Vastu Tips: కొత్త ఏడాదిలో వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందాలా.. ఈ వాస్తు చిట్కాలను పాటించిచూడండి

ఎంత కష్టపడి పని చేస్తున్నా వ్యాపారంలో అనుకున్న ఫలితం రాకుంటే.. మీరు కొన్ని వాస్తు చిట్కాలను అనుసరించవచ్చు. వాటిని అనుసరించడం ద్వారా మీరు గరిష్ట ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది.

Vastu Tips: కొత్త ఏడాదిలో వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందాలా.. ఈ వాస్తు చిట్కాలను పాటించిచూడండి
Vastu Shastra Business
Follow us
Surya Kala

|

Updated on: Dec 13, 2022 | 3:16 PM

విజయవంతమైన వ్యాపారం కోసం వాస్తు చిట్కాలు కూడా పాటించాల్సి ఉంటుంది.  భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని ఈ పంచ భూతాల సమతుల్యత కూడా వ్యాపారాభివృద్ధికి దోహదం చేస్తాయి.  ఎంత కష్టపడి పని చేస్తున్నా వ్యాపారంలో అనుకున్న ఫలితం రాకుంటే.. మీరు కొన్ని వాస్తు చిట్కాలను అనుసరించవచ్చు. వాటిని అనుసరించడం ద్వారా మీరు గరిష్ట ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. కొత్త ఏడాదిలోనైనా వ్యాపారం బాగా ఉండాలని… లాభాలను అందుకోవాలని కోరుకుంటారు.

దేవుడి విగ్రహం పెట్టడానికి సరైన స్థలం మనలో చాలా మంది మన కార్యాలయాలు/దుకాణాలలో చిన్న పూజ గది లేదా దేవాలయాన్ని ఏర్పాటు చేసుకుంటారు. దేవుని విగ్రహం  తప్పుడు స్థలంలో ఉంచినట్లయితే.. అది మీ పని, లాభాలపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆలయం లేదా పూజ గది ఎల్లప్పుడూ ఈశాన్య లేదా తూర్పు దిశలో ఉండాలి.

ఆఫీసు ప్రవేశ ద్వారం  మీరు మీ దుకాణం, కార్యాలయం లేదా కర్మాగారం ప్రవేశద్వారాన్ని రకరకాల అలంకార వస్తువులతో అలంకరించారా? వాస్తు నిపుణుడి ప్రకారం ఇది చేయకూడదట.. ఇలా రకరకాల వస్తువులతో అలంకరణ కొన్ని సార్లు వ్యాపార అవకాశాలను అడ్డుకుంటుందట. కనుక ఇలా ఏర్పాటు చేసిన అలంకారాలను వెంటనే తొలగించండి. మీ కార్యాలయం, దుకాణం లేదా ఫ్యాక్టరీ ప్రవేశ ద్వారం ఎల్లప్పుడూ క్లియర్ గా ఉండాలి.

ఇవి కూడా చదవండి

ఆఫీసు యజమాని గది/సీటు మీ ఆఫీసు లేదా షాప్‌లో కూర్చున్న ప్రదేశం మీ వ్యాపార విజయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీ గది ఎల్లప్పుడూ నైరుతి దిశలో ఉండాలి లేదా మీ ముఖం ఉత్తరం వైపు ఉండేలా కూర్చోవాలి. పూజ గది లేదా దేవుడి ఫోటోలు, విగ్రహాలు మీ వెనుక ఉండకూడదు. మీ సీటు వెనుక దేవుని విగ్రహాలను ఎప్పుడూ ఉంచవద్దు. మీ సీటు వెనుక ఎల్లప్పుడూ సాదా గోడగా ఉండాలి.

వాష్‌రూమ్ దిశ వాష్‌రూమ్/టాయిలెట్ ప్రతికూల శక్తిని కలిగి ఉంటుందని నమ్ముతారు. వ్యాపారంలో ఏర్పడిన ఏవైన సమస్యలను నివారించడానికి సరైన దిశలో వాష్ రూమ్ కలిగి ఉండటం అవసరం. ఇవి ఎల్లప్పుడూ వాయువ్య లేదా నైరుతి దిశలో ఉండాలి. లేకపోతే.. వీటి ప్రభావం  వ్యాపారంలో ఆర్థిక వృద్ధిపై చూపించవచ్చు. నష్టాలు కలగవచ్చు.

షాప్/ఫ్యాక్టరీ ఫర్నిచర్ మీరు మీ కార్యాలయంలో ఏదైనా ఫర్నిచర్ ఉంచవలసి వస్తే.. మీ ఆఫీసు కోసం ఎల్లప్పుడూ చదరపు లేదా దీర్ఘచతురస్రాకార ఆకారపు ఫర్నిచర్ ఎంచుకోండి. ఫర్నిచర్ ఆకారం వంకరగా లేదా ఎల్-ఆకారంలో ఉండేవి ఏర్పాట్లు చేసుకోవద్దు. అభివృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి

ఉత్తర దిశ ఉత్తర దిశ ఎల్లప్పుడూ స్పష్టంగా ఉండేలా చూసుకోండి. ఈ దిశ అగ్ని మూలకాన్ని సూచిస్తున్నందున మీరు ఇక్కడ దేనినీ ఉంచకూడదు. అలాగే, ఈ ప్రాంతం ఎరుపు రంగుతో పెయింట్ చేయకూడదు. ఈ ప్రాంతంలో ఎప్పుడూ చిన్నగదిని డిజైన్ చేయవద్దు.

ఆఫీసులో లైటింగ్ మీ ఆఫీసులో లేదా షాపులో మంచి లైటింగ్ ఉండాలి. ఆఫీసులో సహజమైన వెలుతురు ఉంటేనే మంచిది. లేదంటే.. వెలుతురు కోసం  బహుళ లైట్లను ఉపయోగించవచ్చు. ఇలాంటి లైటింగ్ ఏర్పాటు కార్యాలయంలో ఏదైనా ప్రతికూలతను నివారిస్తుంది. వ్యాపారాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాదు మీరు మీ వ్యాపారం కోసం కొత్త స్థలాన్ని కొనుగోలు చేస్తున్నట్లయితే, మంచి వెంటిలేషన్, కిటికీలు, సహజ కాంతి ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోండి.

గోడలకు రంగులు  మీ ఆఫీసు లేదా ఫ్యాక్టరీలో వేసే గోడ రంగులు కూడా ముఖ్యమైనవి. అవి పని వాతావరణంతో నేరుగా సంబంధం కలిగి ఉంటాయి. ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా, కంటికి ఆహ్లాదకరంగా ఉండే రంగులను ఉపయోగించండి. మీ షాప్ లేదా ఆఫీసు కోసం తెలుపు, నీలం, బూడిద వంటి రంగులను ఎంచుకోండి. ఇది సానుకూలతను తెస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి జరిగేలా చూస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)