Horoscope 2023: కొత్త సంవత్సరం 2023 లో ఈ రాశివారికి శుభప్రదం.. రాజకీయ నేతలకు పట్టిందల్లా బంగారమే…

2023 సంవత్సరం ఈ రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. శనిదేవుడు ఈ రాశివారికి ప్రయోజనకరంగా ఉంటాడు. శని ఐదవ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు.. శని ప్రభావం తుల రాశి వారిపై ముగుస్తుంది.

Horoscope 2023: కొత్త సంవత్సరం 2023 లో ఈ రాశివారికి శుభప్రదం.. రాజకీయ నేతలకు పట్టిందల్లా బంగారమే...
Tula Horoscope 2023
Follow us

|

Updated on: Dec 29, 2022 | 3:01 PM

మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాది 2023లోకి అడుగు పెట్టనున్నాం.. ఈ నేపథ్యంలో చాలామంది రానున్న ఏడాదిలోనైనా తమకు అన్ని విధాలా మంచి జరగాలని.. మంచి ఉద్యోగం, మంచి జీతం, మంచి విద్య  అందాలని.. కోరుకుంటారు. తమ రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది 2023లో తులారాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.. 2023 సంవత్సరం ఈ రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. శనిదేవుడు ఈ రాశివారికి ప్రయోజనకరంగా ఉంటాడు. శని ఐదవ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు.. శని ప్రభావం తుల రాశి వారిపై ముగుస్తుంది. ఈ రాశికి చెందిన వారు శని ప్రభావం నుంచి విముక్తి పొందిన తర్వాత చాలా ఉపశమనం పొందుతారు. మరోవైపు.. తులారాశిలో ఆరవ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య పరంగా కొన్ని రోజులు నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉండవు. కానీ ఏప్రిల్ 22 న, బృహస్పతి రాశి చక్రం మారినప్పుడు.. మళ్ళీ ఈ రాశివారికి పరిస్థితులు అనుకూలంగా మారతాయి.

అంతేకాదు 2023 సంవత్సరంలో రాహు-కేతువుల రాశి కూడా మారనుంది. రాహు-కేతువుల రాశుల మార్పు వల్ల తులారాశి వారి జీవితంలో పెనుమార్పు వస్తుంది. ఈ రాశివారు శత్రువులు ఇబ్బందులు పడతారు. ఈ రాశివారు విదేశాల నుంచి డబ్బు సంపాదించగలుగుతారు. రాజకీయాలు, పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన వ్యక్తులు మంచి ఫలితాలను పొందుతారు.

తుల రాశి ఫలం 2023లో కెరీర్ తుల రాశి వారికి 2023 సంవత్సరం కెరీర్ పరంగా గొప్పగా ఉంటుంది. ఈ సంవత్సరం శని ప్రభావం ముగుస్తుంది. దీని వలన వీరు  చాలా ఉపశమనం పొందుతారు. పనులలో విజయాలు మునుపటి కంటే ఎక్కువగా లభిస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారికి చాలా మంచి ఆఫర్లు వస్తాయి. ఆఫీసులో విజయాలు అందుకుంటారు. బృహస్పతి ప్రభావం ఈ రాశివారు పనులపై గణనీయంగా ఉంటుంది. మీ పనిలో వచ్చే అడ్డంకులను తొలగించడంలో గురువు మీకు సహకరిస్తారు. ఏప్రిల్‌లో, బృహస్పతి మీనం నుండి మేషరాశికి మారినప్పుడు.. ఈ రాశివారు కెరీర్‌లో మంచి స్టేజ్ కు చేరుకుంటారు. ఈ సంవత్సరం మంచి ఉద్యోగం వచ్చే సూచనలున్నాయి. కొత్త ఉద్యోగం కోసం అన్వేషణ ఈ సంవత్సరం పూర్తవుతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు ఈ సంవత్సరం పెద్ద పదవిని పొందవచ్చు. గత కొన్నేళ్లుగా వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం కూడా లాభాలతో కూడి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

తుల రాశి జాతకం 2023లో ఆర్థిక స్థితి ఈ సంవత్సరం ఈ రాశివారు ఆదాయంలో మంచి పెరుగుదలను చూస్తారు. ఏడాది పొడవునా ఆర్థిక పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉంటాయి. అదనపు ఆదాయం అందుతుంది. భూమి వ్యాపారం చేసే వారికీ ఆస్తి ద్వారా మంచి డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఎవరితోనైనా భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉన్నవారు.. ఈ సంవత్సరం ఆ ఆలోచన విరమించుకుంటే మంచిది.. లేకుంటే మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు. సంవత్సరం చివరిలో వీరి ఆదాయంలో మంచి పెరుగుదల ఉంటుంది. దు.

తుల రాశి జాతకం 2023లో కుటుంబ జీవితం ఈ సంవత్సరం, శని ప్రభావం ఈ రాశివారిపై ముగుస్తుంది. ఇది మీ కుటుంబ జీవిత పరంగా శుభ సంకేతం. కుటుంబంలో ఏర్పడే అనైక్యత వల్ల ఏర్పడిన మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి. పిల్లల నుండి కొన్ని శుభవార్తలను అందుకుంటారు. ఈ రాశివారు పిలల్లు చదువులో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి. ప్రేమ, జీవిత భాగస్వామితో మంచి సంబంధం ఏర్పడుతుంది. అయితే సంవత్సరం చివరిలో కొన్ని తేడాలు వచ్చే అవకాశం ఉంది.

తుల రాశి జాతకం 2023లో ఆరోగ్యం తుల రాశి వారికి మంచి ఆరోగ్యం ఉంటుంది. ప్రత్యేకంగా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు. మీకు ఇబ్బంది కలిగించే కొన్ని వ్యాధుల నుండి బయటపడవచ్చు. బృహస్పతి రాశి మార్పు ఈ రాశివారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఏడాది పొడవునా మంచి ఆరోగ్యం కోసం.. వీరు క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేయాలి.

తుల రాశి జాతకం 2023లో విద్య తుల రాశి విద్యార్థులకు శని, గురుగ్రహ సంచారం వరం కానుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. పరీక్షలో మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆలోచనలో ఉన్నవారికి, వారి కోరిక సంవత్సరం చివరిలో నెరవేరే అవకాశం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..