Weekly Horoscope: ఆ రాశుల వారికి శుభకాలం.. డిసెంబర్ 18 నుంచి 24వ తేదీ వరకు రాశి ఫలాలు..

Astrology Weekly Horoscope: జాతకాలను, రాశిఫలాలను నమ్మేవారు ప్రతిరోజూ మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. కొంతమంది రాశిఫలాలను ఆధారంగా తాము చేపట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా

Weekly Horoscope: ఆ రాశుల వారికి శుభకాలం.. డిసెంబర్ 18 నుంచి 24వ తేదీ వరకు రాశి ఫలాలు..
Horoscope
Follow us
TV9 Telugu

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 18, 2022 | 7:22 AM

Astrology Weekly Horoscope: జాతకాలను, రాశిఫలాలను నమ్మేవారు ప్రతిరోజూ మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. కొంతమంది రాశిఫలాలను ఆధారంగా తాము చేపట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా జరుగుతాయో లేదా తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. దీంతో తమ నామ నక్షత్ర ప్రకారం, లేక జన్మ నక్షత్ర ప్రకారం వార ఫలాలను తెలుసుకుని ముందుకు సాగుతారు. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి (18వ తేదీ డిసెంబర్) నుంచి శనివారం ( డిసెంబర్ 24వ తేదీ) వరకూ ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు కలగనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగంలో అకస్మాత్తుగా కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. అధికారులు మీ శ్రమను, ప్రతిభను గుర్తిస్తారు. వ్యాపారంలో లాభాలు గడించడానికి అవకాశం ఉంది. అనవసర ఖర్చుల్ని బాగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరినీ నమ్మి ఆర్థిక బాధ్యతలు అప్పగించవద్దు. కొందరు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. కొద్దిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఒక ప్రధానమైన ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్త. మంచి పెళ్లి సంబంధం వీరి అవకాశం ఉంది. లాయర్లకు, డాక్టర్లకు, చిన్న వ్యాపారులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. స్పెక్యులేషన్ చాలా వరకు బాగుంటుంది.
  2. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): కొత్త ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఉద్యోగ పరంగా కలిసి వచ్చే కాలం ఇది. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు ఉపకరిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. కొన్ని ముఖ్యమైన పనుల్ని పూర్తిచేస్తారు. స్నేహితులకి అండగా ఉంటారు. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. లాభాలపరంగా వ్యాపారులకు బాగానే ఉంటుంది. పిల్లలు శుభవార్త తీసుకొస్తారు. ఆర్థిక లావాదేవీలు బాగానే ఉంటాయి.
  3. మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) : ఉద్యోగ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ప్రతి వ్యాపారాల్లో ఆదాయానికి లోటుండదు. ఇంటా బయట శ్రమ పెరుగుతుంది. అనుకున్న పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఖర్చుల్ని అదుపులో ఉంచుకోవాలి. గతంలో మీ వల్ల సహాయం పొందిన వారు మీకు అండగా నిలబడతారు. చాలాకాలంగా వేధిస్తున్న ఒక వ్యక్తిగత సమస్య అనుకోకుండా పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది. స్పెక్యులేషన్ జోలికి పోవద్దు. ఎవరికీ హామీలు ఉండవద్దు. డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. బంధువులకు సంబంధించి ఒక దుర్వార్త వింటారు.
  4. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) : ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. పాజిటివ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితం ఇస్తాయి. ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. ఉద్యోగంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. బంధువులకు కొద్దిగా ఆర్థికంగా సహాయపడతారు. వ్యాపారంలో బాగా ఒత్తిడి ఉన్న ఆర్థిక ప్రయోజనాలకి లోటు ఉండదు. పరిచయస్తులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. కుటుంబ సభ్యులతో విహారయాత్ర చేస్తారు. సంతానం నుంచి శుభవార్త వింటారు. స్నేహితురాలితో షికార్లు చేస్తారు.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) : ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. అధికార యోగానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం ఉంది. వ్యాపారంలో కొద్దిగా శ్రమ ఎక్కువవుతుంది. జీవితానికి పనికివచ్చే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహితులతో అపార్ధాలు చోటుచేసుకుంటాయి. వీలైనంతగా ఖర్చులు తగ్గించుకోవాలి. చిన్న చిన్న సమస్యలకు కూడా ఆందోళన చెందటం మంచిది కాదు.
  7. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) : ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు సంపాదనకు అవకాశం ఉన్న ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అన్ని విధాల బాగుంటుంది. పట్టుదలగా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. రుణభారం బాగా తగ్గుతుంది. వృత్తి నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఇల్లు గాని, స్థలం కానీ కొనడానికి ప్రయత్నిస్తారు. విహారయాత్రకు అవకాశం ఉంది. ఇష్టమైన స్నేహితులని కలుసుకుంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
  8. తుల(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : ఉద్యోగంలో విపరీతమైన ఒత్తిడి, శ్రమ ఉంటాయి. సహచరుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం కొద్దిగా దారి తప్పుతుంది. వైద్య ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం మరికొంత కాలం నిరీక్షించాల్సి ఉంటుంది. కొందరు స్నేహితులను నమ్మి మోసపోతారు. వ్యక్తిగతంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సమస్య ఒకటి సామరస్యంగా పరిష్కారం అవుతుంది. బంధువులు చేదోడు వాదోడుగా ఉంటారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు. పెళ్లి సంబంధం వాయిదా పడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి.
  9. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ముఖ్యమైన పనులు కూడా పూర్తికాక బాగా ఇబ్బంది పడతారు. ఒక వ్యక్తిగత సమస్య విషయంలో మిత్రులు అండగా నిలబడతారు. ఉద్యోగ బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. కుటుంబ పరంగా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం పరవాలేదు. వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారి పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ఇరుగుపొరుగుతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఎవరికైనా డబ్బు ఇచ్చినా, తీసుకున్నా నష్టపోతారు.
  10. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): డబ్బు ఇవ్వాల్సిన వారు తెచ్చి ఇవ్వడంతో కొద్దిగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు, స్వయం ఉపాధి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. మీ ఆర్థిక స్తోమతకు మించి స్నేహితులకు సహాయం చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పిల్లల్లో ఒకరు దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. అద్దె ఇంట్లో ఉన్నవారు ఇల్లు మారే సూచనలున్నాయి. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.
  11. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) : ఉద్యోగంలో పని భారం బాగా పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉన్నా, ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. సమాజానికి మేలు చేసే పనులు చేపడుతారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది. అదనపు ఆదాయం కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తారు. సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. పిల్లలు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన పనులకు కుటుంబ సభ్యులను కూడగట్టుకోండి.
  12. కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) : అదనపు ఆదాయం కోసం ఎక్కువగా శ్రమ పడతారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీద పడతాయి. ముఖ్యమైన పనుల్లో బాగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఆశించిన స్థాయిలో కాకపోయినా సంతృప్తికరంగా లాభాలు గడిస్తారు. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చెడు స్నేహాలకు, వ్యసనాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పర్వాలేదు. కొందరు మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు ఆఫర్ వస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తవుతాయి. బంధువుల ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతారు. ఇరుగుపొరుగుతో అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంది.
  13. మీనం (పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి): ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. ప్రస్తుతానికి ఉద్యోగం మారే అవకాశం లేదు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి సమయం అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనుల్ని అతి కష్టం మీద స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం నిడకడగా ఉంటుంది. చదువులు ఉద్యోగాల్లో పిల్లల పురోగతి గురించి మంచి కబుర్లు వింటారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల వారికి ఆర్థికంగా ఇది ఎంతో అనుకూల సమయం. వ్యక్తిగత సమస్యలను లెక్కచేయకుండా బంధుమిత్రులకు సహాయపడతారు. ఎవరికీ హామీలు, పూచీ కత్తులు ఉండవద్దు. స్పెక్యులేషన్ వాయిదా వేయండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)