Vastu Tips 2023: కొత్త ఏడాదిలో ఈ సులభమైన వాస్తు నివారణలు చేయండి.. సంవత్సరం పొడవునా సుఖ, సంపద మీ సొంతం

నూతన సంవత్సరంలో ఈ వాస్తు నివారణలు చేయడం ద్వారా, సంవత్సరం పొడవునా వ్యక్తి జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, రాబోయే కొత్త సంవత్సరం శుభప్రదంగా ఉండాలంటే సంవత్సరం ప్రారంభానికి ముందు ఏ వాస్తు నివారణలు చేయాలో తెలుసుకుందాం.

Vastu Tips 2023: కొత్త ఏడాదిలో ఈ సులభమైన వాస్తు నివారణలు చేయండి.. సంవత్సరం పొడవునా సుఖ, సంపద మీ సొంతం
Vastu Tips 2023
Follow us
Surya Kala

|

Updated on: Dec 18, 2022 | 11:07 AM

కొత్త సంవత్సరంలోకి మరికొన్ని రోజుల్లో అడుగు పెట్టనున్నాం.. రాబోయే సంవత్సరం తమకు అత్యంత సుఖ సంతోషాలను ఇవ్వాలని..  కొత్త సంవత్సరంపై ప్రతి ఒక్కరికీ ఎన్నో కోరికలు, ఆశలు ఉంటాయి. గత సంవత్సరం కంటే రాబోయే సంవత్సరం చాలా బాగుండాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. రాబోయే సంవత్సరం శుభప్రదంగా ఉండడం కోసం.. విజయవంతం కావడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని నివారణలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నూతన సంవత్సరంలో ఈ వాస్తు నివారణలు చేయడం ద్వారా, సంవత్సరం పొడవునా వ్యక్తి జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, రాబోయే కొత్త సంవత్సరం శుభప్రదంగా ఉండాలంటే సంవత్సరం ప్రారంభానికి ముందు ఏ వాస్తు నివారణలు చేయాలో తెలుసుకుందాం.

వేద జ్యోతిషశాస్త్రంలో.. ఏదైనా శుభ కార్యం చేయడానికి ముందు.. జీవితంలోని ఏదైనా ముఖ్యమైన దశలోకి ప్రవేశించడానికి ముందు గణేశుడిని ఖచ్చితంగా పూజిస్తారు. గణేశుడిని విఘ్నాలను హరించే వాడని నమ్మకం. చేపట్టిన పనుల్లో అన్ని రకాల అడ్డంకులు తొలగి విజయ వంతం అవుతుందని విశ్వాసం. అటువంటి పరిస్థితిలో.. కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు ఇంటి ప్రధాన ద్వారం వద్ద వినాయకుని విగ్రహాన్ని ఉంచండి. అంతేకాదు.. ఇంటి ప్రధాన తలుపు వద్ద గుర్రపుడెక్క ఉంచండి. ప్రవేశద్వారం వద్ద గుర్రపుడెక్కను అమర్చిన ఇళ్లలోకి ప్రతికూల శక్తి ప్రవేశించదని ఒక నమ్మకం. ఇంటి ప్రధాన ద్వారం వద్ద వినాయకుడి విగ్రహం, గుర్రపుడెక్కను ఉంచడం ద్వారా, సంవత్సరం పొడవునా అదృష్టం, ఐశ్వర్యం, పురోగతి, గౌరవం..  సంపదలు ఉంటాయి.

వ్యాపారంలో ఏడాది పొడవునా వృద్ధి కోసం ఏదైనా వ్యాపారం చేసే వారికి, కొత్త సంవత్సరం ప్రత్యేకంగా ఉండాలి. వారు భారీ లాభాలను పొందుతారు. అప్పుడు మీ సంస్థల్లో లక్ష్మిదేవి చిత్రాన్ని ఉంచండి. ధార్మిక దృక్కోణంలో లక్ష్మి విగ్రహాన్ని ప్రతిష్టిస్తే ధన వర్షం కురుస్తుంది.

ఇవి కూడా చదవండి

వెదురు ఉంచండి ఫెంగ్ షుయ్, వాస్తు శాస్త్రంలో వెదురు మొక్క ఆనందం, శ్రేయస్సు , ఆరోగ్యానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. వెదురు మొక్కకు ప్రతికూల శక్తిని గ్రహించే శక్తి ఉంది. వెదురు మొక్క ఉన్న ఇళ్లలో వాస్తు దోషం ఉండదని ఒక నమ్మకం. అటువంటి పరిస్థితిలో, 2023 సంవత్సరం అద్భుతంగా ఉండాలంటే, మీ డ్రాయింగ్ రూమ్, వంటగదిలో వెదురు మొక్కను ఉంచండి. ఈ పరిహారంతో, సంవత్సరం పొడవునా ఇంట్లో సుఖ శాంతులతో పాటు సంపద ఉంటుంది.

విండ్‌చైమ్ వాస్తులో ప్రతికూల శక్తిని తొలగించడంలో విండ్‌చైమ్ చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. చిన్న గంటలు విండ్ చైమ్‌లలో కట్టబడి ఉంటాయి. ఇవి గాలి తగిలి కదులుతూ నిరంతరం ధ్వనిస్తూనే ఉంటాయి. విండ్‌చైమ్ శబ్దం ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా చూస్తుంది. మీరు ఇంటి మెయిన్ డోర్, బాల్కనీ, కిటికీలకు విండ్ చైమ్‌లను వేలాడదీయవచ్చు. అటువంటి పరిస్థితిలో, ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. వృత్తి రంగంలో పురోగతి ఉంటుంది.

లాఫింగ్ బుద్ధుడు లాఫింగ్ బుద్ధుడు ఫెంగ్ షుయ్‌..  శుభం, శ్రేయస్సు యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో 2023 సంవత్సరాన్ని మంచిగా మార్చడానికి, లాఫింగ్ బుద్ధను ఇంటి ప్రధాన గదిలో తలుపుకు ఎదురుగా ఉంచండి. వాస్తు శాస్త్రంలో లాఫింగ్ బుద్ధను సంపద , శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. ఇది ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది. శ్రేయస్సును తెస్తుంది.

అక్వేరియం చేపలు శుభం, విలాసానికి చిహ్నంగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో, 2023 సంవత్సరాన్ని పవిత్రంగా, అద్భుతంగా చేయడానికి, ఇంట్లో ఫిష్ అక్వేరియం లేదా ఫిష్ బౌల్ ను ఏర్పాటు చేసుకోండి. ఇంట్లో వచ్చే సంక్షోభాన్ని చేపలు నివారిస్తాయి. అక్వేరియం లేదా ఫిష్ బౌల్ ఉన్న ఇళ్లలో ఎల్లప్పుడూ సుఖ సంపదలు ఉంటాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్