SIRలో ఓటు కోల్పోయినవారికి ఈసీ బిగ్ రిలీఫ్.. ఇలా చేస్తే సమస్యలు ఉండవ్.. మళ్లీ ఛాన్స్..
ఓటర్ల జాబితాలో మీ పేరు లేదా..? ఈసీ నుంచి బిగ్ రిలీఫ్ అందింది. ఫారం 6 సమర్పించి మళ్లీ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇలా దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి విచారణ ఉండదని తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు ఈసీ వివరాలు అందించింది.

SIR డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేని ఓటర్లకు ఈసీ భారీ ఊరట కలిగించింది. ఫామ్-6 దరఖాస్తు చేసినా ఎలాంటి చట్టపరమైన చర్యలు ఉండవని ఈసీ స్పష్టం చేసింది. ఓటరు జాబితాలో పేరు మళ్లీ చేర్చుకునేందుకు ఫామ్-6 దాఖలు చేయవచ్చని ఈసీ తెలిపింది. సంబంధిత ఓటరుకు మరో నియోజకవర్గంలో ఓటు ఉండకూడదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. గతంలో ఓటర్లుగా ఉండగా.. ఇటీవల చేపట్టిన ఎస్ఐఆర్ డ్రాఫ్ట్స్ జాబితాలో చాలామంది పేర్లు గల్లంతమయ్యాయి. దీంతో ఇలాంటివారు మళ్లీ ఫారం 6 సమర్పించి కొత్తగా ఓటు కోసం అప్లై చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇలా దరఖాస్తు చేసుకున్నంత మాత్రాన ఎలాంటి విచారణ ఉండదని ఈసీ తెలిపింది. గతంలో ఓటు కలిగి ఉండి మళ్లీ ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్ 31 కింద చర్యలు తీసుకుంటారనే ప్రచారం నడుస్తున్న వేళ.. ఈసీ ఈ మేరకు స్పష్టతిచ్చింది.
కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు..
సర్ డ్రాఫ్ట్స్ ఫైల్‌లో పేరు లేనివారు కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇలాంటప్పుడు ఎలాంటి విచారణ ఉండదని సుప్రీంకోర్టుకు ఈసీ తెలిపింది. అయితే ఇలాంటివారు మరో నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదు కాకూడదని చెప్పుకొచ్చింది. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా వేరే ప్రాంతాల్లో నివసిస్తున్నవారు, వలస వెళ్లినవారు, సర్‌లో పాల్గొననివారి పేర్లను ఈసీ తొలగించింది. ఈ క్రమంలో వీరిలో అర్హులను తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చాలని సుప్రీంకోర్టు సూచించగా.. ఈసీ అందుకనుగుణంగా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా మళ్లీ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేవారిపై ఎలాంటి చర్యలు ఉండవని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
ఆన్‌లైన్‌లో ఎన్యుమరేషన్ ఫారం సమర్పణ
ఎస్‌ఐఆర్‌లో భాగంగా గతంలో ఎన్యుమరేషన్ ఫారం అందించనివారు ఇప్పుడు సమర్పించవచ్చు. అనుబంధం-బీలో గతంలో ఫామ్ ఇవ్వకపోవడానికి గల కారణాలను పొందుపర్చవచ్చు. మీ ప్రాంత బీఎల్‌వో, ఈఆర్‌వో, ఏఈఆర్‌వోలకు దీనిని సమర్పించవచ్చు. స్వయంగా సమర్పించడం లేదా కుటుంబసభ్యుల ద్వారా అందించడం లాంటివి చేయవచ్చు. అలాగే ఈసీఐనెట్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఎన్యుమరేషన్ ఫారం అందించవచ్చు. ప్రస్తుతానికి ఫారం 6లో ఎలాంటి మార్పులు చేయలేదని ఈసీ స్పష్టం చేసింది. ఎస్‌ఐఆర్ అనేది చట్టబద్దమైన ప్రక్రియ అని, రాజ్యంగబద్ద బాధ్యతను అని సుప్రీంకోర్టకు ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకతను కాపాడటం తమ బాధ్యత అని పేర్కొంది.
