AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: సూర్యాస్తమయం తర్వాత ఈ 5 వస్తువులు కొనకూడదట.. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారట!

Things Not to Buy After Sunset Telugu: వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం అశుభంగా భావిస్తారు. ముఖ్యంగా ఇనుము, నూనె, చీపురు వంటి 5 వస్తువులను సాయంత్రం వేళ ఇంటికి తీసుకురాకూడదని చెబుతారు. ఇంతకీ ఆ వస్తువులేంటి? ఈ సమయంలో చేయకూడని పనులేంటో తెలుసుకోండి.

Vastu Tips: సూర్యాస్తమయం తర్వాత ఈ 5 వస్తువులు కొనకూడదట.. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారట!
Things Not To Buy After Sunset Telugu
Rajashekher G
|

Updated on: Nov 16, 2026 | 4:45 PM

Share

Things Not to Buy After Sunset Telugu: హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం ఉండాలంటే కొన్ని వాస్తు నియమాలను పాటించాలని పెద్దలు చెబుతుంటారు. ఇంట్లో వస్తువులను ఎక్కడ ఉంచాలి? ఏ సమయంలో ఏ వస్తువులను కొనుగోలు చేయాలి? అనే విషయాలపై కూడా వాస్తు శాస్త్రంలో కొన్ని సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత చేసే పనులు, కొనుగోలు చేసే వస్తువుల విషయంలో కొన్ని నియమాలను పాటించాలని చెబుతారు. ఈ సమయంలో కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడం అశుభమని, దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుందని సంప్రదాయ విశ్వాసం. ఇంతకీ సూర్యాస్తమయం తర్వాత కొనకూడదని చెప్పే ఐదు వస్తువులు ఏవో తెలుసుకుందాం.

సూర్యాస్తమయం తర్వాత కొనకూడని 5 వస్తువులు

  • ఇనుము: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇనుమును శని గ్రహానికి సంబంధించిన లోహంగా భావిస్తారు. అందుకే సూర్యాస్తమయం తర్వాత ఇనుము వస్తువులను కొనుగోలు చేయకూడదని చెబుతారు. ఇలా చేయడం వల్ల శని సంబంధిత సమస్యలు ఎదురవుతాయని నమ్ముతారు.
  • నూనె: ముఖ్యంగా ఆవ నూనెను సాయంత్రం వేళ కొనుగోలు చేయడం మంచిది కాదని అంటారు. దీనివల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని విశ్వాసం.
  • పదునైన వస్తువులు: సూదులు, కత్తెరలు, కత్తులు వంటి పదునైన వస్తువులను సూర్యాస్తమయం తర్వాత కొనకూడదని చెబుతారు. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, మనస్పర్థలు పెరుగుతాయని భావిస్తారు.
  • చీపురు: హిందూ సంప్రదాయంలో చీపురును లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు. అందుకే సాయంత్రం, రాత్రి వేళల్లో చీపురు కొనుగోలు చేయడం అశుభమని, ఆర్థిక సమస్యలకు కారణమవుతుందని నమ్ముతారు.
  • పాలు, తోలు వస్తువులు: సూర్యాస్తమయం తర్వాత పాలు, నల్లని లేదా తోలుతో తయారైన చెప్పులు కొనడం కూడా మంచిది కాదని కొన్ని వాస్తు విశ్వాసాలు చెబుతున్నాయి.

సూర్యాస్తమయం తర్వాత చేయకూడని పనులు

సాయంత్రం వేళ ఇంట్లోని చెత్తను బయట పారవేయకూడదని పెద్దలు చెబుతారు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంటిని విడిచిపెట్టి వెళ్లిపోతుందని నమ్మకం. అలాగే సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కను తాకడం, ఆకులను కోయడం చేయకూడదని చెబుతారు. ఈ సమయంలో తులసి మాత విశ్రాంతి తీసుకుంటుందని విశ్వసిస్తారు. అంతేకాకుండా పాలు, పెరుగు, ఉప్పు, పంచదార, పసుపు, డబ్బును ఇతరులకు ఇవ్వకూడదని, సాయంత్రం బట్టలు ఉతకడం కూడా నివారించాలని సంప్రదాయాలు సూచిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న విషయాలు వాస్తు, జ్యోతిష్య శాస్త్రాలు, మతపరమైన సంప్రదాయ విశ్వాసాల ఆధారంగా అందించినవి. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని కేవలం విశ్వాసాలు, సంప్రదాయాల కోణంలో మాత్రమే పరిగణించగలరు.)

Follow Us