Zodiac Signs: ఈ రాశులకు ఆదాయం నిలకడగా ఉంటుంది.. మరి ఇందులో మీ రాశి ఉందా.?

వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో చక్కని అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు..

Zodiac Signs: ఈ రాశులకు ఆదాయం నిలకడగా ఉంటుంది.. మరి ఇందులో మీ రాశి ఉందా.?
Horoscope Today
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Dec 17, 2022 | 8:30 AM

  • మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో చక్కని అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి తరఫు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆదాయంతో పాటు అనవసర ఖర్చులు కూడా పెరుగుతాయి. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.

  • వృషభం (కృత్తిక, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగం ప్రశాంతంగా సాగిపోతుంది. తలపెట్టిన పనులు చాలా వరకు పూర్తవుతాయి. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులు, స్నేహితులు అండగా నిలబడతారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి మంచి కబుర్లు వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికీ అప్పు ఇవ్వవద్దు.

  • మిథునం(మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

కుటుంబ పరంగా కొన్ని చిక్కులు ఎదురవుతాయి. ఆర్థికంగా ఇబ్బంది పడతారు. వ్యక్తిగత సమస్యల పరిష్కారం పై దృష్టి పెడతారు. ఉద్యోగం విషయంలో కొద్దిగా ఆందోళన ఉంటుంది. అప్పు తీసుకోవడానికి, ఇవ్వడానికి ఇది సమయం కాదు. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది.

  • కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆర్చిక లావాదేవీలవల్ల ఇబ్బంది పడతారు. నమ్మకద్రోహం జరిగే అవకాశం ఉంది.

  • సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

గ్రహ సంచారం ఏమంత అనుకూలంగా లేదు. అతి కష్టం మీద కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. చాలా కాలంగా చేస్తున్న పెళ్లి ప్రయత్నాలు ఒక దారిలోకి వస్తాయి. ప్రయాణాల వల్ల నష్టపోతారు. వ్యాపార పరంగా ఒక శుభవార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండండి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

  • కన్య(ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగానికి సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో విందులు పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం విషయంలో కొద్దిగా ఆందోళన చెందుతారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఎవరితోనూ వాదోపవాదాలకు దిగవద్దు. స్పెక్యులేషన్ లాబించే అవకాశం ఉంది.

  • తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. పని భారం పెరుగుతుంది. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. అనుకోకుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది. వ్యాపారులకు సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది.

  • వృశ్చికం(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగానికి సంబంధించి దూర ప్రాంతం నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. అనుకోకుండా చేతికి డబ్బు అందుతుంది. ఆస్తి విషయంలో శుభవార్త వింటారు. వ్యాపారులు మరింతగా శ్రమ పడాల్సి ఉంటుంది. పెళ్లి సంబంధం కుదరవచ్చు. బంధువులకు సంబంధించిన ఒక సమాచారం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఎవరితోనైనా ఆచి చూచి మాట్లాడటం మంచిది.

  • ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు బాగా పెరిగి ఇబ్బంది పడతారు. అనుకున్న పనులు చాలా వరకు పూర్తవుతాయి. అవసరానికి తగినంత డబ్బు సర్దుబాటు అవుతుంది. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. కొంతమంది మిత్రుల కారణంగా డబ్బు నష్టం జరగవచ్చు.

  • మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో మీ శ్రమకు, ప్రతిభకు తగినంత గుర్తింపు లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. బంధువులలో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారంలో లాభాల పంట పండుతుంది. కొత్త మిత్రులు పరిచయం అవుతారు. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. మితిమీరిన ఔదార్యం వల్ల నష్టపోతారు.

  • కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ఎంతో శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఒక శుభకార్యం గురించి ఆలోచిస్తారు. వ్యాపారులకు ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. తిప్పట ఎక్కువగా ఉంటుంది. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండండి. ఉద్యోగంలో బాగా శ్రమ పెరుగుతుంది.

  • మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. ఆదాయం పెంచుకునే మార్గాల గురించి ఆలోచిస్తారు. అప్పులు తీరుస్తారు. శ్రమ మీద పనులు పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి. పెళ్లి ప్రయత్నాలకు ఇది మంచి సమయం. ఎవరికీ హామీలు ఉండవద్దు. బంధువులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే