Tirumala Rains: తిరుమలలో భారీ వర్షాలు.. విరిగిపడుతున్న కొండచరియలు.. కొండపైకి బైక్ పై తాత్కాలిక నిషేధం

మాండోస్ తుఫాన్ ప్రభావంతో తిరుమలలోని పలు డ్యామ్ లు నిండుకుండను తలపిస్తున్నాయి. 400 రోజులు తాగునీటికి ఎలాంటి డోకా లేదని చెప్పారు టీటీడీ అధికారులు. 

Tirumala Rains: తిరుమలలో భారీ వర్షాలు.. విరిగిపడుతున్న కొండచరియలు.. కొండపైకి బైక్ పై తాత్కాలిక నిషేధం
Heavy Rains In Tirumala
Follow us
Surya Kala

|

Updated on: Dec 11, 2022 | 6:46 AM

మాండోస్ తుఫాన్ ప్రభావం తమిళనాడుతో పాటు ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. మాండోస్ తుపాన్ ప్రభావంతో చిత్తూరు జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరపిలేని వర్షాలు కురిసాయి. తిరుమలలోని డ్యామ్ లు నిండిపోయాయి. శ్రీవారి భక్తుల దాహార్తి తీర్చే ప్రధాన జలాశయాలైన పసుపుధార, కుమారధార, పాపవినాశనం జలాశయాలు నిండు కుండలా మారాయి. కుమార ధార, పసుపు ధార జలాశయాలు పూర్తి స్థాయిలో నిండిపోవడంతో పాపవినాశనం జలాశయం ఒక గేటును ఎత్తి నీటిని విడుదల చేశారు. పాపవినాశనం డ్యామ్ గేట్లను ఎత్తివేయడంతో లోతట్టు ప్రాంతాలైన మామండూరు పరిసరాల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని చెప్పారు టీటీడీ అధికారులు.

మాండూస్‌ తుపాను కారణంగా.. తిరుమలలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం ప్రభావంతో పాపవినాశనం, జపాలి, వేణుగోపాల స్వామి ఆలయం, ఆకాశ గంగా, శ్రీవారి పాదాలకు వాహనాలను టీటీడీ అనుమతించడం లేదు. ఘాట్ రోడ్డులో అక్కడక్కడా కొండచరియలు విరిగి పడుతున్నాయి. దీంతో.. ద్విచక్ర వాహనదారులను అప్రమత్తం చేసింది టీటీడీ. కొండపైకి బైక్ లను తాత్కాలికంగా నిషేదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..