AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shakuna Shastra: ఇంట్లో ఉన్నఫలంగా నల్ల చీమలు కనిపిస్తున్నాయా.. దేనికి సంకేతమో తెలుసా.?

ఇంట్లో జరిగే కొన్ని మార్పులు భవిష్యత్తులో జరిగే అంశాలను సూచిస్తాయని నమ్ముతుంటారు. దీనికే శకున శాస్త్రం అంటారు. ఇంటిపై కాకి అరవడం, పిల్లి అడ్డు రావడం వంటివి దీనికి ఉదారహరణలుగా చెప్పవచ్చు. శకున శాస్త్రంలో వీటికి అర్థాలు ఉంటాయి...

Shakuna Shastra: ఇంట్లో ఉన్నఫలంగా నల్ల చీమలు కనిపిస్తున్నాయా.. దేనికి సంకేతమో తెలుసా.?
Shakuna Shastra
Narender Vaitla
|

Updated on: Dec 18, 2022 | 5:22 PM

Share

ఇంట్లో జరిగే కొన్ని మార్పులు భవిష్యత్తులో జరిగే అంశాలను సూచిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. దీనికే శకున శాస్త్రం అంటారు. ఇంటిపై కాకి అరవడం, పిల్లి అడ్డు రావడం వంటివి దీనికి ఉదారహరణలుగా చెప్పవచ్చు. శకున శాస్త్రంలో వీటికి అర్థాలు ఉంటాయి. ఇలాంటి వాటిలో ఒకటి ఇంట్లో ఉన్నట్లుండి చీమలు ప్రత్యక్షం కావడం. కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో చీమలు కనిపిస్తుంటాయి. మళ్లీ కాసేపటికే మాయమైపోతుంటాయి. నల్ల, ఎర్ర చీమలు సడన్‌గా ప్రత్యక్షమవుతుంటాయి. శకున శాస్త్రం ప్రకారం ఇలా చీమలు కనిపించడం దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం..

శకున శాస్త్రం ప్రకారం నల్ల చీమలు కనిపించడం శుభప్రదంగా భావిస్తారు. ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే అది ఇంట్లో ఆనందం, శ్రేయస్సు రావడానికి సంకేతంగా పరిగణిస్తారు. దీంతో పాటు మీ శారీరక ఆనందాలు పెరగబోతున్నాయనడానికి ఇది శుభ సంకేతం. ఏదైనా ధాన్యంలో నల్ల చీమ కనిపిస్తే అది మరింత శుభప్రదమని అర్థం. ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే, వాటికి చక్కెర లేదా పిండి వంటి అందిస్తే మంచి జరుగుతుంది.

ఇదిలా ఉంటే ఒకేసారి ఎర్ర చీమలు బటయకు వస్తే అది అశుభానికి సూచికగా చెబుతుంటారు. ఇది ఇంట్లో రాబోయే ఇబ్బందులకు సంకేతంగా పరిగణిస్తారు. ఇంట్లో ఎర్ర చీమలు బయటకు వస్తే, మీరు భవిష్యత్తులో చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని, ఆర్థిక ఖర్చులు కూడా పెరుగుతాయని అర్థం. నల్ల చీమలు ఉత్తర దిశ నుంచి వస్తే అది చాలా శుభప్రదం. అలాగే ఎరుపు చీమలు తూర్పు నుంచి వస్తే అది అశుభం. ఎర్ర చీమలు పడమటి నుంచి శుభప్రదం. ప్రయాణాలు చేస్తారని అర్థం. చీమలు పైనుంచి కిందికి రావడం కూడా శ్రేయస్కరం. మరోవైపు, చీమలు కింది నుండి పైకి వెళితే, అది జీవితంలో పురోగతికి చిహ్నంగా భావిస్తారు.

ఇవి కూడా చదవండి

నోట్‌: పైన తెలిపిన విషయాలు కొందరు జ్యోతిష్య నిపుణుల అభిప్రాయాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీనిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గుర్తించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..