Tollywood : ఇదెక్కడి సినిమా రా నాయనా.. 10 రోజుల్లోనే రూ.242 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లను అల్లాడిస్తున్న మూవీ..
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఓ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. పాజిటివ్ మౌత్ టాక్ అందుకుంటూ థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తుంది. ఈ చిత్రానికి రోజు రోజుకీ మరింత రెస్పాన్స్ వస్తుండగా, కేవలం పది రోజుల్లోనే రూ.242 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘సీన్’ మూవీ థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. సుమారు రూ. 50-60 కోట్ల పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, విడుదలైన కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి పది రోజుల్లో ఇండియా వ్యాప్తంగా రూ. 136 కోట్ల నెట్ వసూళ్లు రాగా, గ్రాస్ పరంగా రూ. 158.55 కోట్లు నమోదయ్యాయి.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: ఏం ట్విస్టులు రా బాబూ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..
విదేశీ మార్కెట్లలోనూ ఈ సినిమా తన జోరును చూపుతూ ఏకంగా రూ. 83.50 కోట్లు రాబట్టింది. ఇండియా, ఓవర్సీస్ కలెక్షన్లు అన్నీ కలుపుకుంటే, కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 242.05 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్‌లో సూర్య కెరీర్‌లోనే ఆల్-టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్‌గా రికార్డ్ సృష్టించింది. గతంలో వచ్చిన ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రాల రికార్డులను అధిగమించి ఓవర్సీస్‌లో అద్భుతమైన వసూళ్లను సాధించింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : నన్ను అహాంకారి అనుకున్నారు.. 1500 సినిమాలు చేసినా ఏమీ మిగల్లేదు.. సీనియర్ నటుడు..
అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రం రూ. 30.55 కోట్ల గ్రాస్‌ను రాబట్టి సునాయాసంగా బ్రేక్ ఈవెన్ మార్క్‌ను దాటేసి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చిపెడుతోంది. ఈ ఏడాది ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతున్న సూర్య ఖాతాలో ఈ చిత్రం మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పక్కా కమర్షియల్ హంగులతో పాటు బలమైన కథాంశం ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సూర్య కెరీర్‌లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలతో పోలిస్తే, ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్‌లో ఆల్-టైమ్ రికార్డులను తిరగరాసింది. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా తదితర విదేశీ మార్కెట్లలో తెలుగు, తమిళ వెర్షన్లకు ప్రీమియర్ షోల నుంచి భారీ కలెక్షన్లు నమోదయ్యాయి.
ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. 20 ఏళ్లుగా తగ్గని స్టార్ డమ్..
ఎక్కువ మంది చదివినవి : Gulabi Movie: ఒక్క పాటతో స్టార్ డమ్.. గులాబీ సినిమాను మిస్సైన హీరోయిన్.. ఎవరంటే..
