AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sun Transit: వృశ్చిక రాశిలో రవి.. వచ్చే నెల రోజులు వీరికి గోల్డెన్ డేస్..!

Surya Gochar 2026: వృశ్చిక రాశిలో రవి సంచారం కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలకమైన మార్పులకు దారితీయనుంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులతో పాటు సామాజికంగా కూడా మంచి గుర్తింపు లభించే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఐదు రాశుల వారికి ఈ గ్రహ సంచారం ప్రత్యేకంగా కలిసిరానుంది. ఇంతకీ ఆ అదృష్ట రాశులేవి? వీరికి ఎలాంటి శుభ ఫలితాలు కలగనున్నాయి?

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 16, 2026 | 5:59 PM

Share
ఈ నెల(నవంబర్) 16 సాయంత్రం నుంచి డిసెంబర్ 17 ఉదయం వరకు వృశ్చిక రాశిలో సంచారం చేయబోతున్న రవి వల్ల కొన్ని రాశులవారి జీవితంలో పురోభివృద్ధి ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. రవి ఉపచయ స్థానాల్లో (వృద్ధి స్థానాల్లో).. అంటే 3, 6, 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు తప్పకుండా అందలాలు ఎక్కిస్తాడని, శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. దాని ప్రకారం మిథునం, కన్య, మకరం, కుంభరాశుల వారు ఎక్కువగా లబ్ధి పొందే అవకాశం ఉంది. దాంతో పాటు రాశ్యధిపతిగా రవి చతుర్థ స్థానంలో ప్రవేశించడం వల్ల సింహ రాశివారు కూడా బాగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది.

1 / 6
మిథునం: ఈ రాశికి షష్ట స్థానంలో రవి సంచారం వల్ల ఆస్తి వివాదాల్లో ఘన విజయం, శత్రు, రోగ, రుణ బాధల నుంచి విముక్తి వంటివి తప్పకుండా జరిగే అవకాశం ఉంది. శ్రమ తక్కువ, లాభం ఎక్కు వగా ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెంది ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఏ ప్రయత్నమైనా సక్సెస్ అవుతుంది. ముఖ్యంగా పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఉద్యోగంలో సరైన పదోన్నతి లభిస్తుంది.

2 / 6
సింహం: రాశ్యధిపతి రవి చతుర్థ స్థానంలో సంచారం చేయడం వల్ల రాజయోగాలు కలుగుతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు, పలుకుబడి వృద్ధి చెందుతాయి. ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందడానికి అవకాశం ఉంది. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. గృహ, వాహన యోగాలు కలిగే అవకాశం కూడా ఉంది. రియల్ ఎస్టేట్ వారికి ఇబ్బడిముబ్బడిగా లాభాలు అందుతాయి.

3 / 6
కన్య: ఈ రాశికి తృతీయ స్థానంలో రవి సంచారం వల్ల రాజయోగాలు, రాజపూజ్యాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతికి, వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరగడానికి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావడానికి బాగా అవకాశం ఉంది. సోదరులతో ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. పట్టిందల్లా బంగారమవు తుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

4 / 6
మకరం: ఈ రాశికి లాభ స్థానంలో రవి ప్రవేశించిన దగ్గర నుంచి ఈ రాశివారి ఆదాయం పెరగడం ప్రారం భిస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడు తుంది. ఉద్యోగంలో పదోన్నతులు, జీతభత్యాలు పెరగడం వంటివి జరుగుతాయి.  నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగు తుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అపారంగా లాభిస్తాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

5 / 6
కుంభం: ఈ రాశికి దశమ స్థానంలో రవి ప్రవేశం వల్ల ఈ రాశివారికి ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. వృత్తి, వ్యాపారా లకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ప్రభుత్వ ఉన్నతోద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు.

6 / 6
Follow Us