AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంటీ.. చంద్రముఖి పాత్ర ఈ హీరోయిన్ మిస్ చేసుకుందా.? ఆమె ఎవరంటే

సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న చిత్రాల్లో ‘చంద్రముఖి’ ఒకటి. హారర్, కామెడీ, థ్రిల్లర్ అంశాలను అద్భుతంగా మేళవించి దర్శకుడు పి. వాసు తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. 2005లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా, ఇప్పటికీ టీవీలో ప్రసారమైతే ఆసక్తిగా చూసే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. 

Rajeev Rayala
|

Updated on: Nov 16, 2026 | 2:25 PM

Share
సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న చిత్రాల్లో ‘చంద్రముఖి’ ఒకటి. హారర్, కామెడీ, థ్రిల్లర్ అంశాలను అద్భుతంగా మేళవించి దర్శకుడు పి. వాసు తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. 2005లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా, ఇప్పటికీ టీవీలో ప్రసారమైతే ఆసక్తిగా చూసే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. ఈ సినిమాలో రజినీకాంత్ తనదైన స్టైల్, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించగా.. చంద్రముఖి పాత్రలో జ్యోతిక కనబరిచిన నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

1 / 5
ముఖ్యంగా ఆమె హావభావాలు, భయపెట్టే నటన ప్రేక్షకులను కట్టిపడేశాయి. గంగ, చంద్రముఖి పాత్రల్లో జ్యోతిక చూపించిన వైవిధ్యం ఆమె కెరీర్‌లోనే గుర్తుండిపోయే ప్రదర్శనగా నిలిచింది. ఇక నయనతార కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. విద్యాసాగర్ అందించిన సంగీతం, పాటలు కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే ఈ సినిమాలో జ్యోతిక పోషించిన చంద్రముఖి పాత్రకు మొదట మరో హీరోయిన్‌ను అనుకున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది.

2 / 5
ఆ అవకాశం అందుకోవాల్సిన నటి సదా అని అప్పట్లో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దర్శకుడు పి. వాసు ఈ పాత్ర కోసం సదాను సంప్రదించగా, అప్పటికే ఆమె ఇతర సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఆ అవకాశాన్ని అందుకోలేకపోయిందని సమాచారం. దీంతో ఆ పాత్ర చివరకు జ్యోతికను వరించింది. జ్యోతిక తన అద్భుతమైన నటనతో ఆ పాత్రకు పూర్తిస్థాయి న్యాయం చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఇదే సమయంలో సదా కెరీర్‌లో మరో కీలకమైన సినిమా విడుదలైంది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన ‘అపరిచితుడు’ సినిమాలో ఆమె కథానాయికగా నటించింది.

3 / 5
2005లో విడుదలైన ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంతో సదాకు మంచి గుర్తింపు వచ్చింది. ఒకవేళ చంద్రముఖి సినిమాలో నటించి ఉంటే ఆమె కెరీర్‌లో మరో ప్రత్యేకమైన పాత్ర చేరి ఉండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం సదా సినిమాల సంఖ్యను తగ్గించినప్పటికీ, బుల్లితెరపై మాత్రం సందడి చేస్తోంది. పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటోంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటోంది. నటనతో పాటు వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీపై ఆసక్తి పెంచుకున్న సదా.. ప్రకృతిలోని అందాలను, వన్యప్రాణులను తన కెమెరాలో బంధిస్తూ మరో కొత్త కోణాన్ని పరిచయం చేస్తోంది.

4 / 5
మరోవైపు చంద్రముఖి కథను కొనసాగిస్తూ దర్శకుడు పి. వాసు ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటించగా, కంగనా రనౌత్ చంద్రముఖి పాత్రలో కనిపించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంది. అయితే మొదటి భాగంలో జ్యోతిక పోషించిన చంద్రముఖి పాత్ర సృష్టించిన ప్రభావాన్ని రెండో భాగం పూర్తిస్థాయిలో అందుకోలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.  

5 / 5
Follow Us