Horoscope: ఈ రాశి ఉద్యోగులకు జాగ్రత్త అవసరం.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.?

ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలగా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. శ్రమకు తగ్గ ఫలితం అందుతుంది.

Horoscope:  ఈ రాశి ఉద్యోగులకు జాగ్రత్త అవసరం.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.?
Horoscope Today
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Dec 19, 2022 | 5:00 AM

  • మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆర్థికంగా కొంత ప్రయోజనం చేకూరుతుంది. ఈరోజు ఈ రాశి వారికి సమయం ఏమంత అనుకూలంగా లేదు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. అన్ని విషయాలలోనూ బాగా శ్రమ, ఒత్తిడి అనుభవానికి వస్తాయి. మిత్రుల సహాయంతో ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. కుటుంబ వాతావరణం చాలావరకు పరవాలేదు. అందరిని కలుపుకుని వెళితే మంచిది. వివాదాలకు దూరంగా ఉండండి. ఎవరికీ హామీలు ఉండవద్దు.

  • వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. ఆదాయం, ఆరోగ్యం పరవాలేదు అనిపిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. బంధుమిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయపడతారు.

  • మిథునం(మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఒకటి రెండు కొత్త ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వివాహానికి మంచి సమయం ఇది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కొద్దిపాటి పురోగతి అనుభవానికి వస్తుంది. బంధు వర్గంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త.

  • కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలగా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. శ్రమకు తగ్గ ఫలితం అందుతుంది. ఉద్యోగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇల్లు గానీ, స్థలం గానీ కొనే ఆలోచన చేస్తారు. బంధుమిత్రులు అండగా నిలబడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

  • సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

రాదని వదిలేసుకున్న డబ్బు చేతికి అందిస్తుంది. ఉద్యోగం విషయంలో అనుకున్నది సాధిస్తారు. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. దగ్గరి బంధువులతో విభేదాలకు లేదా అపార్థాలకు అవకాశం ఉంది. శక్తికి మించి శ్రమపడి మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. హామీలు ఉండవద్దు.

  • కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

సమయం అన్ని విధాల బాగుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలకు ఆస్కారం ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

  • తుల(చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3)

ఉద్యోగ పరంగా సమయం కొద్దిగా ప్రతికూలంగా ఉంది. ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థికపరమైన ప్రయత్నాలు ఒక్కోటి ఒక్కటిగా ఫలిస్తాయి. సరైన ఆలోచన విధానంతో ముందడుగు వేయండి. రుణ సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సమాజానికి పనికివచ్చే పనులు చేపడుతారు. ఆరోగ్యం జాగ్రత్త.

  • వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సంతృప్తి లభిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. వివాహ ప్రయత్నాలలో పురోగతి ఉంటుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు బాగుంటుంది.

  • ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థిక సంబంధమైన శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో కొన్ని విషయాల మీద బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆదాయానికి సంబంధించి కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో కొన్ని ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులకు అన్ని విధాల అనుకూలంగా ఉంది. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది.

  • మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

గ్రహ సంచారం కొద్దిగా అనుకూలంగా ఉంది. స్నేహితుల నుంచి, బంధువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. గృహ, వాహన యోగాలపైన దృష్టి పెడతారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు.

  • కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. కొద్దిగా ధన లాభం కూడా ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. స్నేహితులు, ఆప్తుల సలహాలను కూడా తీసుకోండి. ఇరుగుపొరుగు వారితో సహనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం పర్వాలేదు. ఎవరికీ హామీలు ఉండవద్దు.

  • మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆశించిన విధంగా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ప్రతిదీ ఆలోచించి చేయండి. ప్రణాళిక బద్ధంగా పనిచేస్తే లక్ష్యాన్ని చేరుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. సహచరుల సహకారం కూడా తీసుకోండి. కోపతాపాలకు ఇది సమయం కాదు. బంధువులతో అపార్ధాలు చోటు చేసుకుంటాయి.