AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫస్ట్ పాలు మరిగించాలా లేక నీళ్లా..? చాయ్ చేసేటప్పుడు అందరూ చేసే తప్పులు ఇవే..

అలసటగా ఉన్నా, ఆనందంగా ఉన్నా మనందరికీ గుర్తొచ్చే మొదటి పేరు టీ. అయితే, ఒక్కో ఇంట్లో టీ తయారీ ఒక్కోలా ఉంటుంది. కానీ అందరికీ ఒక కామన్ డౌట్ ఉంటుంది.. అదే ముందు నీళ్లు మరిగించి టీ పొడి వేయాలా.. లేక పాలు, నీళ్లు కలిపి ఒకేసారి పెట్టాలా? అని.. మరి పర్ఫెక్ట్ టీ ఎలా చేయాలి..? అంతేకాకుండా టీ వడకట్టాక మనం వృథాగా పడేసే ఆ పిప్పి మీ ఇంటికి, తోటకి ఒక అద్భుతమైన నేచురల్ ప్రొడక్ట్‌గా ఎలా మార్చాలి..? అనేది తెలుసుకుందాం.

Krishna S
|

Updated on: Nov 16, 2026 | 3:48 PM

Share
కోట్లాది మందికి ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు వేడివేడి టీ పడనిదే రోజు గడవదు. కొందరికి ఇది అలవాటు అయితే, మరికొందరికి అలసటను తీర్చే దివ్యౌషధం. అయితే పర్ఫెక్ట్ టీ తయారు చేయడంలో ముందుగా నీటిని మరిగించాలా, లేక పాలతో కలిపి మరిగించాలా అనే విషయంపై ఎప్పటినుంచో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దీనికి ఒకే కచ్చితమైన సమాధానం లేకపోయినా, మనం ఎంచుకునే పద్ధతి టీ రుచిని, రంగును, చిక్కదనాన్ని పూర్తిగా మార్చేస్తుంది.

1 / 5
చాలా ఇళ్లలో అనుసరించే సాంప్రదాయ పద్ధతి ప్రకారం.. ముందుగా నీటిలో టీ ఆకులు వేసి బాగా మరిగిస్తారు. ఇలా చేయడం వల్ల టీ ఆకులలోని అసలైన సారం, రంగు పూర్తిస్థాయిలో బయటకు వస్తాయి. ఫలితంగా మంచి సువాసనతో కూడిన ఘాటైన, ముదురు రంగు టీ సిద్ధమవుతుంది. స్ట్రాంగ్‌గా, ఉత్తేజకరంగా ఉండే టీని ఇష్టపడేవారికి ఈ పద్ధతి అత్యుత్తమమైనది.

2 / 5
మరోవైపు టీ కొంచెం క్రీమీగా, మృదువుగా ఉండాలని కోరుకునేవారు పాలు, నీళ్లు కలిపి ఒకేసారి మరిగించే పద్ధతిని ఎంచుకుంటారు. ఈ విధానంలో టీ ఆకులు పాలలో నెమ్మదిగా ఉడకడం వల్ల చేదు తగ్గి, టీకి చిక్కటి ఆకృతి లభిస్తుంది. నిజానికి పాలు, నీళ్ల నిష్పత్తిని, మరిగించే సమయాన్ని, అలాగే అల్లం, యాలకుల వంటి మసాలాలను మన అభిరుచికి తగ్గట్టుగా మార్చుకుంటూ నచ్చిన రుచిని పొందవచ్చు.

3 / 5
ఇక టీ తయారీ పూర్తయ్యాక మిగిలిపోయే వాడిన టీ పొడిని చాలామంది వృథాగా పారేస్తుంటారు. కానీ దానిని తిరిగి ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వాడిన టీ ఆకులను మరోసారి నీటిలో మరిగించి వడకట్టి, అందులో కొన్ని చుక్కల సుగంధ తైలం కలిపితే మొక్కలకు చక్కటి సహజ క్రిమిసంహారక స్ప్రేగా పనిచేస్తుంది.

4 / 5
అంతేకాకుండా ఇంట్లోని గాజు సామాన్లు, పింగాణీ పాత్రలను తళతళా మెరిసేలా చేయడానికి మరిగించిన టీ నీటిని నేచురల్ క్లీనర్‌గా వాడుకోవచ్చు. అలాగే వాడిన టీ పొడిని ఎండలో బాగా ఆరబెట్టి మొక్కలకు ఎరువుగా వేయడం వల్ల నేల సారవంతమవుతుంది. ఇందులో ఉండే టానిన్‌లు నేల ఆమ్లతను పెంచి, ముఖ్యంగా గులాబీల వంటి పూల మొక్కలు ఏపుగా పెరగడానికి, ఎక్కువ పూలు పూయడానికి ఎంతో దోహదపడతాయి.

5 / 5
Follow Us