Agni-5: డ్రాగన్ కంట్రీకి దిమ్మతిరిగే షాక్.. బీజింగ్‌ను ఢీకొట్టగల క్షిపణి.. అగ్ని-5 పరీక్ష సూపర్ సక్సెస్..
అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా భారత్ పరీక్షించింది. అణ్వాయుధాలను ప్రయోగించగల సామర్ధ్యం ఉన్న ఈ బాలిస్టిక్ మిస్సైల్ పరిధి 5000 కిలోమీటర్లు. అయితే ఈ 5 వేల కిలోమీటర్ల దూరాన్ని మించి కూడా లక్ష్యాన్ని..
అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. చైనాతో ఉద్రిక్తతల మధ్య, భారతదేశం బుధవారం రాత్రిపూట 5,000 కి.మీ కంటే ఎక్కువ లక్ష్యాలను ఛేదించగల అత్యంత శక్తివంతమైన అగ్ని-5 అణు సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. తొలిసారిగా క్షిపణిని పూర్తి స్థాయిలో ప్రయోగించారు. ఒడిశాలోని బాలాసోర్ తీరంలోని అబ్దుల్ కలాం టెస్ట్ సెంటర్‌లో ఈ పరీక్ష జరిగింది. చైనా, పాకిస్తాన్‌తో సహా అన్ని దేశాలకు డేంజర్ బెల్ మోగుతున్నాయి. అవసరమైతే అగ్ని-V క్షిపణి పరిధిని విస్తరించగల సామర్థ్యాన్ని ఈ పరీక్ష నిరూపించింది.
ఈ క్షిపణిని DRDO, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. కొత్త క్షిపణి ఫైర్‌పవర్ 5 వేల నుండి 8 వేల కి.మీ. అగ్ని-5 ఎత్తు 17 మీటర్లు. 50 టన్నుల బరువున్న ఈ క్షిపణి 1.5 టన్నుల వరకు అణు వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. అగ్ని-5 ధ్వని కంటే 24 రెట్ల వేగంతో పోటీపడగలదు.
ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ICBM) అగ్ని-5 కాకుండా, అగ్ని సిరీస్‌లోని భారతీయ ఆయుధాగారంలో 700 కి.మీ పరిధితో అగ్ని-1, 2,000 కి.మీ పరిధితో అగ్ని-2, 2500 కి.మీ పరిధితో అగ్ని-3 ఉన్నాయి. అగ్ని-4 3500 కి.మీ కంటే ఎక్కువ పరిధిని కలిగి ఉంటుంది.
India today successfully carried out the night trials of the Agni-5 nuclear-capable ballistic missile which can hit targets beyond 5,000 kms: Defence sources pic.twitter.com/AniA4Xgzdy
— ANI (@ANI) December 15, 2022
అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి ఇప్పటి వరకు ఉన్న అన్ని అగ్ని క్షిపణుల కంటే తేలికైనది. దీని బరువు 50 వేల కిలోలు. గుండ్రంగా దాని పరిమాణం (వ్యాసం) 6.7 అడుగులు. అదే సమయంలో, దాని పొడవు 17.5 మీటర్లు అంటే 57.4 అడుగులు. ఈ క్షిపణి ధ్వని వేగం కంటే 24 రెట్లు వేగంగా చంపగలదు. దీని వేగం గంటకు 29,401 కిలోమీటర్లు.
అణ్వాయుధాలతో దాడి చేయగల సామర్థ్యం ఉన్న ఈ క్షిపణి 1500 కిలోల అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు. ట్రక్కు సహాయంతో ఎక్కడికైనా రవాణా చేయవచ్చు. దీనిని మొబైల్ లాంచర్ నుండి ఆపరేట్ చేయవచ్చు. దీని సాంకేతికత దీన్ని మరింత ప్రత్యేకంగా చేస్తుంది. ఇది ఒకేసారి అనేక రకాల లక్ష్యాలను ధ్వంసం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ఒడిశాలోని బాలాసోర్ తీరంలోని అబ్దుల్ కలాం టెస్టింగ్ సెంటర్‌లో ఈ క్షిపణిని పరీక్షించారు. పరిధిని పెంచే సాంకేతికతను కూడా ఈ క్షిపణిలో అమర్చారు. చైనా గురించి మాత్రమే మాట్లాడితే, ఇది చైనాలోని బీజింగ్, హాంకాంగ్, గ్వాంగ్‌జౌ, షాంఘైలను తాకగలదు. ఈ క్షిపణి వ్యవస్థ ఇంకా పాకిస్థాన్ వద్ద లేదు.
ఈ క్షిపణి వ్యవస్థ చైనా, రష్యా, ఉత్తర కొరియా, అమెరికా, ఫ్రాన్స్‌ల వద్ద మాత్రమే ఉంది. దీని తరువాత, భారతదేశం అగ్ని-6 క్షిపణిని సిద్ధం చేస్తోంది, దీని మందుగుండు సామగ్రి 12000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అయితే దీని టెస్టింగ్ ఎంత వరకు జరుగుతుందనే దానిపై అధికారిక సమాచారం రాలేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం