Winter: మనుషులకే కాదండోయ్.. దేవుళ్లకూ చలేసేస్తోంది.. భక్తులు ఏం చేశారో తెలిస్తే దండం పెట్టాల్సిందే..

చలి చంపేస్తోంది. సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం పది గంటల వరకు చల్లని వాతావరణం నెలకొంటోంది. పలు ప్రదేశాల్లో ఈ సమయాల్లో మార్పులు ఉన్నా.. దేశం మొత్తం చలి గుప్పిట చిక్కుకుని వణికిపోతోంది....

Winter: మనుషులకే కాదండోయ్.. దేవుళ్లకూ చలేసేస్తోంది.. భక్తులు ఏం చేశారో తెలిస్తే దండం పెట్టాల్సిందే..
Swetter For Gods Idols
Follow us
Ganesh Mudavath

|

Updated on: Dec 22, 2022 | 4:21 PM

చలి చంపేస్తోంది. సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం పది గంటల వరకు చల్లని వాతావరణం నెలకొంటోంది. పలు ప్రదేశాల్లో ఈ సమయాల్లో మార్పులు ఉన్నా.. దేశం మొత్తం చలి గుప్పిట చిక్కుకుని వణికిపోతోంది. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే.. ఉత్తరాదిలో ఈ పరిస్థితి మరింత అధికం. దీంతో చలి నుంచి రక్షణ పొందేందుకు స్వెట్టర్లు వేసుకోవడం, చలి కాచుకోవడం, హీటర్స్ వాడటం వంటి చిప్స్ ను ఫాలో అవుతున్నారు సిటిజెన్స్. అయితే చలి అనేది కేవలం మనుషులకేనా.. కాదు కాదు.. దేవుళ్ల విగ్రహాలకు కూడా చలేస్తోంది అని అంటున్నారు నార్త్ ఇండియన్స్. అంతే కాకుండా మరో అడుగు ముందుకేసి ఏకంగా విగ్రహాలకు స్వెట్టర్లు వేసేశారు. ఇదంతా ఎందుకంటే.. ఉత్తరాదిలో చలి తీవ్ర చాలా ఎక్కువ. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయి ప్రజలు గజగజలాడుతున్నారు. కాశీలోని విశ్వనాథ్ దేవాలయం సహా మరికొన్ని ఆలయాల్లో దేవతామూర్తులకు చలేయకుండా వెచ్చని దుస్తులతో కప్పేశారు.

అయితే.. వారణాసిలో ఇలా దేవతా విగ్రహాలకు దుప్పట్లు కప్పే సంప్రదాయం దాదాపు వెయ్యేళ్ల నుంచి ఉంది. కాశీ విశ్వనాథ్, చింతామణి గణేశ్, బారా గణేశ్, గోడీయ మఠం దేవాలయాల్లోని విగ్రహమూర్తులకు సంప్రదాయ దుస్తులను కప్పి ఉంచారు. భక్తులు కూడా భగవంతుడికి రక్షణగా దుప్పట్లు, శాలువాలు, వెచ్చని దుస్తులతో కప్పుతున్నారని పూజారి విభూతి నారాయణ్ శుక్లా తెలిపారు.

అంతే కాకుండా ఆలయానికి వస్తున్న భక్తులు చాలా మంది దేవుడికి ఉన్ని దుస్తులు కానుకలుగా సమర్పిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయం బయట దుకాణాల్లోనూ ఉన్ని దుస్తులు విక్రయిస్తున్నారు. కొందరు​ దేవుడి కోసం డిజైనర్​ స్వెటర్​లు తయారు చేసి ఆన్​లైన్​లో విక్రయిస్తుండటం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…