Horoscope 2023: కుంభరాశి వారికి 2023లో ఎలా ఉంటుంది.. ఉద్యోగం, వృత్తి,ఆర్థికంగా ఓకే.. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాల్సిందే..

సంవత్సరారంభంలో శని గ్రహం కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ కారణంగా ఈ రాశివారు తమ పనులన్నీ క్రమశిక్షణతో చేయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం ఈ రాశివారు ఆదాయంలో మంచి పెరుగుదల ఉండవచ్చు.

Horoscope 2023:  కుంభరాశి వారికి 2023లో ఎలా ఉంటుంది.. ఉద్యోగం, వృత్తి,ఆర్థికంగా ఓకే.. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాల్సిందే..
Kumbh Rashifal 2023
Follow us
Surya Kala

|

Updated on: Dec 29, 2022 | 3:01 PM

కుంభ రాశి వారికి 2023 సంవత్సరం చాలా ముఖ్యమైన సంవత్సరంగా ఏర్పడనుంది. ఈ సంవత్సరం శనిదేవుడు కుంభ రాశి వారిపై ప్రత్యేక ప్రభావం చూపుతాడు. జనవరి 17, 2023న శనిగ్రహం కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది. శనీశ్వరుడు 12వ ఇంట తన ప్రయాణం ముగించుకుని లగ్న గృహంలోకి ప్రవేశించనున్నాడు. ఈ సంవత్సరం.. ఈ  లగ్నంలో శనీశ్వరుడు సంచారం కారణంగా శుభ ఫలితాలు విజయాన్ని పొందుతారు. ఎవరి జాతకంలో శని దేవుడు మంచి స్థానంలో ఉంటాడో వారికి 2023 సంవత్సరంలో చాలా శుభ ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి.

అంతేకాదు ఏప్రిల్ 2023 లో బృహస్పతి గ్రహం కూడా మీన రాశిలోకి ప్రవేశించి.. మేష రాశి ప్రయాణాన్ని నిలిపివేస్తుంది. 2023 సంవత్సరంలో.. బృహస్పతి ఈ రాశివారు మూడవ ఇంట్లో సంచరిస్తూ..  ధైర్యాన్ని పెంచుతాడు. అంతేకాదు రాహువు కలయిక కారణంగా, గురు దోషం ఏర్పడే అవకాశం ఉంది. దీని కారణంగా కొన్ని రోజులు ఈ రాశివారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.  మరోవైపు అక్టోబరు 30న రాహు-కేతువులు తమ రాశి మారిన తర్వాత మీన, కన్యారాశిలోకి ప్రవేశిస్తారు. సంవత్సరం చివరి నెలల్లో  వాక్కు స్థానంలో రాహువు సంచారం జరుగుతుంది. కేతువు మీ ఎనిమిదవ స్థానంలో ఉంటాడు. దీని కారణంగా కుంభ రాశి వారికి కుటుంబ కలహాలు, వాగ్వాదం,  వాక్ దోషాలు తలెత్తవచ్చు.

కుంభ రాశి ఫలం 2023లో కెరీర్ సంవత్సరారంభంలో శని గ్రహం కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ కారణంగా ఈ రాశివారు తమ పనులన్నీ క్రమశిక్షణతో చేయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం ఈ రాశివారు ఆదాయంలో మంచి పెరుగుదల ఉండవచ్చు. ఉద్యోగంలో ఉన్న వారు ఈ సంవత్సరం పై అధికారుల నుండి ప్రశంసలు పొందవచ్చు. అంతేకాదు ప్రమోషన్‌లో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఈ సంవత్సరం  మీ ఉద్యోగంతో పాటు.. ఇతర పనుల ద్వారా కూడా ఆదాయాన్ని పొందే అవకాశం. మరోవైపు ఈ రాశి వ్యక్తులు వ్యాపార రంగంలో శుభఫలితాలను పొందే అవకాశం. సంవత్సరం ప్రారంభంలో, గురు, శని 10 వ ఇంట్లో కలిసి ఉంటే మంచి విజయం నమోదు చేస్తారు.  ఏప్రిల్ 22న బృహస్పతి రాశి మార్పు మీ కెరీర్‌లో మంచి ఊపునిస్తుంది. బృహస్పతి, శని శుభ దృష్టితో ఈ రాశివారు కెరీర్‌లో మీ జీవిత భాగస్వామి నుండి మంచి మద్దతు లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

కుంభ రాశి ఫలం 2023లో ఆర్థిక స్థితి కుంభ రాశి వారికి 2023 సంవత్సరం ఆర్థిక పరంగా చాలా మంచి సంవత్సరం. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మీరు డబ్బు సంపాదనలో ముందుంటారు. ఆకస్మిక ధనాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. సంవత్సరం ప్రారంభం నుండి ఏప్రిల్ వరకు, బృహస్పతి మీ రెండవ ఇంట్లో సంచరిస్తారు. అంతేకాదు స్థిర, చర ఆస్తులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. గ్రహాలు శుభ సంకేతాలను ఇస్తున్నందున మీరు ఇతర రంగాలలో కూడా వ్యాపారాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నించాలి. ఈ సంవత్సరం, పూర్వీకుల ఆస్తి నుండి మంచి లాభాలు పొందనున్నారు.

కుంభ రాశి ఫలం 2023లో కుటుంబ జీవితం కుంభ రాశి వారికి కుటుంబ జీవిత పరంగా 2023 సంవత్సరం మిశ్రమ సంవత్సరంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో, బృహస్పతి మీ రెండవ ఇంట్లో ఉండటం వల్ల, కుటుంబ సభ్యులందరి నుంచి మద్దతు లభిస్తుంది. వివాహం చేసుకునే యువతీ యువకులు ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవచ్చు. ఏడాది పొడవునా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. సంతాన విషయంలో సంతోషాన్ని పొందుతారు. చదువులో పిల్లల విజయాన్ని చూసి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. అయితే, సంవత్సరం చివరిలో, తండ్రి ఆరోగ్యం గురించి మీ ఆందోళన పెరుగుతుంది.. ఎందుకంటే కుటుంబ పెద్దకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.

కుంభ రాశి ఫలాలు 2023 లో ఆరోగ్యం ఆరోగ్య పరంగా.. కుంభ రాశి వారు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. 2023వ సంవత్సరంలో ఆరవ ఇంటికి అధిపతి అయిన చంద్ర.. శని ప్రభావం వల్ల చిన్న చిన్న వ్యాధులు ఈ రాశివారిని ఇబ్బంది పెడతాయి. కొన్ని తీవ్రమైన వ్యాధులతో బాధపడే వారు ఈ సంవత్సరం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఉంటుంది.  అటువంటి పరిస్థితిలో, ఈ సంవత్సరం, యోగా చేయండి. సానుకూల దృక్పథంతో నడవండి. కుంభ రాశిలో శని పురోగతి మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఇబ్బంది పెడుతుంది. ఈ కారణంగా ఈ రాశివారు  ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

కుంభ రాశి ఫలం 2023లో విద్య కుంభ రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం కష్టతరంగా ఉంటుంది. కష్టపడి పని చేసిన తర్వాత మాత్రమే ఈ రాశివారు మంచి ఫలితాలను పొందుతారు. అదృష్టం దృష్ట్యా సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల ఈ కల ఈ సంవత్సరం నెరవేరుతుంది. ఈ సంవత్సరం శని అంశ మూడవ ఇంట్లో ఉండి ఏప్రిల్‌లో గురుగ్రహ రాశి మారిన తర్వాత పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే