Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Dev puja: ఏలి నాటి శని నుంచి ఉపశమనం కోసం శనీశ్వరుడిని ఇలా పూజించండి..

శనీశ్వరుడి  దృష్టి వలన అన్ని సార్లు చెడు జరగదు. ఒక వ్యక్తి జాతకంలో శనీశ్వరుడి శుభప్రదమైన స్థానంలో ఉంటే.. ఆ వ్యక్తి ఒక స్థాయి నుండి రాజుగా ఎదగడానికి ఎక్కువ సమయం పట్టదు. అయితే శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి..

Shani Dev puja: ఏలి నాటి శని నుంచి ఉపశమనం కోసం శనీశ్వరుడిని ఇలా పూజించండి..
God Shaniswar
Follow us
Surya Kala

|

Updated on: Dec 18, 2022 | 6:15 PM

హిందూ మతంలో శనీశ్వరుడిని న్యాయ దేవుడు అని పిలుస్తారు. శని భగవానుడు మానవుల మంచి చెడు ప్రవర్తనకు అనుగుణంగా ఫలాలను ఇస్తాడు. శనివారం రోజున శనీశ్వరుడిని ఆరాధించడం ద్వారా భక్తులకు అన్ని బాధలు తొలగిపోతాయని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తి తన జీవితంలో ఒకసారైనా ఏలిన నాటి శని బారిన పడతారు. ఈ కారణంగా మనుషుల జీవితంలో చాలా సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ.. శనీశ్వరుడి  దృష్టి వలన అన్ని సార్లు చెడు జరగదు. ఒక వ్యక్తి జాతకంలో శనీశ్వరుడి శుభప్రదమైన స్థానంలో ఉంటే.. ఆ వ్యక్తి ఒక స్థాయి నుండి రాజుగా ఎదగడానికి ఎక్కువ సమయం పట్టదు. అయితే శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి.. ముఖ్యంగా శనివారాల్లో కొన్ని చర్యలు తీసుకోవాలి. అవి ఏమిటో తెలుసుకుందాం..

హనుమంతుని ఆరాధన అన్ని దుఃఖాలు, బాధల నుంచి రక్షించేందుకు హనుమంతుడిని పూజించడం ద్వారా శనీశ్వరుడు సంతోషంగా ఉంటాడు. ఎవరి  జాతకంలో శని దోషం ఉంటే లేదా శని అనుగ్రహం కావాలన్నా ప్రతిరోజూ హనుమంతుడిని పూజించాలి. ముఖ్యంగా శనివారం రోజున  హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం శుభ ఫలితాలను ఇస్తుంది.

రావి చెట్టుకి పూజ శనివారం నాడు రావి చెట్టుకు ఏడు సార్లు ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నించండి. ఇలా ప్రదక్షణలు చేస్తున్నప్పుడు, పచ్చి పత్తి దారాన్ని మీ చేతిలో పట్టుకోండి.. ఇలా ప్రదక్షణ చేస్తూ.. ఆ దారాన్ని రావి చెట్టు చుట్టూ చుట్టండి. ఇలా చేస్తున్నప్పుడు మీ మనస్సులో శనీశ్వరుడిని ధ్యానించండి. శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి రావి చెట్టులో నివసిస్తారని.. ఇలా రావి చెట్టుని పూజించడం వలన లక్ష్మి విష్ణువులు సంతోషిస్తారని నమ్ముతారు. శనీశ్వరుడు కూడా అటువంటి భక్తుల పట్ల సంతోషిస్తాడు.

ఇవి కూడా చదవండి

పూజ సమయంలో శనీశ్వరుడి కళ్లలోకి చూడకూడదు శనీశ్వరుడిని పూజించేటప్పుడు శనిదేవుని కళ్లలోకి చూడకూడదని చెబుతారు. పూజను చేసే సమయంలో మీ కళ్ళు క్రిందికి ఉంచడానికి ప్రయత్నించండి. శనీశ్వరుడిని పూజించేటప్పుడు అతని కళ్ళలోకి చూడటం వలన అతని చెడు దృష్టి మీపై పడుతుందని నమ్ముతారు. దీని వల్ల మీ జీవితంలో సమస్యలు ఏర్పడవచ్చు.

దాతృత్వం వలన ప్రయోజనాలు శనివారం నాడు దానానికి, దక్షిణకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మీ జీవితంలో శని దోషం ఉంటే, నల్ల నువ్వులు, నల్ల గొడుగులు, ఆవనూనె మొదలైన వాటిని శనివారం రోజున దానం చేయాలని నమ్ముతారు. దీనితో పాటు, వీలైతే, ఈ రోజుల్లో పేద లేదా ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారం ఇవ్వడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది.

ఆవాల నూనెతో నివారణ  ఇంట్లో ఎవరికైనా శనీశ్వరుడిని చెడు ప్రభావం ఉంటే, శనివారం నాడు ఒక గిన్నెలో ఆవ నూనె ఉంచి, అందులో మీ ముఖం చూడండి. ఇలా చేస్తున్నప్పుడు శనిదేవుడిని స్మరించుకోండి. దీనితో మీ సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)