AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nazriya Nazim: చెల్లి పెళ్లిలో సందడి చేసిన హీరోయిన్ నజ్రియా.. ఫొటోస్ వైరల్.. వరుడు ఎవరంటే?

చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందం, యాక్టింగ్ అన్నిటికీ మించి తన ఎక్స్ ప్రెషన్స్ తో చాలా మందికి ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది నజ్రియా నజిమ్. ఇటీవలే హీరో సూర్య నటించిన సీన్ సినిమాలో 'మాయ'గా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించిందీ అందాల తార.

Nazriya Nazim:  చెల్లి పెళ్లిలో సందడి చేసిన హీరోయిన్ నజ్రియా.. ఫొటోస్ వైరల్.. వరుడు ఎవరంటే?
Nazriya Nazim
Basha Shek
|

Updated on: Nov 16, 2026 | 5:53 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు వైవాహిక బంధం లోకి అడుగుపెడుతున్నారు. ఇటీవలే మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ కావ్యా మారన్ తో కలిసి పెళ్లిపీటలెక్కాడు. ఇక టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం కూడా గ్రాండ్ గా జరిగింది. త్వరలోనే ఈ మెగా హీరో మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టనున్నాడు. ఇక హనుమాన్ హీరో కూడా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇవాళ (నవంబర్ 16) అతని నిశ్చితార్థం వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. తాజాగా ప్రముఖ హీరోయిన్ నజ్రియా నజీమ్ చెల్లెలి పెళ్లి కూడా అయిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా నజ్రియానే సోషల్ మీడియా ద్వారా అభిమానులత పంచుకుంది. చెల్లి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఆమె.. ‘నా చిట్టి చెల్లికి పెళ్లి అయిపోయింది. ఆమెను ఎత్తుకొని తిరిగిన జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయి. ముఖ్యంగా నా చిన్న చెల్లితో నేను నిన్ననే ఆడుకున్నట్టు అనిపిస్తోంది. కానీ అప్పుడే ఆమెకు పెళ్లయిపోయింది. నువ్వు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని, నీ అందమైన చిరునవ్వు ఎప్పటికీ నిలిచిపోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. సోహైల్.. మీకు మా కుటుంబంలోకి స్వాగతం పలుకుతున్నాను’ అంటూ నూతన వధూవరులకు విషెస్ చెప్పింది నజ్రియా.

ఇవి కూడా చదవండి

నజ్రియా షేర్ చేసిన పెళ్లి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. నజ్రియా చెల్లి కూడా తన అక్కలాగే చాలా క్యూట్ గా ఉందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇక నజ్రియా నజీమ్ విషయానికి వస్తే.. యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత 2013 లో వచ్చిన మ్యాడ్ డాడ్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 2013లో వచ్చిన రాజా రాణి సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. కెరీర్ లో ఎక్కువగా తమిళం, మలయాళం సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ 2022లో అంటే సుందరానికి సినిమాతో మొదటిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇందులో నాని హీరోగా నటించాడు. ఆ తర్వాత ఆమె లీడ్ రోల్ లో నటించిన సూక్ష్మ దర్శిని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక తాజాగా సీన్ సినిమాతో మరో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. సూర్య హీరోగా నటించిన ఈ సినిమాలో మాయ అనే ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి.

చెల్లి పెళ్లిలో హీరోయిన్ నజ్రియా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హీరోయిన్ నజ్రియాకు ఇంత అందమైన చెల్లి ఉందా? పెళ్లి ఫొటోస్ వైరల్
హీరోయిన్ నజ్రియాకు ఇంత అందమైన చెల్లి ఉందా? పెళ్లి ఫొటోస్ వైరల్
బాక్సాఫీస్ ఫైట్‌లో తండ్రి - కొడుకు.. హిట్ కొట్టేదెవరో ???
బాక్సాఫీస్ ఫైట్‌లో తండ్రి - కొడుకు.. హిట్ కొట్టేదెవరో ???
లోన్ తీసుకున్న వ్యక్తి ఎగ్గొడితే హామీదారుడు చెల్లించాల్సిందేనా..?
లోన్ తీసుకున్న వ్యక్తి ఎగ్గొడితే హామీదారుడు చెల్లించాల్సిందేనా..?
ఐదేళ్లకే అమ్మ ప్రేమకు దూరమై.. కన్నీరు పెట్టిస్తున్న చిన్నారి
ఐదేళ్లకే అమ్మ ప్రేమకు దూరమై.. కన్నీరు పెట్టిస్తున్న చిన్నారి
ఉదయం చేసిన చపాతీలు సాయంత్రం వరకు మెత్తగా ఉంటాయ్..
ఉదయం చేసిన చపాతీలు సాయంత్రం వరకు మెత్తగా ఉంటాయ్..
ఇది తాచుపాము అనుకుంటే పొరపడినట్లే..
ఇది తాచుపాము అనుకుంటే పొరపడినట్లే..
బాక్సాఫీస్ వద్ద సునామీ.. 10 రోజుల్లోనే రూ. 242 కోట్ల వసూల్లు..
బాక్సాఫీస్ వద్ద సునామీ.. 10 రోజుల్లోనే రూ. 242 కోట్ల వసూల్లు..
సన్న కారప్పూస చేసారంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు
సన్న కారప్పూస చేసారంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు
10 రోజుల్లో పంట చేతికి.. నెలలో మూడు కాపులు.. ఏడాది పొడవున ఆదాయం
10 రోజుల్లో పంట చేతికి.. నెలలో మూడు కాపులు.. ఏడాది పొడవున ఆదాయం
తిరువణ్ణామలైలో కార్తీక దీపోత్సవాలు ప్రారంభం.. మహా దీపం ఎప్పుడంటే?
తిరువణ్ణామలైలో కార్తీక దీపోత్సవాలు ప్రారంభం.. మహా దీపం ఎప్పుడంటే?