Medieval ship: సరస్సులో దొరికిన వందల ఏళ్ల నాటి ఓడ.. పైకి తీసి చూసిన పరిశోధకులే షాక్‌.. చెక్కు చెదరని వైభవంతో..

ఓడ ప్రత్యేకమైన డిజైన్ ఉంది. దాని పలకలు ఈ సరస్సు యొక్క సముద్ర చరిత్రకు సాక్ష్యమిస్తున్నాయి. ఈ ఓడ 1300 నుంచి 1800 శతాబ్దానికి చెందినదని పరిశోధకులు చెబుతున్నారు.

Medieval ship: సరస్సులో దొరికిన వందల ఏళ్ల నాటి ఓడ.. పైకి తీసి చూసిన పరిశోధకులే షాక్‌.. చెక్కు చెదరని వైభవంతో..
Medieval Ship
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 14, 2022 | 8:59 PM

సరస్సులో సర్వే చేస్తున్న పరిశోధకులు వందల సంవత్సరాల నాటి పురాతన ఓడను కనుగొన్నారు. అన్వేషకులు ఈ సరస్సులో యుద్ధ సామాగ్రి కోసం వెతుకుతున్నారు. ఇంతలో అతడి చూపు నీటి అడుగునున్న1350 అడుగుల లోతులో ఉన్న ఈ నౌకపై పడింది. ఈ నౌక వందేళ్ల నాటిది అయినప్పటికీ చెక్కు చెదరని వైభవంతో ఉందని అన్వేషకులు తెలిపారు. సరస్సు ఉపరితలం నుంచి వందల ఏళ్ల నాటి ఓడ శిథిలాలు లభ్యమయ్యాయి. ఏళ్లు గడిచినప్పటికీ ఈ ఓడ మెరుగైన స్థితిలోనే కనిపించటంతో పరిశోధకులే షాక్‌లో పడిపోయారు. నార్వేలోని అతిపెద్ద సరస్సు అయిన మియోసా ఉపరితలంపై ఈ ఓడను గుర్తించారు. ఓడ ప్రత్యేకమైన డిజైన్ ఉంది. దాని పలకలు ఈ సరస్సు యొక్క సముద్ర చరిత్రకు సాక్ష్యమిస్తున్నాయి. ఈ ఓడ 1300 నుంచి 1800 శతాబ్దానికి చెందినదని పరిశోధకులు చెబుతున్నారు.

మిషన్ మియోసా ప్రాజెక్ట్ కింద పరిశోధకులు ఈ ఆవిష్కరణ చేశారు. హై రిజల్యూషన్ సోనార్ టెక్నాలజీతో 363 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ సరస్సు ఉపరితలంలో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోవడమే ఈ మిషన్ ఉద్దేశం. సరస్సు ఉపరితలంపై రెండు నెలలపాటు పరిశీలించిన యుద్ధ సామాగ్రిని కనుగొన్న తర్వాత నార్వేజియన్ డిఫెన్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఈ మిషన్‌ను ప్రారంభించింది. నార్వేజియన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారం, ఈ సరస్సు తాగునీటికి ప్రధాన వనరు. ఈ సరస్సు నుండి దేశంలోని దాదాపు లక్ష మంది ప్రజలకు తాగు నీరు అందుతుంది. అందుచేత అందులో యుద్ధ సామాగ్రి ఉండడం వల్ల ప్రజల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది.

సరస్సును పరిశీలించినప్పుడు ఓడ శిథిలాలు కనుగొనబడ్డాయి. నార్వేజియన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సీనియర్ పరిశోధకుడు, ఈ మిషన్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ఓయ్వింద్ ఒడెగార్డ్ మాట్లాడుతూ – యుద్ధ వస్తువుల గురించి తెలుసుకునేటప్పుడు ఓడ శిధిలాలు దొరుకుతాయని తాము ఊహించామన్నారు. ఈ నౌక శిథిలాలు 1350 అడుగుల లోతులో లభ్యమయ్యాయి. ఈ నౌక పొడవు 33 అడుగులు. స్వచ్ఛమైన నీటి వాతావరణం, సరస్సులో తరంగాలు లేకపోవడం వల్ల, ఓడ దాని అసలు స్థానంలో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే, కొన్ని ఇనుప మేకులు తుప్పు పట్టాయి. ఓడ డిజైన్‌ను చూసిన పురావస్తు శాఖ వారు ఈ నౌకను 1300 సంవత్సరం నుంచి 1850 సంవత్సరం మధ్య కాలంలో నిర్మించి ఉండవచ్చని అంచనా వేశారు. ఈ ఓడ సరస్సు మధ్యలో గుర్తించారు. అందుకే ప్రతికూల వాతావరణం కారణంగా ఈ నౌక మునిగిపోయి ఉంటుందని ఓయ్‌వింద్ ఒడెగార్డ్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్  కోసం ఇక్కడ క్లిక్ చేయండి