Vastu Tips For Tulasi: తులసి పూజ సమయంలో ఇలాంటి తప్పులు పొరపాటున కూడా చేయకండి..
వాస్తు, మతపరమైన దృక్కోణంలో తులసి మొక్కను పూజించడానికి చాలా నియమాలు ఉన్నాయి. తులసి మొక్కను వాస్తు నియమాల ప్రకారం ఉంచకపోయినా.. లేదా పూజలో ఏదైనా దోషం ఉంటే, ఆ వ్యక్తి అనేక రకాల నష్టాలను చవి చూడాల్సి ఉంటుందని విశ్వాసం.
హిందూ మతంలో తులసి మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు. హిందూ మతాన్ని అనుసరించే ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఖచ్చితంగా ఉంటుంది. తులసి మొక్కను దేవతగా పూజిస్తారు. తులసి మొక్క వాస్తు దోషాల నివారణ, ఔషధ గుణాలతో నిండి ఉంది అంతేకాదు ప్రత్యేక మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. హిందూ మతంలో.. తులసిని లక్ష్మీదేవి అవతారంగా పరిగణిస్తారు. విష్ణువు, కృష్ణుడు, హనుమంతునికి తులసి చాలా ప్రియమైనది . భగవంతుని పూజలో తులసి దళాన్ని నైవేద్యంగా ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలో వాస్తు, మతపరమైన దృక్కోణంలో తులసి మొక్కను పూజించడానికి చాలా నియమాలు ఉన్నాయి. తులసి మొక్కను వాస్తు నియమాల ప్రకారం ఉంచకపోయినా.. లేదా పూజలో ఏదైనా దోషం ఉంటే, ఆ వ్యక్తి అనేక రకాల నష్టాలను చవి చూడాల్సి ఉంటుందని విశ్వాసం. తులసి మొక్కను ఇంట్లో పూజించే నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
తులసిని నాటడానికి, పూజించడానికి నియమాలు
- తులసి మొక్క హిందూ సనాతన ధర్మంలో పూజనీయమైనది. తులసి మొక్క దగ్గర ఎప్పుడూ చెత్త లేదా మురికి ఉండకూడదు. తులసి మొక్క నాటిన ప్రదేశంలో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పెద్దలు సూచించారు. తులసి మొక్క వద్ద శుభ్రంగా లేని ఇళ్లలో పాజిటివ్ ఎనర్జీ ఉండదు.
- తులసి మొక్కను నిత్యం పూజించే వారు ఇంట్లో మాంసం , మద్యం సేవించకూడదు.
- తులసి మొక్క ఉన్న ఇంట.. స్త్రీలను ఎప్పుడూ అవమానించరాదని. అంతేకాదు స్త్రీలను శక్తి స్వరూపిణిగా భావించి గౌరవించాలి. లేదంటే.. లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు.
- తులసి మొక్క చుట్టూ ఎప్పుడూ ముళ్ల మొక్కలను నాటవద్దు. వాస్తులో ఇది అశుభమైనదిగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వలన కుటుంబంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంటుంది.
- వాస్తు ప్రకారం, తులసి మొక్కను ఎల్లప్పుడూ ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచాలి. తులసి మొక్కను ఈ దిశలో ఉంచడం వల్ల సానుకూల శక్తి.. సుఖ సంపదలు లభిస్తాయి.
- తులసి మొక్క దగ్గర ఎంగిలి పాత్రలు లేదా చెప్పులు, బూట్లు ఎప్పుడూ ఉంచకూడదు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)