Shani Dev: శని ప్రభావం పడకూడదంటే ఈ వస్తువులను ఉచితంగా ఇచ్చినా తీసుకోకండి.. తీసుకుంటే ఇబ్బందులు తప్పవు.
వచ్చే ఏడాది శనిగ్రహం కుంభరాశిలోకి ప్రవేశిస్తున్న విషయం తెలిసిందే. దీంతో అన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. శనిదేవుడి ప్రభావం వచ్చే ఏడాది కొన్ని రాశుల వారికి తీవ్ర కష్టాలు ఎదురుకాక తప్పదని..
వచ్చే ఏడాది శనిగ్రహం కుంభరాశిలోకి ప్రవేశిస్తున్న విషయం తెలిసిందే. దీంతో అన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. శనిదేవుడి ప్రభావం వచ్చే ఏడాది కొన్ని రాశుల వారికి తీవ్ర కష్టాలు ఎదురుకాక తప్పదని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శనిగ్రహం చెడు ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. నివారణ చర్యల్లో భాగంగా కొన్ని నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. ఇందులో భాగంగానే కొన్ని వస్తువులను ఉచితంగా ఇచ్చినా తీసుకోకూడదని వీటి వల్ల శని దేవుడి చెడు ప్రభావం పడుతుందని చెబుతున్నారు.
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, నూనెను ఎప్పుడూ ఉచితంగా తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల శనిగ్రహం చెడు ప్రభావం ఎదుర్కోవాల్సి వస్తుంది. నూనెను ఉచితంగా తీసుకోవడం అశుభం అయితే.. శనివారం నాడు శనిదేవుని ముందు ఆవనూనె దీపం వెలిగిస్తే శుభప్రదంగా చెబుతుంటారు. అదే విధంగా ఇనుమును ఎవరి నుంచి ఉచితంగా తీసుకోకూడదని, శనివారం ఇనుమును కొనుగోలు చేయకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఉచితంగా ఇనుమును తీసుకుంటే అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని చెబుతున్నారు.
శనిదేవుడి చెడు ప్రభావం మన మీద పడకూడదంటే మినపప్పును దానం చేయాలి అయితే అదే సమయంలో ఈ పప్పును ఉచితంగా తీసుకకోకూడదు. అదే విధంగా నువ్వుల నూనె లేదా నువ్వులను ఎవరి దగ్గరా ఉచితంగా తీసుకోకూడదు. మీకు దానంగా ఇచ్చే వ్యక్తి శని దుష్ప్రభావం కలిగే ఉంటే అది మీపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు నువ్వులను ఇచ్చినా తీసుకోకూడదు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు జ్యోతిష్య నిపుణుల సూచనల మేరకు అందించినవి మాత్రమే. ఈ అంశాలను నమ్మడం వారి వారి వ్యక్తిగత నమ్మకాలపై మూడి పడి ఉంటుంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గుర్తించాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..