AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cervical Cancer Vaccine: గుడ్ న్యూస్.. సర్వికల్ క్యాన్సర్‌కు స్వదేశీ వ్యాక్సిన్‌ .. ఏప్రిల్లో అందుబాటులోకి..

రొమ్ము క్యాన్సర్ తర్వాత దేశంలో సర్వసాధారణమైన క్యాన్సర్ రకం గర్భాశయ క్యాన్సర్. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ విడుదల కానుంది. దేశీయ క్యాన్సర్‌ను నిరోధించే తొలి..

Cervical Cancer Vaccine: గుడ్ న్యూస్.. సర్వికల్ క్యాన్సర్‌కు స్వదేశీ వ్యాక్సిన్‌ .. ఏప్రిల్లో అందుబాటులోకి..
Cervical Cancer Vaccine
Jyothi Gadda
|

Updated on: Dec 15, 2022 | 8:01 PM

Share

మహిళల్లో ఎక్కువ శాతం మరణాలకు కారణం అవుతున్న కాన్సర్లలో సర్వికల్ క్యాన్సర్ ఒకటి. దీనినే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అని కూడా అంటారు. దీన్ని నిరోధించేందుకు వైద్య నిపుణులు తమ ప్రయత్నాల్లో విజయం సాధించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ విడుదల కానుంది. దేశీయ క్యాన్సర్‌ను నిరోధించే మొదటి క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (qHPV) వ్యాక్సిన్‌ను కనుగొనడం వైద్య చరిత్రలో ఒక పెద్ద విజయం సాధించారు. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని జాతీయ సాంకేతిక సలహా కమిటీ సభ్యుడు డా. ఎన్.కె. అరోరా తెలియజేశారు. సెరమ్ ఇన్‌స్టిట్యూట్ మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అభివృద్ధి చేసిన ‘క్వాడ్రిలాండ్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ -సెర్వవాక్’ (క్యూహెచ్‌పివి) మార్కెట్‌లో రూ.200 నుంచి 400కి అందుబాటులోకి రానుంది.

ఈ వ్యాక్సిన్ 90 శాతం ప్రభావవంతంగా ఉంటుందని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది. 9 నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు ఈ వ్యాక్సిన్ ఇస్తారు. ఈ వయస్సు పిల్లలు టీకా రెండు మోతాదులను పొందాలి. తొమ్మిదేళ్ల వయసులో మొదటి మోతాదు ఇవ్వబడుతుంది. తదుపరి మోతాదు 6 నుండి 12 నెలల తర్వాత ఇవ్వబడుతుంది. పదిహేను సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న బాలికలు పూర్తి ప్రయోజనం పొందడానికి మూడు డోసుల వ్యాక్సిన్ అవసరమని సీరమ్ ఇనిస్టిట్యూట్ అధిపతి అదార్ పునేవాలా తెలిపారు.

QHPV వైరస్ DNA, జీవన భాగాలను కలిగి ఉండదు కాబట్టి ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని సీరమ్ ఇన్స్టిట్యూట్ మూలాలు చెబుతున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వ్యాక్సిన్‌నే ప్రస్తుతం దేశంలో ఉపయోగిస్తున్నారు. విదేశీ వ్యాక్సిన్‌ ధర 2000 నుండి 3000 రూపాయల వరకు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

రొమ్ము క్యాన్సర్ తర్వాత దేశంలో సర్వసాధారణమైన క్యాన్సర్ రకం గర్భాశయ క్యాన్సర్. కారక ఏజెంట్ హ్యూమన్ పాపిల్లోమావైరస్. 50 ఏళ్లు పైబడిన మహిళల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ముందస్తుగా గుర్తించడం నివారించదగినది అయినప్పటికీ, అవగాహన లేకపోవడం మన దేశంలో గర్భాశయ క్యాన్సర్‌ను ప్రమాదకరంగా మారుస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..