Divine Flowers: ఏ దేవుడికి ఏ పూలతో పూజ చేస్తే మంచిది? ఈ పూలతో పూజిస్తే మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి..

ఈ పువ్వులు లేకుండా చేసే పూజలు అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. పూజలో పువ్వులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఏ దేవుడికి ఏ పువ్వు అంటే ఇష్టం? ఆ పూలతో పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రతీతి.

Divine Flowers: ఏ దేవుడికి ఏ పూలతో పూజ చేస్తే మంచిది? ఈ పూలతో పూజిస్తే మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి..
Ganesh Puja
Follow us

|

Updated on: Dec 14, 2022 | 7:27 PM

మనం పూజించే ప్రతి దేవుడికి ఇష్టమైన రోజులు, పువ్వులు, రంగులు ప్రత్యేకించి ఉంటాయి. భక్తులకు ఇష్టమైన దైవాలున్నట్టే, ఆ దేవతలకూ కూడా ఇష్టయిష్టాలున్నాయి. ఒక్కో దేవుడు ఒక్కో పువ్వును ఇష్టపడతారు. ఈ పువ్వులు లేకుండా చేసే పూజలు అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. పూజలో పువ్వులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఏ దేవుడికి ఏ పువ్వు అంటే ఇష్టం? ఆ పూలతో పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రతీతి. ఏ పువ్వులు సమర్పిస్తే కోరికలు త్వరగా నెరవేరుతాయనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

1. లక్ష్మీ దేవి – కలువ పూలు ఐశ్వర్యానికి అధిదేవతైన లక్ష్మీ దేవి కలువ పూవులోనే కూర్చుని ఉంటుంది. ఆమెకు ఇష్టమైన పువ్వు కూడా కమలమే. లక్ష్మీ దేవిని కమలాలు, తెల్లటి సువాసన గల పూలతో పూజిస్తే లక్ష్మీ కరుణిస్తుంది.

2. గణేశుడు.. అడ్డంకులను తొలగించే గణేశుడు, లక్ష్మీ దేవి వలె ఎర్రటి పుష్పాలను అందుకుంటాడు. ఎరుపు, నారింజ రంగుల్లో ఉండే బంతిపూలంటే ఉండ్రాళ్ల ప్రియుడు వినాయకుడికి చాలా ఇష్టం. బంతిపూలు పాజిటివిటీని పెంచుతాయి. వినాయకుడికి ఎర్ర బంతిపూలతో మాల కట్టి పూజ చేస్తే మీ కష్టాలు తీరుతాయి. తులసి తప్ప మిగిలినవన్నీ వినాయకుడికి సమర్పించవచ్చు. ఎర్ర మందార, గన్నేరు పూలు కూడా గణేశుడికి అత్యంత ఇష్టమైన పువ్వు.

ఇవి కూడా చదవండి

3. సరస్వతీ దేవి – మోదుగు పూలు ఎల్లప్పుడూ తెల్లని దుస్తులు ధరించి ఉంటుంది. ఆమె మనస్సు, ఆత్మ స్వచ్ఛతను సూచిస్తుంది. కానీ ఆమెకు ఇష్టమైన రంగు పసుపు అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చదువుల దేవత సరస్వతికి పూజ చేసేటప్పుడు కచ్చితంగా మోదుగు పూలు ఉండేలా చూసుకోండి. ఈ పూలు జ్ఞానాన్ని ప్రతిబింబిస్తాయి. మోదుగు పూలతో పూజ చేస్తే మీకు మంచి విద్యాబుద్ధులను సరస్వతీ దేవి ప్రసాదిస్తుంది. సరస్వతికి ప్రార్థనలు చేసేటప్పుడు పసుపు పువ్వులను సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

4. శివుడు – ఉమ్మెత్త నీలకంఠుడిని పూజించే భక్తులు ఉమ్మెత్తతో పూజచేస్తే ఫలితం ఉంటుంది. ఉమ్మెత్త చెట్లకు గుండ్రంగా ముళ్లతో కూడిన కాయల్లాంటివి కాస్తాయి. అవంటే శివుడికి మహా ఇష్టం. మహాశివుడు గరళం తాగినప్పుడు ఉమ్మెత్త అతని ఛాతీపై దర్శనమిస్తుందని అంటారు. వాటితో పూజ చేస్తే అహం, శత్రుత్వం వంటి గుణాలు నశించి ప్రశాంతమైన జీవితం సొంతమవుతుంది.

5. కాళీ మాత – ఎర్ర మందారం కాళీ మాత నాలుక రంగులో పూచే పూలు ఎర్రమందారాలు. ఆ రంగు కాళీమాతలోని ధైర్యాన్ని, సాహసాన్ని సూచిస్తాయి. 108 ఎర్ర మందారాలతో మాల కట్టి కాళీ మాత మెడలో వేసి నమస్కరిస్తే కోరిక కోరికలు తీరుతాయంటారు. అంతేకాకుండా, కాళీ దేవికి ముదురు ఎరుపు గులాబీ పువ్వులు కూడా సమర్పిస్తారు.

6. మహా విష్ణువు – పారిజాతాలు సువాసన వెదజల్లే పారిజాత పూలంటే శ్రీ మహావిష్ణువుకు మహా ప్రీతి. క్షీరసాగర మథనం జరిగేటప్పుడు పారిజాత వృక్షం పుట్టిందని, దాన్ని విష్ణువు తనతో పాటూ స్వర్గానికి తీసుకెళ్లారని చెబుతారు. ఆ పూలతో పూజిస్తే విష్ణువు మనసు మంచులా కరిగి సిరిసంపదలను ప్రసాదిస్తాడు. కమల, జూహీ, చమేలీ, అశోక, మాల్తీ, వాసంతి, చంపా, వైజయంతిలను ఇష్టపడతాడు. సువాసనగల పూలతో పాటు, తులసి ఆకులను ఇష్టపడతాడు.

7. హనుమంతుడు హనుమంతుడికి మల్లెపూలంటే చాలా ఇష్టం, కాబట్టి హనుమాన్ పూజ సమయంలో మల్లెపూల నూనెను సమర్పిస్తారు. ప్రతి శనివారం బజరంగబలికి తమలపాకులు, అద్భుతమైన పువ్వులు సమర్పిస్తారు.

8. శ్రీ కృష్ణుడు కదంబ వనంలో చాలా కాలం గడిపేవాడు. కదంబ పుష్పాలు సువాసనతో బంతిలా గుండ్రంగా ఉంటాయి. పారిజాతాన్ని శ్రీకృష్ణుడు భూమిపైకి తెచ్చిన స్వర్గపు వృక్షంగా చెబుతారు. కాబట్టి, కృష్ణుని పూజించడానికి కూడా పారిజాత గొప్పది.

9. శనిదేవుడు.. నీలిరంగు పూలను శనికి సమర్పించాలి. నీలం శంఖం పువ్వుతో సహా ఇతర నీలం పుష్పాలను శని భగవానుడికి సమర్పించవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి