Horoscope Today: ఆదివారం రాశిఫలాలు.. నేడు ఈ రాశివారికి ధన, ధాన్య లాభాలున్నాయి..

మంచి జరుగుతుందా.. ఏమైనా చెడు జరిగే అవకాశం ఉందా అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (డిసెంబర్ 11వ తేదీ ) ఆదివారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope Today: ఆదివారం రాశిఫలాలు.. నేడు ఈ రాశివారికి ధన, ధాన్య లాభాలున్నాయి..
Horoscope Today
Follow us
Surya Kala

|

Updated on: Dec 11, 2022 | 6:29 AM

Horoscope Today (11-12-2022): కొత్తగా రోజు మొదలైతే.. ముందుగా ఎక్కువమంది ఆలోచించేది.. ఈ రోజు తమకు ఎలా ఉంటుంది.. మంచి జరుగుతుందా.. ఏమైనా చెడు జరిగే అవకాశం ఉందా అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (డిసెంబర్ 11వ తేదీ ) ఆదివారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. కీలకమైన పనులు పూర్తి చేసి కీర్తి ప్రతిష్టలను అందుకుంటారు. బద్ధకాన్ని దరిచేరనీయకండి.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు సంతోషంగా కాలం గడుపుతారు. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలను అందుకుంటారు.   కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారికి ధన యోగం ఉంది. ముఖ్యమైన విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకోవడం మేలు. అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో ఓ అడుగు ముందుకు వేస్తారు. ఖర్చు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు బుద్ధి బలం బాగుంటుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. కీలక వ్యవహారాల్లో ముందుకు వెళ్లారు. ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు ఎవరినీ అతిగా నమ్మవద్దు. పట్టుదలతో ప్రయత్నించి చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికపరమైన విషయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారికి మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారులతో ఉద్యోగస్తులు జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. కీలక నిర్ణయాలను తీసుకోవడంలో ఇబ్బందులు పడతారు. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు భ్యవిష్యత్ ప్రణాళికతో ముందుకు వెళ్లారు. ఆదాయానికి తగిన వ్యయం చేస్తారు. అనుకూల ఫలితాలను పొందుతారు. బంధు, మిత్రులతో విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు సంతోషముగా కాలం గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలు చేపడతారు. కొందరి ప్రవర్తన ఈ రాశివారికి బాధిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. నిరుత్సాహం కలిగించే సంఘటనలు జరిగే అవకాశం ఉంది.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పోత్సాహకర వాతావరణం ఉంటుంది.    బంధు,మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులు  సక్సెస్ అయ్యే విధంగా నిర్ణయాలను తీసుకుంటారు. ధనధాన్య లాభాలు కలిగే అవకాశం ఉంది. వాణిజ్యరంగంలోని వారికి కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు