Vastu Tips: మీ ఇంట్లో తులసి, మనీ ప్లాంట్ ఏ దిక్కున పెట్టారో చూసుకోండి.. ఇలా ఉంటే వెంటనే మార్చేయండి..
మనం మొక్కలు పెంచే స్థలం కూడా మన ఇంట్లో మంచి చెడుని నిర్ణయిస్తుంది. కాబట్టి వాస్తు ప్రకారం ఖచ్చితమైన దశ, దిశ తెలుసుకొని మొక్కలు పెంచుకుంటే అన్నీ శుభఫలితాలే వస్తుంటాయి.
ప్రతి ఒక్కరూ తమ ఇంటిని అలంకరించేందుకు ఇంటి లోపల, బయట చెట్లు, మొక్కలు నాటుతుంటారు. ఇది ఇల్లు అందంగా, ప్రశాంతంగా ఉండటమే కాకుండా ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది. మనం మొక్కలు పెంచే స్థలం కూడా మన ఇంట్లో మంచి చెడుని నిర్ణయిస్తుంది. కాబట్టి వాస్తు ప్రకారం ఖచ్చితమైన దశ, దిశ తెలుసుకొని మొక్కలు పెంచుకుంటే అన్నీ శుభఫలితాలే వస్తుంటాయి.ఇంట్లో ఏ ఏ మొక్కలు పెంచాలి. ఎక్కడ పెంచాలి. ఎక్కడ పెంచకూడదు. ఇక్కడ తెలుసుకుందాం.
అరటి మొక్క: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అరటి మొక్కలో విష్ణువు, బృహస్పతి నివసిస్తారు. అటువంటి పరిస్థితిలో అరటి మొక్కకు శాస్త్రాలలో విశేష ప్రాధాన్యత ఉంది. అరటిపండును పూజలో ఉపయోగిస్తారు. వాస్తు నిపుణుల ప్రకారం దీనిని ఇంటికి దక్షిణం లేదా పడమర దిశలో నాటకూడదు. ఈశాన్యంలో నాటితే మంచిదని చెబుతారు.
మనీ ప్లాంట్: ఇంట్లో, ఆఫీసులో ఎక్కడైనా మనీ ప్లాంట్ నాటవచ్చని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెబుతారు. దక్షిణ దిక్కున పెట్టకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు. ఆగ్నేయ దిశలో నాటడం ఎల్లప్పుడూ శుభప్రదంగా పరిగణించబడుతుంది.
శమీ మొక్క : గ్రంధాల ప్రకారం శమీ మొక్కను శుభప్రదంగా భావిస్తారు. ఇది పరమశివునికి ఎంతో ప్రీతికరమైనదని చెబుతారు. ఈ మొక్కను దక్షిణ దిశలో నాటవద్దు. ఎవరైనా ఈ దిక్కున శమీ మొక్క నాటితే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ మొక్కను తూర్పు లేదా ఈశాన్యంలో నాటాలి. ఈ దిశలో శమీ మొక్కను నాటడం వల్ల ఇంటి వాస్తు దోషాలు తొలగిపోతాయి.
తులసి మొక్క: హిందూమతంలో తులసి మొక్కను గౌరవప్రదంగా భావిస్తారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతారు. ఇంట్లో సరైన దిశలో దీన్ని పెంచుకోవడం వల్ల ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. ఇంట్లో డబ్బుకు లోటుండదు. తులసిని దక్షిణ దిశలో నాటకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు. ఈ దిశలో నాటిన తులసి మొక్క ఆర్థిక పరిస్థితిని పాడు చేస్తుంది. అందుకే తులసి మొక్కను ఎప్పుడూ తూర్పు, ఉత్తరం, తూర్పు-ఉత్తర దిశలలో నాటాలి.
మరిన్ని వాస్తు టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి