Zika Virus: జికా వైరస్- డెంగ్యూ-మలేరియా లక్షణాల మధ్య తేడా తెలుసుకోవటం చాలా ముఖ్యం.. లేదంటే, ఇబ్బంది పడాల్సిందే..!

అయితే ఆయా వైరస్‌ల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే అప్పుడు చాలా ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

Zika Virus: జికా వైరస్- డెంగ్యూ-మలేరియా లక్షణాల మధ్య తేడా తెలుసుకోవటం చాలా ముఖ్యం.. లేదంటే, ఇబ్బంది పడాల్సిందే..!
Zika Virus
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 15, 2022 | 5:55 PM

దేశంలో జికా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, యూపీలో ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి.. జికా వైరస్ కూడా దోమల వల్ల వ్యాపిస్తుందని ఇప్పటికే తేలింది.. డెంగ్యూ-మలేరియా కూడా ఇలాగే వస్తుంది. ఈ మూడు వ్యాధుల్లోనూ కొన్ని లక్షణాలు ఒకేలా ఉంటాయి.. అటువంటి పరిస్థితిలో, ప్రజలు వీటి లక్షణాల మధ్య తేడాను గుర్తించడం చాలా కష్టం. అయితే ఆయా వైరస్‌ల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే అప్పుడు చాలా ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. డెంగ్యూ-మలేరియా, జికా వైరస్ లక్షణాల మధ్య వ్యత్యాసాన్ని ఎలా గుర్తించాలో నిపుణుల నుండి తెలుసుకుందాం.

జికా వైరస్ సోకిన తర్వాత మూడు నుంచి 14 రోజుల్లోనే దాని లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈడెస్ దోమలు కుట్టడం వల్ల కూడా జికా వస్తుంది. ఈ దోమల వల్ల డెంగ్యూ-మలేరియా వస్తుంది. ఈ వ్యాధుల యొక్క అనేక లక్షణాలు ఒకే విధంగా ఉండడానికి కారణం, అయినప్పటికీ వాటిలో తేడాలను గుర్తించవచ్చు.

జికా – డెంగ్యూ మధ్య వ్యత్యాసం జికా మరియు డెంగ్యూ రెండింటిలోనూ జ్వరం వస్తుందని, అయితే జికా వైరస్ కేసులు చాలా అరుదుగా నమోదవుతాయని డాక్టర్లు వివరించారు. అటువంటి ప్రాంతాల్లో, జికా కేసు లేని చోట, ఒక వ్యక్తి దాని బారిన పడే అవకాశం తక్కువ. జికా వైరస్ సోకిన తర్వాత మూడు నాలుగు రోజుల్లో జ్వరం వస్తుంది. అయితే డెంగ్యూ జ్వరం రెండో రోజు మాత్రమే వస్తుంది.

ఇవి కూడా చదవండి

డెంగ్యూలో శరీరంలో చాలా బలహీనత ఉంటుంది. ప్లేట్‌లెట్స్ పడిపోవడం వల్ల ఇది జరుగుతుంది. అయితే జికాలో ప్లేట్‌లెట్లు తగ్గవు. జికా వైరస్ లైంగిక సంపర్కం, రక్త మార్పిడి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. అయితే ఇది డెంగ్యూ-మలేరియాలో జరగదు. జికా వల్ల వచ్చే కంటి సమస్య కూడా ఉండవచ్చు. ఇది డెంగ్యూ-మలేరియాలో చాలా అరుదుగా కనిపిస్తుంది. జికా వైరస్‌కు సూచించిన చికిత్స లేదు. దానికి మందు, వ్యాక్సిన్ లేదు. వ్యాధి లక్షణాల ఆధారంగా మాత్రమే రోగులకు చికిత్స అందిస్తారు.

జికాను నివారించడానికి ఏం చేయాలి జికాను నివారించడానికి మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. సురక్షితమైన శృంగారాన్ని ఆచరించండి. ఒక వ్యక్తికి జ్వరం లేదా శరీరంపై దద్దుర్లు ఉంటే, అతనికి దూరంగా ఉండండి. మీ ప్రాంతంలో జికా కేసులు ఉంటే మీకు జ్వరం ఉంటే వెంటనే బ్లడ్‌ టెస్ట్‌ చేయించుకోవటం తప్పనిసరి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి