023 సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి కుటుంబ జీవితం గురించి మాట్లాడినట్లయితే.. మిశ్రమంగా ఉంటుంది. ఈ సంవత్సరం కుటుంబంలో భారీ విదాలు ఏర్పడే సంఘటన జరిగే అవకాశం ఉంది. ఇల్లు లేదా భూమి-ఆస్తి విషయంలో ఇంట్లోని కొంతమంది సభ్యుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఈ రాశి తల్లిదండ్రులు ఏడాది పొడవునా మీ పిల్లల కెరీర్ గురించి ఆందోళన చెందుతారు. ఏప్రిల్ తరువాత, కుటుంబంలో కొంత సంతోషాన్నిపొందే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం, ప్రేమ  పెరుగుతుంది.

ధనుస్సు రాశి ఫలాలు 2023లో ఆరోగ్యం ఆరోగ్య పరంగా ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. శని అర్ధాష్టానం ముగిసిన తరువాత, అన్ని రకాల ఆరోగ్య సంబంధిత బాధలు  తొలగిపోతాయి. ఏప్రిల్ తర్వాత కొన్ని సమస్యలు వచ్చినా ఎక్కువ కాలం ఉండవు. క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేస్తూ ఉండడం వలన ఆరోగ్యంగా ఉంటారు.

ధనుస్సు రాశి ఫలం 2023లో విద్య,పరీక్ష-పోటీ విద్యారంగంతో అనుబంధం ఉన్న లేదా ఏదైనా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం అదనంగా శ్రమించాల్సిన సంవత్సరం. ఏడాది చివరిలో ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందడం ద్వారా ఈ రాశి విద్యార్థుల కల నెరవేరే అవకాశం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)