AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plastic Roads: ప్లాస్టిక్ వ్యర్ధాలకు అర్ధాన్ని కల్పిస్తూ ఏపీ సర్కార్ సరికొత్త నిర్ణయం… ప్లాస్టిక్‌ రోడ్ల నిర్మాణం దిశగా అడుగులు

సింగిల్‌ యుసేజ్‌ ప్లాస్టిక్‌ మీద ఉక్కుపాదం మోపుతూనే మరోవైపు ప్లాస్టిక్‌ రోడ్లు నిర్మాణం దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు చెందిన ప్రొఫెసర్ లు పశ్చిమ గోదావరి లో పర్యటించారు. దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సి.ఆర్.ఆర్.ఐ వేస్ట్ ప్లాస్టిక్ తో రోడ్లు నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు.

Plastic Roads: ప్లాస్టిక్ వ్యర్ధాలకు అర్ధాన్ని కల్పిస్తూ ఏపీ సర్కార్ సరికొత్త నిర్ణయం... ప్లాస్టిక్‌ రోడ్ల నిర్మాణం దిశగా అడుగులు
Plastic Roads In Ap
Surya Kala
|

Updated on: Dec 08, 2022 | 8:41 AM

Share

ఏపీలో కొత్తరకం రోడ్లు రాబోతున్నాయి. ఇప్పటి వరకు సిమెంట్‌ రోడ్లు, థార్‌ రోడ్లనే చూశాం కద. కానీ ప్లాస్టిక్‌ రోడ్ల నిర్మాణం చేస్తే ఎలా ఉంటుంది అనే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. పెరిగిపోతున్న ప్లాస్టిక్‌ వాడకంపై సర్వత్రా విమర్శలు వినవస్తున్న వేళ..  వాడి పారేసిన వ్యర్థ ప్లాస్టిక్‌ పదార్థాలకు అర్ధాన్ని, ప్రయోజనాన్ని కల్పిస్తూ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.  ప్లాస్టిక్ వ్యర్ధాలతో  నిర్మించవచ్చంటూ .. ఈ రోడ్లు ఎక్కువ కాలం మన్నికలో ఉంటాయని చెబుతున్నారు ఏపీలోని అధికారులు.

ప్లాస్టిక్ పర్యావరణానికి హానికరమే కాదు..అత్యంత ప్రమాదకరం కూడా. అందుకే ప్లాస్టిక్ పై ఏపీ ప్రభుత్వం మరింత కఠినమౌతోంది. ప్లాస్టిక్ నిషేధాన్ని మరింత కఠినతరం చేస్తూ జీవో విడుదల చేసింది. ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించగా..ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిషేదాజ్ఞలు పాటించనివారిపై జరిమానా విధించాలని ఆదేశించింది. ఇది ఇప్పటి వరకు ఏపీలో ఉన్న ప్లాస్టిక్‌ మీద అప్‌డేట్‌. ఐతే.. సింగిల్‌ యుసేజ్‌ ప్లాస్టిక్‌ మీద ఉక్కుపాదం మోపుతూనే మరోవైపు ప్లాస్టిక్‌ రోడ్లు నిర్మాణం దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు చెందిన ప్రొఫెసర్ లు పశ్చిమ గోదావరి లో పర్యటించారు. దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సి.ఆర్.ఆర్.ఐ వేస్ట్ ప్లాస్టిక్ తో రోడ్లు నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. ఎపిలోనూ ఈ తరహా రోడ్లు వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని సి.ఆర్‌.ఆర్.ఐ నిపుణులు చెబుతున్నారు.

అయితే ఇప్పటికే కేంద్రప్రభుత్వం ప్లాస్టిక్‌ రోడ్లను వేస్తుంది. దీంతో కొన్ని వందల కోట్ల రూపాయలు ఆదా చేస్తోంది. దేశ వ్యాప్తంగా లక్ష కిలోమీటర్ల ప్లాస్టిక్‌ రోడ్లు వేయాలని నిర్ణయించుకుంది. ఇటు వందల కోట్ల రూపాయలు ఆదా అవడమే కాకుండా అటు పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను తగ్గించడానికి సరైన ప్రత్యమ్నాయం దొరకడంతో కేంద్రం దీనికి మొగ్గు చూపుతుంది. రీ సైక్లింగ్‌ చేయడానికి కుదరని ప్లాస్టిక్‌ను రోడ్ల నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..