Zodiac Signs: కొత్త సంవత్సరంలో ఈ రాశివారికి గుడ్ న్యూస్.. నిరుద్యోగులకు పండగే పండగ!

కొత్త సంవత్సరం నిరుద్యోగుల పాలిట ఆశాజ్యోతి కాబోతోంది. ఇంతవరకు ఉద్యోగం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న..

Zodiac Signs: కొత్త సంవత్సరంలో ఈ రాశివారికి గుడ్ న్యూస్.. నిరుద్యోగులకు పండగే పండగ!
Zodiac Signs
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Dec 23, 2022 | 7:34 AM

కొత్త సంవత్సరం నిరుద్యోగుల పాలిట ఆశాజ్యోతి కాబోతోంది. ఇంతవరకు ఉద్యోగం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగం సంపాదించుకొని జీవితాల్లో స్థిరపడటం ఖాయం అని చెప్పవచ్చు. జ్యోతిష పరంగా ఇందుకు ప్రధాన కారణం ఉద్యోగ, ఉపాధి, జీవన కారకుడైన శనిగ్రహం జనవరి 18న తన స్వక్షేత్రమైన కుంభరాశిలోకి మారడం. అంతేకాదు, గురుగ్రహం తనకు ఆప్తమిత్రుడైన కుజుడి రాశి అయిన మేష రాశిలోకి మారటం, అక్కడ రాహువుతో యుతి చెందడం ఎటువంటి వారికైనా ఉద్యోగ పరంగా శుభయోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. పైగా, మేష రాశిలో ఉన్న గురు గ్రహం మీద శని దృష్టి పడటం కూడా ప్రతి వ్యక్తికి ఉద్యోగయోగాన్ని పట్టిస్తుంది. జాతక చక్రంలో గ్రహాల స్థితిగతులు, దశాంతరదశలు ఎంత ప్రతికూలంగా ఉన్నా కేవలం గ్రహసంచారం బాగున్న కారణంగా దాదాపు ప్రతి వ్యక్తి జీవితంలో స్థిరపడటం కచ్చితంగా జరుగుతుంది. అన్ని రాశుల వారికి, అన్ని నక్షత్రాల వారికి ఇది నూటికి నూరుపాళ్ళు వర్తిస్తుందని గ్రహించాలి.

నిరుద్యోగులకు వారి వారి అర్హతలను బట్టి, వారి వారి ప్రయత్నాలను బట్టి ఉద్యోగం రావడం జరుగుతుంది. ఈ యోగం జనవరి 18 నుంచే, అంటే శని కుంభ రాశిలోకి ప్రవేశించిన నాటి నుంచే ప్రారంభం కాబోతోంది. అదేవిధంగా ఇప్పటికే ఉద్యోగాలలో స్థిరపడిన వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ప్రతిభకు గుర్తింపు, అధికారం, అదనపు బాధ్యతలు, ఇష్టమైన ప్రాంతాలకు బదిలీలు వంటివి అనుభవానికి వస్తాయి. విదేశాల్లో ఉద్యోగం, విదేశాల్లో వృత్తిని చేపట్టడం, విదేశాల్లో కొత్తగా వ్యాపారం ప్రారంభించడం వంటివి తప్పకుండా చోటు చేసుకుంటాయి. ఆర్థిక మాంద్యం వల్లనో, ఇతర కారణాల వల్లనో ఉద్యోగం పోవడం అంటూ జరగదు. స్వయం ఉపాధి వారు కూడా ఆశించిన స్థాయిలో పురోగతి సాదిస్తారని చెప్పవచ్చు. శని కుంభరాశి ప్రవేశంతో ప్రతి వారి జీవనంలోనూ మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. సరిగ్గా 30 ఏళ్ల క్రితం శని కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ కారణంగా ఉద్యోగ అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక ఏ రాశి వారికి ఉద్యోగ పరంగా ఏ విధంగా ఉండబోతుందో పరిశీలిద్దాం.

మేషం, వృషభం, మిధునం

మేష రాశి వారికి జనవరి 18 నుంచి లాభ స్థానంలో శని, మేషరాశిలో గురు రాహువుల కలయిక ఎంతగానో లాభిస్తుంది. ఉద్యోగ పరంగా ఇంతవరకు అనుభవానికి రాని అదృష్ట యోగం పడుతుంది. అధికార యోగం ఉంది. ఒకేసారి రెండు మూడు కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా దూర ప్రాంతంలో వీరికి ఉద్యోగం రావటమో, ఉద్యోగంలో ఉన్నవారు దూర ప్రాంతానికి బదిలీ కావటం జరుగుతుంది. వృషభ రాశి వారికి మంచి కంపెనీ నుంచి భారీ జీతాలతో ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ వస్తుంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి స్థిరత్వం లభిస్తుంది. ఈ రాశి వారికి విదేశీయాన సూచనలు కూడా ఉన్నాయి. ఇక మిధున రాశి వారికి మంచి వేతనంతో, ఉద్యోగం రావటానికి అవకాశం ఉంది. ఊహించని విధంగా ఒక ప్రతిష్టాత్మక కంపెనీ నుంచి పిలుపు వస్తుంది. ఇటువంటి చదువులు చదివిన వారైనా ఉద్యోగంలో స్థిరపడటం ఖాయం.

కర్కాటకం, సింహం, కన్య

జనవరి 18న శని కుంభరాశి ప్రవేశంతో కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రారంభం అవుతుంది. సాధారణంగా అష్టమ శని అంటే అష్ట కష్టాలు పడటమే అవుతుంది. కానీ ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి మినహాయింపు లభించబోతోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఈ రాశి వారు ఐశ్వర్యం అనుభవించడం జరుగుతుందని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాణిస్తారు. నిరుద్యోగులు, ఉద్యోగులు మంచి ఉద్యోగంలో, మంచి ఆదాయంతో స్థిరపడటం ఖాయంగా జరుగుతుంది. సింహరాశి విషయానికి వస్తే, ఈ రాశి వారు ఇంత కాలంగా ఉద్యోగ పరంగా అనుభవిస్తున్న కష్టాలకు తెరపడుతుందని చెప్పవచ్చు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. ఆ ఉద్యోగం వల్ల ఈ రాశి వారు రెండు చేతులా సంపాదించడానికి కూడా అవకాశం కలుగుతుంది. ఏ ఉద్యోగంలో చేరితే ఆ ఉద్యోగంలో నిలదొక్కుకుంటారు. జీవితం చక్కని మలుపు తిరుగుతుంది. కన్యా రాశి వారికి ఆరవ రాశి (సర్వీస్) లోకి శని ప్రవేశించడం ఉద్యోగ పరంగా అదృష్టమే అని చెప్పాలి. ఈ రాశికి ఎనిమిదవ రాశి అయిన మేషం లో గురువు రాహు కలవడం వల్ల వీరి జీవితం మొదట చిన్న ఉద్యోగంతో ప్రారంభమై ఆ తరువాత మంచి ఉద్యోగంలో స్థిర పడటం జరుగుతుంది.

తుల, వృశ్చికం, ధనుస్సు

జనవరి 18 తర్వాత నుంచి తులా రాశి వారికి అన్ని విధాల కాలం కలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లోనే కాదు, వ్యాపారంలోనూ, స్వయం ఉపాధిలో కూడా బాగా రాణిస్తారు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వారికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు మంచి ప్రమోషన్ అందుకుంటారు. అధికార యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా బాగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇక వృశ్చిక రాశి వారు ఉద్యోగం నిమిత్తం తాము ఉంటున్న ప్రాంతాన్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది. వేరే నగరంలో ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగాలు చేస్తున్న వారి మీద ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది. ఇక ధనురాశి వారి విషయానికి వస్తే, వీరు ఏలినాటి శని నుంచి విముక్తి పొందడం, రాశి అయిన నాథుడైన గురువు పంచమ రాశిలో రాహువుతో కలవటం ఈ రాశి వారికి తప్పకుండా అదృష్ట యోగం పట్టిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగ పరంగా ఎదుగూ బొదుగు లేని పరిస్థితి నుంచి విముక్తి లభించి, మంచి ఉద్యోగంలోకి మారడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా ఆశించినంతగా పురోగతి ఉంటుంది.

మకరం, కుంభం, మీనం

గత ఐదేళ్లుగా సరైన ఉద్యోగం లేక, జీతాలు లేక, గుర్తింపు లేక స్తబ్దుగా జీవితం గడుపుతున్న మకర రాశి వారికి జనవరి 18 తర్వాత నుంచి ఉద్యోగ జీవితం ఒక్కసారిగా ఊపందుకుంటుంది. క్షణం తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. వీరి శ్రమకు, ప్రతిభకు సరైన గుర్తింపు లభిస్తుంది. కుంభ రాశి వారికి సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగ పరంగా సంపాదన కూడా చాలా బాగుంటుంది. అయితే, ఎక్కువ గంటలు పనిచేయాల్సి రావడం, ఎక్కువ బాధ్యతలు మోయవలసి రావటం వంటివి జరగవచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు మంచి ఉద్యోగానికి మారే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇక ఉద్యోగానికి డోకా ఉండని పరిస్థితి ఏర్పడడం మాత్రం ఖాయం. మీన రాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అవుతున్నప్పటికీ ఉద్యోగ పరంగా నష్టమేమీ ఉండదు. నిరుద్యోగులకు బాగా దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగపరంగా సంపాదన బాగా పెరిగే అవకాశం ఉంది. అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం, ఆదరణ ఉంటాయని చెప్పవచ్చు.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే