Viral News: పెంపుడు కుక్కను దారుణంగా చంపేసిన దుండగులు.. పోస్టుమార్టంలో షాకింగ్‌ నిజాలు..!

షాడోని చంపిన నిందితుడిని ఒకసారి కరిచిందని యజమాని చెప్పాడు. దానికి ప్రతీకారం తీర్చుకునేందుకే అతను కుక్కపై ఇంత క్రూరత్వాన్ని ప్రదర్శించాడని వాపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

Viral News: పెంపుడు కుక్కను దారుణంగా చంపేసిన దుండగులు.. పోస్టుమార్టంలో షాకింగ్‌ నిజాలు..!
Dog
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 15, 2022 | 3:41 PM

హర్యానాలోని అంబాలాలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. అంబాలాలోని లక్ష్మీ నగర్‌లో ఓ పెంపుడు కుక్కను గుర్తుతెలియని కొందరు దుండగులు దారుణంగా చంపేశారు. పదునైన ఆయుధాలతో దారుణంగా కుక్క వెనుక రెండు కాళ్లను నరికేససి చంపేశారు. కుక్కపై దాడి జరిగిన సమయంలో దాని యజమాని ఇంట్లో లేడని తెలిసింది. కుక్కపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు ఫోరెన్సిక్ దర్యాప్తులో తేలింది. అధిక రక్తస్రావం కారణంగా కుక్క చనిపోయిందని నిర్ధారణ అయింది. కుక్క వెనుక కాళ్లను పదునైన ఆయుధంతో నరికి, తలపై కూడా కర్రతో కొట్టినట్లు పోస్ట్‌మార్టం నిర్వహించిన డాక్టర్ తెలిపారు. అంతర్గత అవయవాలలో కూడా అనేక గాయాలు ఉన్నట్టుగా గుర్తించారు.

చనిపోయిన పెంపుడు కుక్కను పేరు ‘షాడో’.. అని పిలుస్తారని దాని యజమాని చెప్పాడు. అయితే, తాను ఇంట్లో లేని సమయంలో కొంతమంది దానిని చంపినట్లు ఇరుగు పొరుగువారు చెబితేనే తెలిసిందన్నాడు. అయితే, మొదట్లో పోలీసులు కేసు నమోదు చేయలేదని చెప్పాడు. కానీ, వీధి కుక్కలు, జంతు సంరక్షణ సంఘాలు, కొన్ని సామాజిక సంస్థలు ఈ కేసులో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సెక్టార్ తొమ్మిదిలో అర్థరాత్రి వివిధ సంస్థల ప్రజలు గుమిగూడి ప్రదర్శనలు ప్రారంభించారు. నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. కుక్కను దారుణంగా చంపేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఫోరెన్సిక్ చేసిన వైద్యుడు విలేఖరితో మాట్లాడుతూ, “పెంపుడు జంతువుకు పోస్ట్‌మార్టం జరిగింది. కుక్క వెనుక కాళ్ళను పదునైన ఆయుధంతో నరికివేసి, తలపై కూడా కర్రతో కొట్టినట్లు చెప్పాడు. అంతర్గత అవయవాలకు అనేక గాయాలు.. అధిక రక్తస్రావం కారణంగా షాడో చనిపోయిందని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, షాడోని చంపిన నిందితుడిని ఒకసారి కరిచిందని యజమాని చెప్పాడు. దానికి ప్రతీకారం తీర్చుకునేందుకే అతను కుక్కపై ఇంత క్రూరత్వాన్ని ప్రదర్శించాడని వాపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి