AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

4 నెలలుగా కనిపించకుండా పోయిన 15 ఏళ్ల బాలిక.. తాజాగా ఓ గుహలో..

నాలుగు నెలల క్రితం శ్రీలంకలో అదృశ్యమైన 15 ఏళ్ల బాలిక, తన రెండు నెలల పసికందుతో కలిసి ఒక అటవీ గుహలో ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. బియ్యం కొనుగోలు చేసిన యువకుడిని వెంబడించి దట్టమైన అటవీ ప్రాంతంలోని గుహను గుర్తించారు. ఆ బాలిక ఎలాంటి వైద్య సహాయం లేకుండానే గుహలోనే ప్రసవించింది.

4 నెలలుగా కనిపించకుండా పోయిన 15 ఏళ్ల బాలిక.. తాజాగా ఓ గుహలో..
Sri Lanka Missing Girl
Ram Naramaneni
|

Updated on: Nov 16, 2026 | 3:20 PM

Share

నాలుగు నెలల క్రితం అదృశ్యమైన 15 ఏళ్ల బాలిక.. చివరకు రెండు నెలల పసికందుతో కలిసి ఓ దట్టమైన అడవిలోని గుహలో కనిపించింది. కనీస సౌకర్యాలు లేని ఆ గుహలోనే ఆమె బిడ్డకు జన్మనిచ్చినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీలంకలో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

శ్రీలంకలోని ఉడుదుంబర పరిధిలో ఉన్న ఓ గ్రామానికి చెందిన బాలిక జులై 13న అదృశ్యమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అప్పటి నుంచి ఆమె కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో నవంబర్‌ 14న నకిల్స్‌ పర్వత ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో బాలిక ఆచూకీ లభించింది. అయితే ఆమె ఒంటరిగా లేదు.. రెండు నెలల పసికందుతో కలిసి ఓ గుహలో నివసిస్తోంది.

పోలీసుల దర్యాప్తులో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు సమీపంలోని దుకాణంలో భారీ మొత్తంలో బియ్యం, ఇతర ఆహార పదార్థాలు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి కదలికలపై అనుమానం వచ్చి వెంబడించగా.. జనావాసాలకు దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్‌ షీట్లతో కప్పిన ఓ గుహ కనిపించింది. లోపలికి వెళ్లి చూడగా.. ఆ బాలిక తన పసికందుతో కనిపించింది.

ఆ గుహలోనే ఎలాంటి వైద్య సహాయం లేకుండా బాలిక ప్రసవించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో శిశువుకు తండ్రిగా భావిస్తున్న 23 ఏళ్ల యువకుడితో పాటు, అతడికి సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ బంధువును పోలీసులు అరెస్టు చేశారు. బాలిక పరిస్థితి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నాలుగు నెలలుగా కనిపించకుండా పోయిన బాలిక.. చివరకు పసికందుతో అడవిలోని గుహలో కనిపించడంతో ఈ ఘటన శ్రీలంకలో చర్చనీయాంశంగా మారింది.

Follow Us
4 నెలలుగా ఆమె ఆచూకి కోసం పోలీసుల వెతుకుతూనే ఉన్నారు.. తాజాగా..
4 నెలలుగా ఆమె ఆచూకి కోసం పోలీసుల వెతుకుతూనే ఉన్నారు.. తాజాగా..
గ్రాండ్‌గా టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నిశ్చితార్థం..
గ్రాండ్‌గా టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నిశ్చితార్థం..
కుజ దోషంతో కుటుంబ జీవితంలో సమస్యలు.. ఈ రాశుల వారు జాగ్రత్త!
కుజ దోషంతో కుటుంబ జీవితంలో సమస్యలు.. ఈ రాశుల వారు జాగ్రత్త!
కార్తీక మాసంలో అరుణాచలం వెళ్లాలనుకుంటున్నారా..? IRCTC బంపర్ ఆఫర్
కార్తీక మాసంలో అరుణాచలం వెళ్లాలనుకుంటున్నారా..? IRCTC బంపర్ ఆఫర్
మీ దుంపతెగ.. అది సింహం రా సామీ.. వీళ్లు ఏం చేశారో మీరే చూడండి..
మీ దుంపతెగ.. అది సింహం రా సామీ.. వీళ్లు ఏం చేశారో మీరే చూడండి..
బద్రీనాథ్ ఆలయంలో వింత ఆచారం.. ద్వారాలు మూసే ముందు రావల్ జీ స్త్రీ
బద్రీనాథ్ ఆలయంలో వింత ఆచారం.. ద్వారాలు మూసే ముందు రావల్ జీ స్త్రీ
చంద్రముఖి పాత్ర ఈ హీరోయిన్ మిస్ చేసుకుందా.?
చంద్రముఖి పాత్ర ఈ హీరోయిన్ మిస్ చేసుకుందా.?
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి చిరంజీవి వినతి
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి చిరంజీవి వినతి
చలికాలంలోనూ ఈజీగా బరువు తగ్గొచ్చు.. ఈ చిన్న మార్పులతో ఫిట్‌గా..
చలికాలంలోనూ ఈజీగా బరువు తగ్గొచ్చు.. ఈ చిన్న మార్పులతో ఫిట్‌గా..
కాంతివంతమైన, మచ్చలేని చర్మం కోసం పచ్చి పాలను ఎలా ఉపయోగించాలి?
కాంతివంతమైన, మచ్చలేని చర్మం కోసం పచ్చి పాలను ఎలా ఉపయోగించాలి?