AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ట్రాఫిక్ పోలీసులను చూసి పరిగెత్తిన వ్యక్తి.. పట్టుకుని చెక్ చేయగా..

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు ఓ యువకుడి గంజాయి వ్యవహారాన్ని బయటపెట్టాయి. పోలీసులను చూడగానే స్కూటీని రోడ్డుపై వదిలేసి పరుగులు తీసిన యువకుడిని వెంబడించి పట్టుకున్న గోషామహల్‌ ట్రాఫిక్‌ పోలీసులు.. అతడి జేబులో గంజాయి పొట్లాలను గుర్తించారు. దీంతో అతడిని అఫ్జల్‌గంజ్‌ పోలీసులకు అప్పగించారు.

Hyderabad: ట్రాఫిక్ పోలీసులను చూసి పరిగెత్తిన వ్యక్తి.. పట్టుకుని చెక్ చేయగా..
Hyderabad Ganja Case
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Nov 16, 2026 | 6:02 PM

Share

హైదరాబాద్‌లో గోషామహల్ ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో గంజాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరుగుతున్న సమయంలో పోలీసులను చూసిన ఓ యువకుడు ఒక్కసారిగా స్కూటీ వదిలేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసులు అతడిని వెంబడించి పట్టుకోవడంతో అసలు విషయం బయటపడింది. హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్ మెయిన్ జంక్షన్ సమీపంలో గోషామహల్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో స్కూటీపై వచ్చిన ఓ యువకుడు పోలీసులను చూసి భయంతో స్కూటీని అక్కడే వదిలేసి పరుగులు తీశాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా కలకలం నెలకొంది.

యువకుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. అతడు పారిపోకుండా వెంబడించి పట్టుకున్నారు. అనంతరం అతడిని తనిఖీ చేయగా జేబులో గంజాయి పొట్లాలు బయటపడ్డాయి. దీంతో పోలీసులు కూడా నివ్వెరపోయిన పరిస్థితి. దీంతో వెంటనే గోషామహల్ ట్రాఫిక్ పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని, గంజాయి పొట్లాలతో పాటు అతడిని అఫ్జల్‌గంజ్ లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై అఫ్జల్‌గంజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి వద్ద గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి నుంచి తీసుకున్నాడు? వ్యక్తిగత వినియోగానికా లేక ఇతరులకు సరఫరా చేసేందుకు తీసుకెళ్తున్నాడా? అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు.

సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని గుర్తిస్తుంటారు. కానీ ఈ తనిఖీల సమయంలో పోలీసులను చూసి పారిపోయిన యువకుడి జేబులో గంజాయి పొట్లాలు బయటపడటం ఆసక్తికరంగా మారింది. ట్రాఫిక్ తనిఖీల్లో పోలీసుల అప్రమత్తతతో మరో గంజాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Follow Us
ట్రాఫిక్ పోలీసులను చూసి లగెత్తాడు... పట్టుకుని తనిఖీ చేయగా షాక్
ట్రాఫిక్ పోలీసులను చూసి లగెత్తాడు... పట్టుకుని తనిఖీ చేయగా షాక్
వృశ్చిక రాశిలో రవి.. వచ్చే నెల రోజులు వీరికి గోల్డెన్ డేస్..!
వృశ్చిక రాశిలో రవి.. వచ్చే నెల రోజులు వీరికి గోల్డెన్ డేస్..!
హీరోయిన్ నజ్రియాకు ఇంత అందమైన చెల్లి ఉందా? పెళ్లి ఫొటోస్ వైరల్
హీరోయిన్ నజ్రియాకు ఇంత అందమైన చెల్లి ఉందా? పెళ్లి ఫొటోస్ వైరల్
బాక్సాఫీస్ ఫైట్‌లో తండ్రి - కొడుకు.. హిట్ కొట్టేదెవరో ???
బాక్సాఫీస్ ఫైట్‌లో తండ్రి - కొడుకు.. హిట్ కొట్టేదెవరో ???
లోన్ తీసుకున్న వ్యక్తి ఎగ్గొడితే హామీదారుడు చెల్లించాల్సిందేనా..?
లోన్ తీసుకున్న వ్యక్తి ఎగ్గొడితే హామీదారుడు చెల్లించాల్సిందేనా..?
ఐదేళ్లకే అమ్మ ప్రేమకు దూరమై.. కన్నీరు పెట్టిస్తున్న చిన్నారి
ఐదేళ్లకే అమ్మ ప్రేమకు దూరమై.. కన్నీరు పెట్టిస్తున్న చిన్నారి
ఉదయం చేసిన చపాతీలు సాయంత్రం వరకు మెత్తగా ఉంటాయ్..
ఉదయం చేసిన చపాతీలు సాయంత్రం వరకు మెత్తగా ఉంటాయ్..
ఇది తాచుపాము అనుకుంటే పొరపడినట్లే..
ఇది తాచుపాము అనుకుంటే పొరపడినట్లే..
బాక్సాఫీస్ వద్ద సునామీ.. 10 రోజుల్లోనే రూ. 242 కోట్ల వసూల్లు..
బాక్సాఫీస్ వద్ద సునామీ.. 10 రోజుల్లోనే రూ. 242 కోట్ల వసూల్లు..
సన్న కారప్పూస చేసారంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు
సన్న కారప్పూస చేసారంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు