మేషం:
దాదాపు ఏడాదంతా శని కుంభంలో, గురువు మీన, మేషాల్లో, రాహు మేష మీనాల్లో, కేతువు తుల, కన్యల్లో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశి వారి జీవితాల్లో కొన్ని సానుకూల మార్పులు, శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రధానంగా ఉద్యోగంలో, ఆర్థిక కుటుంబ వ్యవహారాల్లో వీటి ప్రభావం ఉంటుంది. వీరికి ఉద్యోగంలో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. ఆర్థిక ఒడిదుడుకులు బాగా తగ్గుతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. ఎవరికి ఆర్థిక సంబంధమైన బాధ్యతలు అప్పగించవద్దు. పోయే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రులతో విభేదాలకు, అపార్ధాలకు అవకాశం ఉంది.