AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శరీరానికి కొండంత బలాన్నిచ్చే కొబ్బరి రొట్టె.. నోరూరించే స్వీట్ ఇలా చేయండి

ఆధునిక కాలంలో ఎన్ని రకాల బేకరీ కేకులు, స్వీట్లు వచ్చినా మన సంప్రదాయ పిండివంటల రుచికి ఏదీ సాటిరాదు. అందులోనూ పచ్చికొబ్బరి, బెల్లంతో చేసే కొబ్బరి రొట్టె అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? శరీరానికి ఎంతో బలాన్నిచ్చే ఈ వంటకాన్ని కేక్ తిన్నంత కమ్మగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సాధారణంగా దీనిని బియ్యపు రవ్వతో చేస్తుంటారు, కానీ ఇంట్లో ఉండే మామూలు బియ్యంతోనే ఎంతో సులభంగా దీనిని సిద్ధం చేయవచ్చు.

Phani CH
|

Updated on: Nov 16, 2026 | 4:14 PM

Share
కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పచ్చికొబ్బరి తురుము 1 కప్పు, బెల్లం 1 కప్పు, నీళ్లు 2 కప్పులు, నానబెట్టిన పచ్చి శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు పావు టీస్పూన్, యాలకుల పొడి అర టీస్పూన్, నెయ్యి 5 టీస్పూన్లు (పిండిలో 2 టీస్పూన్లు, రొట్టె కాల్చడానికి 3 టీస్పూన్లు).

1 / 5
ముందుగా ఒక కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి, నీళ్లు లేకుండా పూర్తిగా వంపేసి మూతపెట్టి పక్కన ఉంచాలి. బియ్యం తేమను పీల్చుకుని పొడిపొడిగా అయ్యేలోపు, పచ్చికొబ్బరి ముక్కలను మిక్సీ జార్‌లో వేసి మరీ పేస్ట్‌లా కాకుండా కొబ్బరి పలుకులు తగిలేలా తురుములా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొడిపొడిగా మారిన బియ్యాన్ని మిక్సీలో వేసి సన్నటి బొంబాయి రవ్వలా గ్రైండ్ చేసుకోవాలి.

2 / 5
తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఒక కప్పు బెల్లం తురుము, రెండు కప్పుల నీళ్లు పోసి కరిగించాలి. ఇందులోనే గ్రైండ్ చేసిన పచ్చికొబ్బరి తురుము, ముందుగా నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు వేసి ఉడికించాలి. మధ్యమధ్యలో తగిలే ఈ శనగపప్పు రొట్టెకు మంచి రుచిని ఇస్తుంది. బెల్లం పూర్తిగా కరిగి నీళ్లు మరగడం మొదలయ్యాక పావు టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ యాలకుల పొడి వేసి కలపాలి.

3 / 5
ఇప్పుడు మంటను పూర్తిగా తగ్గించి, సిద్ధం చేసుకున్న బియ్యపు రవ్వను కొద్దికొద్దిగా పోస్తూ ఉండలు కట్టకుండా కలపాలి. ఇందులో రెండు టీస్పూన్ల నెయ్యి వేసి, మిశ్రమం ఉప్మాలా కాస్త దగ్గరపడే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అనంతరం స్టవ్ మీద అడుగు మందంగా ఉండే వెడల్పాటి పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో ఉడికించుకున్న కొబ్బరి రవ్వ మిశ్రమాన్ని వేసి, చేత్తో లేదా గరిటెతో సమానంగా పరచాలి.

4 / 5
మూతపెట్టి సన్నని మంటపై అంచులు బంగారు రంగులోకి వచ్చేవరకు నిదానంగా కాలనివ్వాలి. ఒకవైపు చక్కగా కాలిన తర్వాత స్టవ్ ఆపి, రొట్టె విరిగిపోకుండా కాస్త చల్లారనివ్వాలి. తర్వాత ప్లేట్ సహాయంతో రొట్టెను జాగ్రత్తగా తిరగేసి, పాన్‌లో మరికొద్దిగా నెయ్యి వేసి రెండో వైపు కూడా ఎర్రగా కాల్చుకోవాలి. బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే ఈ వేడివేడి కొబ్బరి రొట్టెను ముక్కలుగా కోసి వడ్డిస్తే ఎంతో రుచిగా ఉంటుంది.

5 / 5
Follow Us