AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐదేళ్లకే అమ్మ ప్రేమకు దూరమై.. ఆపై అదృష్యమై.. కన్నీరు పెట్టిస్తున్న చిన్నారి విషాద కథ

అమ్మ ఒడిలో.. నాన్న ఆలనలో ఆడి పాడాల్సిన ఓ చిన్నారి.. ఐదేళ్ల వయస్సులోనే తల్లిదండ్రుల ప్రేమకు దూరమైంది. తాతాయ్య దగ్గర పెరుగుతున్న సమయంలో కనిపించకుండా పోయిన ఆ చిన్నారి మరుసటి రోజే చెరువులో శవమై కనిపించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికింగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ఐదేళ్లకే అమ్మ ప్రేమకు దూరమై.. ఆపై అదృష్యమై.. కన్నీరు పెట్టిస్తున్న చిన్నారి విషాద కథ
5 Year Old Girl Found Dead In Pond
N Narayana Rao
| Edited By: |

Updated on: Nov 16, 2026 | 5:47 PM

Share

ముక్కుపచ్చలారని వయసులోనే తల్లిదండ్రుల సంరక్షణకు దూరమైన ఓ చిన్నారి కథ విషాదాంతమైంది. ఇంటి ఆవరణలో ఆడుకుంటూ అదృశ్యమైన ఐదేళ్ల చిన్నారి ఆరాధ్య, తెల్లారే సరికి చెరువులో శవమై తేలింది. ఈ హృదయ విదారక ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మామిడిగుండాల పంచాయతీ పరిధిలోని రాజ్య తండాలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే.. రాజ్య తండా గ్రామానికి చెందిన మాలోతు రవి అనే వ్యక్తి తన కుమార్తెకు ఓ యువకుడితో పెళ్లి జరిపించాడు. ఈ దంపతులకు ఓ పాప పుట్టింది. అయితే, పాప మూడేళ్ల వయసులో ఉన్నప్పుడే ఆమెను భర్త వదిలేసి వెళ్లిపోవడంతో.. రవి తన కుమార్తెకు రెండో వివాహం జరిపించాడు. పెళ్లి తర్వాత ఆమె తన కూతురైన ఆరాధ్యను తండ్రి వద్దే ఉంచి, రెండో భర్తతో కాపురానికి అత్తింటికి వెళ్లిపోయింది. దీంతో ఐదేళ్ల వయసున్న ఆరాధ్యను తాతయ్య రవి తన దగ్గరే ఉంచుకుని బాగోగులు చూసుకుంటున్నాడు.

ఇటీవల రవి తన మనవరాలు ఆరాధ్యను తమ్ముడి ఇంట్లో వదిలి, భార్యతో కలిసి పొలానికి వెళ్లాడు. సాయంత్రం పొలం నుంచి తిరిగి వచ్చేసరికి చిన్నారి కనిపించకుండా పోయింది. ఊరంతా వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆందోళన చెందిన రవి, స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక కోసం గాలింపు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది.

తెల్లవారుజామున మరోసారి బాలిక కోసం గాలింపు చేపట్టగా, గ్రామ సమీపంలోని చెరువులో చిన్నారి మృతదేహం లభ్యమైంది. చెరువులో విగతజీవిగా తేలిన చిన్నారిని చూసి తాతయ్య రవి, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు, చిన్నారి మరణానికి గల పూర్తి కారణాలను రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
లోన్ తీసుకున్న వ్యక్తి ఎగ్గొడితే హామీదారుడు చెల్లించాల్సిందేనా..?
లోన్ తీసుకున్న వ్యక్తి ఎగ్గొడితే హామీదారుడు చెల్లించాల్సిందేనా..?
ఐదేళ్లకే అమ్మ ప్రేమకు దూరమై.. కన్నీరు పెట్టిస్తున్న చిన్నారి
ఐదేళ్లకే అమ్మ ప్రేమకు దూరమై.. కన్నీరు పెట్టిస్తున్న చిన్నారి
ఉదయం చేసిన చపాతీలు సాయంత్రం వరకు మెత్తగా ఉంటాయ్..
ఉదయం చేసిన చపాతీలు సాయంత్రం వరకు మెత్తగా ఉంటాయ్..
ఇది తాచుపాము అనుకుంటే పొరపడినట్లే..
ఇది తాచుపాము అనుకుంటే పొరపడినట్లే..
బాక్సాఫీస్ వద్ద సునామీ.. 10 రోజుల్లోనే రూ. 242 కోట్ల వసూల్లు..
బాక్సాఫీస్ వద్ద సునామీ.. 10 రోజుల్లోనే రూ. 242 కోట్ల వసూల్లు..
సన్న కారప్పూస చేసారంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు
సన్న కారప్పూస చేసారంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు
10 రోజుల్లో పంట చేతికి.. నెలలో మూడు కాపులు.. ఏడాది పొడవున ఆదాయం
10 రోజుల్లో పంట చేతికి.. నెలలో మూడు కాపులు.. ఏడాది పొడవున ఆదాయం
తిరువణ్ణామలైలో కార్తీక దీపోత్సవాలు ప్రారంభం.. మహా దీపం ఎప్పుడంటే?
తిరువణ్ణామలైలో కార్తీక దీపోత్సవాలు ప్రారంభం.. మహా దీపం ఎప్పుడంటే?
చెట్టుపైనుంచి నోట్ల వర్షం.. అసలేం జరిగిందో మీరే చూడండి!
చెట్టుపైనుంచి నోట్ల వర్షం.. అసలేం జరిగిందో మీరే చూడండి!
మీ పంట నష్టపోయారా..? వాట్సప్‌లో దరఖాస్తు చేస్కుంటే పరిహారం..
మీ పంట నష్టపోయారా..? వాట్సప్‌లో దరఖాస్తు చేస్కుంటే పరిహారం..