Lucky Zodiac Sign 2023: కొత్త సంవత్సరంలో ఈ మూడు రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం.. ఏడాది మొత్తం డబ్బే డబ్బు.. అందులో మీరున్నారా..

జ్యోతిషశాస్త్ర గణన ప్రకారం 2023 సంవత్సరం 3 రాశుల వారికి చాలా విశిష్టమైంది. అద్భుతమైనది ఎందుకంటే కొత్త సంవత్సరంలో ఈ మూడు రాశుల వారిపై లక్ష్మిదేవి అనుగ్రహం ఉంటుంది. ఆర్ధికంగా లాభాలను ఆర్జిస్తారు.

Lucky Zodiac Sign 2023: కొత్త సంవత్సరంలో ఈ మూడు రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం.. ఏడాది మొత్తం డబ్బే డబ్బు.. అందులో మీరున్నారా..
Horoscope 2023
Follow us
Surya Kala

| Edited By: Anil kumar poka

Updated on: Dec 12, 2022 | 3:11 PM

మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం 2023 లో అడుగు పెట్టనున్నాం.. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సర రాక కోసం ఎదురు చూస్తున్నారు. కొత్త సంవత్సరంలోనైనా తమ కోరికలు నెరవేరాలని ప్రతి ఒక్కరూ ఆశలు పెట్టుకుంటారు. నూతన సంవత్సరంలో ఉద్యోగం, వ్యాపారం, వృత్తి, ఆర్థిక స్థితి, ధనలాభం, ఆరోగ్యానికి సంబంధించిన అన్ని సమస్యలు గ్రహాల కదలికపై ఆధారపడి ఉంటాయి. 2023లో చాలా గ్రహాల గమనంలో మార్పులు ఏర్పడనున్నాయి. రానున్న సంవత్సరంలో శని మొదట రాశి గమనాన్ని మార్చుకుంటుంది.  తరువాత ఏప్రిల్‌లో బృహస్పతి, అక్టోబర్‌లో రాహు-కేతువులు మారుతాయి. అంతేకాదు ఇతర గ్రహాలు కూడా ఎప్పటికప్పుడు తమ రాశిని మార్చుకుంటాయి. దీని ఆధారంగా.. ఆయా రాశికి అనుగుణంగా  స్థానికులందరి జీవితాలపై ప్రత్యేక ప్రభావం ఉంటుంది.

2023 జాతకం:  జ్యోతిషశాస్త్ర గణన ప్రకారం 2023 సంవత్సరం 3 రాశుల వారికి చాలా విశిష్టమైంది. అద్భుతమైనది ఎందుకంటే కొత్త సంవత్సరంలో ఈ మూడు రాశుల వారిపై లక్ష్మిదేవి అనుగ్రహం ఉంటుంది. ఆర్ధికంగా లాభాలను ఆర్జిస్తారు. 2023 సంవత్సరంలో ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.

మేషరాశి: రాశిచక్రంలో మొదటి రాశి మేషం. 2023 సంవత్సరంలో నక్షత్రాల ప్రత్యేక కలయిక కారణంగా.. ఈ రాశి వారిపై ఏడాది పొడవునా లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది. జాతకం 2023 ప్రకారం, శనిశ్వరుడు ఈ సంవత్సరం మేషరాశిలో 11వ ఇంట్లో సంచరిస్తాడు. జాతకంలో 11వ ఇల్లు ఆదాయం, లాభంగా పరిగణించబడుతుంది. దీంతో ఈ రాశి వ్యక్తులు తమ తమ రంగంలో పని చేస్తూ ఆదాయాన్ని పొందుతారు.  ఆర్ధిక ప్రయోజనాలను పొందుతారు. లాభదాయకమైన ఇంట్లో శని సంచారం కారణంగా.. ఈ రాశివారికి ఏడాది పొడవునా  ఆదాయంలో మంచి పెరుగుదల ఉంటుంది. అంతేకాదు కొత్త ఏడాదిలో ఈ రాశి వారి పూర్వీకుల ఆస్తిలో దేనినైనా విక్రయించడం ద్వారా లాభాలను ఆర్జిస్తారు. వ్యాపారస్తులు ఏడాది పొడవునా మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. కొత్త వ్యాపారం గురించి ఆలోచించవచ్చు. దానిని బాగా నిర్వహించి కూడా విజయం సాధించే అవకాశం ఉంది. వైవాహిక జీవితం, ప్రేమ వ్యవహారాలకు సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఈ ఉద్యోగంలో ఉన్నవారికి జీతం , ప్రమోషన్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మకరరాశి:  బృహస్పతి, శని సంచారం మకర రాశి వారికి ఒక వరం కంటే తక్కువేం కాదు. ఈ కారణంగా, మీరు 2023 సంవత్సరంలో అన్ని శుభ గ్రహాల మద్దతును పొందుతారు. లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదంతో.. ఈ రాశివారి జీవితంలో అన్ని రకాల సంతోషాలు, సంపదలు లభిస్తాయి. 2023 సంవత్సరం ఖచ్చితంగా ఈ రాశివారికి సంఘంలో గౌరవం , మంచి స్థానం లభిస్తుంది. జనవరిలో శనిదేవుడు వీరి  జాతకంలో రెండవ ఇంట్లోకి మొదటగా సంచరిస్తాడు. జాతకచక్రం ప్రకారం శని రెండవ ఇల్లు వాక్కు, ధనలాభం. అటువంటి పరిస్థితిలో, ఈ రాశివారు చేసే  ప్రసంగం, తెలివితేటల సామర్థ్యంతో సమాజంలో ఉన్నత స్థానాన్ని సాధించడంలో విజయం సాధించే అవకాశం  ఉంది. సంవత్సరంలో ఈ రాశివారు డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలను పొందుతారు. విద్యార్థుల విషయానికొస్తే, ఈ సంవత్సరం వీరికి విజయాల సంవత్సరం. మకరరాశి శని అర్ధ-సగం చివరి దశ అవుతుంది. ఏలిన నాటి శని చివరి దశకు చేరుకోవడంతో ఈ రాశివారికి శనీశ్వరుడు పెద్దగా ఇబ్బంది కలిగించడు. మొత్తంమీద ఈ సంవత్సరం ఈ రాశివారికి కావలసినవన్నీ ఇస్తుంది.

ధనుస్సు రాశి:  కెరీర్‌లో, ఈ సంవత్సరం ధనుస్సు ఈ రాశి వారు అద్భుతమైన పురోగతిని పొందే అవకాశం ఉంది. ఆర్థిక కోణం నుండి చూస్తే.. ఈ ఏడాది మొత్తం మంచి సంవత్సరంగా ఉంటుంది. ఈ సంవత్సరం డబ్బుకు లోటు ఉండదు. ధనుస్సు రాశి గల వ్యాపారస్తులు వ్యాపారంలో మంచి విజయాన్ని , లాభాలను పొందే అవకాశం ఉంది.  ఈ సంవత్సరం కుంభరాశిలో శని సంచరించడం వల్ల ధనుస్సు రాశి వారికి ఏలిన నాటి శని నుంచి విముక్తి లభిస్తుంది. ఆగిపోయిన పనులన్నీ త్వరలో పూర్తవుతాయి. ప్రతిచోటా ఈ రాశి వ్యక్తులు చేపట్టిన పనుల గురించి చర్చ ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఈ రాశివారిపై ఉంటుంది. మొత్తంగా కొత్త సంవత్సరం మొత్తం సంతోషంగా, ప్రశాంతంగా గడిచిపోతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్