Success Mantra: వ్యక్తి శక్తి, విచక్షణ కోల్పోయేలా చేసే కోపం వలన జీవితంలో కలిగే హాని ఏమిటో తెలుసా..
కోపం ఆ వ్యక్తికి అతిపెద్ద శత్రువుగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తికి కోపం వచ్చినప్పుడు.. అతనిలో ఆలోచించే గుణంతో పాటు.. అర్థం చేసుకునే శక్తి కోల్పోతాడని నమ్ముతారు.
షడ్గుణాలలో ఒకటి కోపం. మనకు నచ్చని పని లేదా అభిప్రాయాన్ని ఇతరులు వ్యక్తం చేసినా మనలని విమర్శించినా వచ్చే ఉద్రేకాన్ని కోపం అని అంటారు. చిన్న, పెద్ద, ఆడ, మగ అనే తేడా లేకుండా ఎవరికైనా, ఎవరిపైనా కోపం రావడం సహజం. ఎప్పుడైనా, ఎక్కడైనా కోపాన్ని వ్యక్తం చేస్తారు. ఇలా కోపం తెచ్చుకోవడం పెద్ద విషయం కాదు. అయితే కారణం లేకుండా ప్రతి విషయంపై కోపం తెచ్చుకోవడం వినాశనానికి సూచిక. అలాంటి కోపం ఆ వ్యక్తికి అతిపెద్ద శత్రువుగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తికి కోపం వచ్చినప్పుడు.. అతనిలో ఆలోచించే గుణంతో పాటు.. అర్థం చేసుకునే శక్తి కోల్పోతాడని నమ్ముతారు. కోపం వచ్చినప్పుడు.. ఒక వ్యక్తి శరీరంపైన మాత్రమే కాదు.. జీవితానికి సంబంధించిన సరైన నిర్ణయం తీసుకోలేడు. ఈ రోజు కోపం వలన కలిగే అనర్ధాల గురించి ఐదు అమూల్యమైన విషయాలు గురించి తెలుసుకుందాం..
- కోపాన్ని నియంత్రించుకోకపోతే.. అది ఉత్పన్నమయ్యే కారణం కంటే ఒక వ్యక్తికి శారీరకంగా, మానసికంగా ఎక్కువ హాని కలిగిస్తుంది.
- ఒక వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు అరవడానికి శక్తి అవసరం లేకపోవచ్చు, కానీ కోపంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండడానికి చాలా బలం కావాలి.
- ఏ వ్యక్తి కోపమైనా తనపై తాను చూపించుకోవడం సరైన చర్య. ఎందుకంటే అలా తనపై తాను కోపం చూపించుకోవడం వలన ఆ వ్యక్తి తనను తాను మార్చుకున్న అనుభూతిని కలిగిస్తుంది. చాలా అరుదుగా ఇలాంటి స్థితిని పొందుతారు.
- జీవితంలో కోపం ఒక వ్యక్తిలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. గందరగోళం తెలివి తేటలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కోపం బుద్ధిపై తీవ్ర ప్రభావం చూపించి.. వ్యక్తిలో తర్కం, విచక్షణ నాశనం అవుతుంది. ఎవరిలో తర్కం నాశనం అవుతుందో.. అతని పతనం మొదలవుతుంది.
- కోపంలో ఉన్న సమయంలో ఒక వ్యక్తి.. ఎప్పుడూ ఇతరులకు సమాధానం చెప్పకండి. ఎందుకంటే కోపం ఒక వ్యక్తి మనస్సాక్షిని మూసివేస్తుంది. ఆ తర్వాత అతనిలో మంచి చెడుల గురించి ఆలోచించే శక్తి అంతరించిపోతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)